Mirzapur 3 review: మిర్జాపూర్ సీజన్ 3 రివ్యూ:
తారాగణం: పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, హర్షిత శేఖర్ గౌర్
దర్శకుడు: గుర్మీత్ సింగ్ మరియు ఆనంద్ అయ్యర్
నిర్మాతలు: ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ
ఒటిటి ప్లాట్ ఫామ్: అమేజాన్ ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్: 2024-07-05
స్టోరీ:
ఈ సారి సీజన్లో కథ గత రెండో సీజన్లో ఒక ఇంటెన్స్ అండ్ సస్పెన్స్ ముగింపు ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచే మొదలవుతుంది అని చెప్పాలి. గుడ్డు పండిట్(అలీ ఫజల్) తన అన్న బబ్లు పండిట్(విక్రాంత్ మెస్సి) అలాగే తన భార్య స్వీటీ లని చంపిన మున్నా త్రిపాఠీ అలియాస్ మున్నా భయ్యా(దివ్యందు శర్మ) ని షూట్ చేసాడు. అయితే ఇదే సమయంలో మిర్జాపూర్ ని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పిన అక్కడి మిర్జాపూర్ కింగ్ అఖండానంద్ త్రిపాఠి(పంకజ్ త్రిపాఠీ) కూడా గాయాలు పాలవుతాడు కానీ ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ సమయంలో మిస్ అయ్యిన అఖండానంద్ త్రిపాఠీ కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించాడు సో అక్కడ పవర్ వార్ మొదలవుతుంది. మిర్జాపూర్ ని వశం చేసుకోవాలని చూస్తుంది ఎవరు? ఆ స్థానాన్ని గుడ్డు పండిట్ తీసుకుంటాడా? రాజు లేని సింహాసనం ఒక ప్రైవేట్ సామ్రాజ్యంలో అప్పటికే ముదిరి ఉన్న వైలెన్స్ ఇంకెలా మారుతుంది? ఈ సమయంలో పవర్ పొలిటిషన్ మాధురి యాదవ్ త్రిపాఠీ(ఇషా తల్వార్) ఏం చేస్తుంది అనే ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ ప్లాట్ తో సీజన్ 3 కనిపిస్తుంది.

విశ్లేషణ:
ఇటీవల ఇండియా వైడ్ గా కూడా ఓటిటిలో ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ఓటిటి సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకొస్తున్న సిరీస్ "మిర్జాపూర్ సీజన్ 3" అనే చెప్పాలి. ఈ ప్రత్యేకమైన సిరీస్ కి ఇండియా వైడ్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేదుకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆడియెన్స్ ఈ సిరీస్ కోసం బాగా ఎదురు చూస్తున్నారు. ఇంత రీచ్ ఉన్న సిరీస్ తాలూకా మూడో ఎడిషన్ ని అయితే ప్రైమ్ వీడియో వారు నేడు అందుబాటులోకి తీసుకొచ్చారు.
కాగా ఈ సిరీస్ ని ఒరిజినల్ హిందీ సహా రీజనల్ భాషలు తెలుగు, తమిళ్ కన్నడ ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదల చేయగా మొత్తం 10 ఎపిసోడ్స్ తో రిలీజ్ కి వచ్చిన ఈ సిరీస్ ఓటిటి ఆడియెన్స్ అంచనాలు అందుకున్నట్టేనా లేదా అనేది అందరిలో మంచి ఆసక్తిగా మారింది. కాగా ఈ సిరీస్ లో కనిపించే మొత్తం 10 ఎపిసోడ్స్ కూడా సీజన్ 3 కంటే ఒకింత బెటర్ అని చెప్పవచ్చు. ఈసారి సీజన్ రచయితలూ అలాగే దర్శకుడు టేకింగ్ కూడా మరికొంత ఇంటెన్స్ గా ట్రై చేసే ప్రయత్నం చేశారు.
అయితే ఈ ప్రయత్నంలో మరికొన్ని కొత్త పాత్రలు డెవలప్ అవుతూ కనిపిస్తుంటాయి. ఈ డెవలప్మెంట్ లోనే చూసే ఆడియెన్స్ కి ఒకింత ఓకే అనిపిస్తుంది కానీ నరేషన్ కొనసాగుతూ ఉండగా ఇవి ఇంకా ఇంకా ఎక్కువవుతూ కనిపిస్తాయి. దీనితో వీక్షకుడికి ఒకింత ఏం జరుగుతుందో సిరీస్ కథనం ఎటు వెళ్తుందో అర్ధం కాదు. అయితే ఈసారి సీజన్లో లో బిల్డప్ చేసిన పలు ట్విస్టులు అలాగే కొన్ని సస్పెన్స్ ఫ్యాక్టర్స్ మాత్రం సో లవర్స్ ని కట్టి పడేస్తాయని చెప్పవచ్చు. పాత్రలు డెవలప్మెంట్ మొదటి కొన్ని ఎపిసోడ్స్ లో కనిపిస్తుంది.

ఇక్కడ నుంచే ట్విస్ట్ లు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా అఖండానంద్ త్రిపాఠీ లేని సమయంలో మిర్జాపూర్ ప్రాంతం, పూర్వాంచల్ ఎలా ఉంది? అక్కడ గ్యాంగ్స్ ఎలా ఆ సమయాన్ని తమకి అనుగుణంగా మార్చుకున్నారు అనే డ్రామా అంతా మంచి ఇంటెన్స్ గా క్రేజీ యాక్షన్ మరియు వైలెన్స్ ఎపిసోడ్స్ తో డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కాగా అసలై మిర్జాపూర్ సీజన్ అంటేనే చాలా మందికి ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ ని డైరెక్టర్ నీట్ గా తీసుకెళ్తూ ఒక క్రేజీ క్లైమాక్స్ తో ముగించడం బాగుంది. అలాగే సీజన్ 4 కి కూడా హింట్ ఇవ్వడం అది కూడా పొయెటిక్ గా ముగించడం వంటివి ఈ సిరీస్ అభిమానులకి ఒక రకమైన శాటిస్ఫ్యాక్షన్ కలిగించవచ్చు.
నటీనటుల పెర్ఫామెన్స్ లు ఎలా ఉన్నాయ్?
అసలు ఈ సిరీస్ కి ప్రధాన బలమైన వాటిలో కనిపించే ఆ పాత్రలు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ప్రతి పాత్రకి జరిగిన క్యాస్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఖాలిన్ భయ్యా నుంచి సీజన్ 3 లో కనిపించే ప్రతి కొత్త పాత్ర కూడా ఆ పాత్రకి సరిపడా లుక్స్ నటనలతో అంతా ఇంప్రెస్ చేస్తారు. అయితే ఈసారి మాత్రం గుడ్డు పండిట్ షో అని చెప్పాలి. పూర్వాంచల్ లో తాను రాజు అయ్యే సత్తా సంపాదించుకున్న తర్వాత తనలోని కొత్త యాంగిల్ అగ్రెషన్ ని గుడ్డు గా అలీ ఫజల్ ఓ రేంజ్ లో పండించాడు.
అలాగే తన చెల్లెలి పాత్రలో కనిపించిన గోలు(శ్వేతా త్రిపాఠి) కి ఈసారి మరీ అంత స్కోప్ దక్కలేదు కానీ ఉన్నంతలో కూడా ఆమె నటన బాగుంది. ఇంకా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఖాలీన్ భయ్యా(పంకజ్ త్రిపాఠి) మరోసారి షైన్ అయ్యారు. అసలు ఈ సిరీస్ తోనే పంకజ్ త్రిపాఠి ఇండియా వైడ్ గా మంచి పేరు తెచ్చుకోగా ఈ సీజన్ లో కూడా తనదైన ఈజ్ తో మరింత బలంగా కనిపిస్తూ ఇంప్రెస్ చేశారు. అలాగే మరో నటుడు విజయ్ వెర్మ డ్యూయల్ రోల్ లో డబుల్ షేడ్స్ తో తన వెర్సటాలిటీ మరోసారి ప్రదర్శించాడు.

ఇంకా ఈ సీజన్లో బాగా అనిపించేది ప్రియన్షు రాబిన్ అమాయకపు పాత్ర అని చెప్పవచ్చు. తన లోని ఎమోషన్స్ ని సీజన్ 2 కంటే మరింత చక్కగా తను ఒక గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ ని ఈ సీజన్లో అందించాడు. ఇక ఇషా తల్వార్ చుట్టూ నడిచే సీన్స్ అందులో ఆమె నటన బాగున్నాయి. తనతో పాటుగా బీనా త్రిపాఠీ, షీబా చద్దా లాంటి ఇతర ఫీమేల్ యాక్టర్స్ కూడా ఈ సీజన్లో కీలక సన్నివేశాల్లో మెప్పిస్తారు.
టెక్నికల్ గా ఎలా ఉంది?
హిందీ మార్కెట్ లో వచ్చే సిరీస్ లు అన్నీ టాప్ నాచ్ లోనే కనిపిస్తాయి. వారి సెటప్ అంతా చాలా నాచురల్ గా ఏ ఫ్రేమ్ లో అయినా కనిపిస్తుంది. ఇది డెఫినెట్ గా మిర్జాపూర్ గత సీజన్లలో కనిపించింది. ఈసారి మూడో ఎడిషన్ లో కూడా కొనసాగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే వైలెన్స్ ఎపిసోడ్స్ లో యాక్షన్ టేకింగ్, కొన్ని ఇంటెన్స్ సీక్వెన్స్ లలో బ్యాక్గ్రౌండ్ అన్నీ వర్కౌట్ అవుతాయి. వీటితో పాటుగా తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ గత సీజన్ల లానే మంచి ఇంప్రెసివ్ గా ఎటువంటి పొరపత్యాలు లేకుండా కట్ చేసిన విధానం బాగుంది. కాగా దర్శకుడు గురుమీత్ సింగ్ ఈసారి బెటర్ గా వర్క్ అందించారు అని చెప్పవచ్చు. సబ్ ప్లాట్ లు కొత్త పాత్రలు కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తాయి కానీ క్రమంగా బిల్డప్ చేసిన డ్రామా ఈ సీజన్లో హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి. గుడ్డు పండిట్ మిర్జాపూర్ కింగ్ గా కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ ఆ నెక్స్ట్ తీసుకున్న డెసిషన్స్ జరిగిన పరిణామాలు మార్పు వంటి వాటిని గురుమీత్ బాగా హ్యాండిల్ చేసాడు.
చివరి మాటగా
మంచి క్రేజ్ అండ్ హైప్ తో వచ్చిన ఈ వైలెన్స్ డ్రామా సిరీస్ అయితే లాస్ట్ సీజన్ తో పోలిస్తే బెటర్ గా సీజన్ 1 తో పోలిస్తే కొంచెం ఓకే గా అనిపిస్తుంది. అయితే ఈసారి సిరీస్ లో కొన్ని ట్విస్ట్ లు ప్రధాన తారాగణ పాత్రలు గుడ్డు పండిట్, ఖాలిన్ భయ్యా ఇంకొందరు ప్రధాన తారాగణం ఈ సిరీస్ ఫ్యాన్స్ కి ట్రీట్ అందిస్తారు. అలాగే సిరీస్ రచయితలూ దర్శకుడు కలిసి బిల్డప్ చేసిన కొన్ని ఎగ్జైటింగ్ మూమెంట్స్ బాగున్నాయి. ఈ సిరీస్ నుంచి కోరుకునే వైలెన్స్, ఎంటర్టైన్మెంట్ కూడా బాగున్నాయి అలాగే క్లైమాక్స్ కూడా వర్కౌట్ అయ్యి మరింత ఎగ్జైట్మెంట్ ని అందిస్తుంది. కాకపోతే సీజన్ ఎపిసోడ్స్ నడుస్తున్న కొద్దీ కొత్త కొత్త పాత్రలు కొన్ని చోట్ల పేలవంగా సాగే నరేషన్ వంటివి చూసేందుకు అంత ఇంపుగా అనిపించవు వీటిని పక్కన పెడితే ఓటిటిలో ఈ సరికొత్త ఇన్స్టాల్మెంట్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అందిస్తుంది. న్యూట్రల్ వీక్షకులని కూడా మెప్పిస్తుంది. గో ఫర్ ఇట్.


Click it and Unblock the Notifications











