For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మిస్ మ్యాచ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.5/5

  ఆట గదరా వంటి ప్రయోగాత్మక చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు హీరో ఉదయ్ శంకర్. కౌసల్యా కృష్ణమూర్తి వంటి క్రీడా నేపథ్యమున్న మంచి చిత్రంతో తెలుగు తెరపై మెరిసింది ఐశ్వర్యా రాజేశ్. వీరిద్దరి కలిసి మిస్‌మ్యాచ్ అంటూ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేశారు. మరి వీరి ప్రయత్నం ఫలించిందా? లేదా? అన్నది చూద్దాం.

   కథ

  కథ

  గోవింద రాజు (ప్రదీప్ రావత్)కు కుస్తీ అంటే ప్రాణం. కన్న అమ్మ కంటే పెంచిన కూతురి కంటే కుస్తీ అంటేనే ఎక్కువ ప్రేమ. తన కూతురు మహాలక్ష్మి ( ఐశ్వర్య రాజేష్) కు కుస్తీలో శిక్షణ ఇస్తాడు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా తీర్చిదిద్దుతాడు. మరో వైపు సిద్ధార్థ్(ఉదయ్ శంకర్)ను గిన్నిస్ బుక్లో ఎక్కేంత మేధావిగా తయారు చేస్తాడు వాళ్ళ నాన్న. ఆటే తప్ప చదువoటే తెలియని మహా లక్ష్మీ.. మేధావి, చదువుల్లో ఫస్ట్ ఉండే సిద్ధుకు ఎలా కుదిరింది అనేదే కథ.

   కథలో ట్విస్టులు

  కథలో ట్విస్టులు

  కూతురు ఏది కావాలంటే అది ఇచ్చే నాన్న.. సిద్ధు కావాలి అంటే ఒప్పుకుంటాడా? పద్దతి గల కుటుంబం, ఆచార సంప్రదాయాలను పాటించే సిద్ధు కుటుంబం.. మహాలక్ష్మి ఫ్యామిలీని ఒప్పుకుందా? ఆ ఊర్లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ కథ ఏంటి? వాటికి ఎదురు తిరిగిన గోవింద రాజు ఏమయ్యాడు? కష్టాల్లో ఉన్న మహాలక్ష్మిని కాపాడటానికి సిద్ధు చేసిన ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి.

  ఫస్ట్ హాఫ్ అనాలిసిస్

  ఫస్ట్ హాఫ్ అనాలిసిస్

  ఓ వైపు మహా లక్ష్మీ కుస్తీ నేర్చుకోవడం.. మరోవైపు చదువుల్లో సిద్ధార్థ్ దూసుకెళ్లడం లాంటి సీన్స్ తో మెల్లగా ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడం బాగుంది. వ్యతిరేక భావాలు, భిన్న పద్ధతులు ఉన్న హీరో హీరోయిన్ లు కలుసుకోవడం.. హీరోతో ప్రేమ లో పడటం లాంటి సన్నివేశాలతో పర్వలేదనిపించాడు. నువ్వే కావాలి అంటూ హీరో వెంట పడటం... కుదరదు అని హీరో నచ్చజెప్పడం లాంటి సీన్లతో అలా ముందుకు తీసుకెళ్లాడు. చివరకు మహాలక్ష్మీ ప్రేమను సిద్దు అర్థం చేసుకొని ఒప్పుకోవడం బాగానే అనిపిస్తుంది. అటుపై ఇంట్లో వారిని ఒప్పించడం కోసం వారు పడే కష్టాలు, పెళ్లి విషయం మాట్లాడేందుకు ఇరు కుటుంబాలు ఒకే చోటుకు రావడం, అక్కడ గొడవ జరగడంతో విడిపోవడం లాంటి సీన్లతో ప్రథమార్థం ముగుస్తుంది. అక్కడక్కడా కామెడీ సీన్లు, ప్రేమ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్‌.. ప్రేక్షకులను మెప్పించే అవకాం ఉంది.

   సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  ప్రథమార్థంలో ఇరు కుటుంబాలకు వచ్చిన మనస్పర్థల కారణంగా విడిపోయిన సిద్దు, మహాలు వారి ప్రేమను తలుచుకుని బాధపడటం లాంటి సీన్లు కాస్త రొటీన్‌గా కనిపించినా ఓకే అనిపించేలానే ఉంది. ఇక ఇక్కడి నుంచే కథ కాస్త డీవియేట్ అయిన ఫీలింగ్ కలిగే అవకాశం ఉంది. ఊరిలోని సిమెంట్ ఫ్యాక్టరీ, దాన్నుంచి వెలువడే రసాయనాల వల్ల పంటలు నాశనం కావడం, ఊరు మొత్తం దానికి వ్యతిరేకంగా నిలవడం లాంటి రొటీన్ సీన్లతో సెకండాఫ్ అలా ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో గోవింద రాజును అరెస్ట్ చేయడం, మహా ఫ్యామిలీ కష్టాల్లో ఉండటం, సిద్దు వచ్చి కాపాడటం లాంటి సీన్లలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేయడం బాగుంది. చివరగా తన తండ్రి కోరిక మేరకు ఏషియన్ గేమ్స్‌లో విజేతగా నిలవడం, ఇరు కుటుంబాలు ఓ మెట్టు దిగి ఇద్దరి ప్రేమకు ఒప్పుకోవడంతో ఎండ్ కార్డ్ పడుతుంది. ద్వితీయార్థంలో కథ కాస్త పక్కకు జరిగినట్టు అనిపించినా.. చివరకు మెప్పించేలానే ఉంది.

  నటీనటులు..

  నటీనటులు..

  ఆటగదరా శివ లాంటి కథా ప్రాధాన్యమున్న చిత్రంలో నటించిన ఉదయ్.. తన రెండో ప్రయత్నంగా కాస్త కమర్షియల్ హంగులతో కూడుకున్న చిత్రం ఎంచుకున్నాడు. సిద్దు పాత్రకు ఉదయ్ న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్‌లో ఉదయ్ పర్వాలేదనిపించాడు. ఇక ఈ చిత్రంలో అందరి కంటే ముఖ్యంగా ఎక్కువగా చెప్పుకోవాల్సింది మహాలక్ష్మీ పాత్రను పోషించిన ఐశ్వర్యా రాజేశ్ గురించే. ఇంతకు ముందు క్రికెటర్ పాత్రలో చక్కగా నటించి మెప్పించిన ఐశ్వర్యా.. ఈ చిత్రంలో మల్ల యోధురాలిగా జీవించేసింది. తన మాట, యాస, యాటిట్యూడ్ ఇలా అన్నింటిలోనూ తన ప్రత్యేకతను చూపించింది. ఈ చిత్రంతో ఐశ్వర్యా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం ఉంది. మిగతా పాత్రల్లో ప్రదీప్ రావత్, సంజయ్ స్వరూప్ లాంటి వారు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  ప్రేమ కథలు వెండితెరపై సక్సెస్ ఫార్మూలా అన్నది అందరికీ తెలిసిందే. అందుకే కథ రచయితలు ప్రేమ చుట్టూ తిరిగే కథలు రాస్తుంటారు. అయితే ఎన్ని ప్రేమకథలు వచ్చినా.. కొత్తగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అందుకే ఈ మూవీ దర్శకుడు ఎన్‌వీ నిర్మల్ కుమార్ కూడా.. ప్రేమ కథనే ఎంచుకున్నాడని అనిపిస్తుంది. ఫస్టాఫ్ వరకు బాగానే లాక్కొచ్చిన దర్శకుడు ద్వితీయార్థంలో కథను సైడ్ ట్రాక్ ఎక్కించినట్టు కనిపిస్తోంది. ఈ కథకు అనుకున్న లైన్, పాయింట్ కూడా పాతదే అయినా.. ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ద్వితీయార్థంపై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేదనిపిస్తోంది. క్లైమాక్స్ కూడా అందర్నీ గందర గోళానికి గురి చేసే అవకాశముంది. మొత్తానికి మిస్‌మ్యాచ్ అంటూ పెట్టిన టైటిల్‌కు దర్శకుడు న్యాయం చేశాడనే చెప్పవచ్చు.

  #CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
  సాంకేతిక నిపుణుల పనితీరు..

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  మిస్‌మ్యాచ్ సినిమాకు వచ్చే సరికి ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలంగా మారింది. పవన్ కళ్యాణ్ నాటి క్లాసిక్ చిత్రం తొలిప్రేమ నుంచి ఈ మనస్సే పాటను రీమేడ్ చేయడం, దాన్ని సింగిల్ షాట్‌లో అందంగా తెరకెక్కించడంలో చిత్రయూనిట్ సక్సెస్ అయింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లకు కత్తెర వేస్తే ఇంకాస్త బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది. సిటీ వాతావారణాన్నే కాదు పల్లెటూరిని కూడా ఎంతో అందంగా చూపించాడు కెమెరామెన్. ఆర్ట్ విభాగం, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

  బలం బలహీనతలు

  బలం బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేశ్

  సంగీతం

  కథ

  మైనస్ పాయింట్స్

  రొటీన్ కథనం

  ఊహకందేట్టు సాగే సన్నివేశాలు

  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్, ప్రదీప్ రావత్, సంజయ్ స్వరూప్ తదితరులు

  దర్శకత్వం: ఎన్‌వీ నిర్మల్ కుమార్

  నిర్మాత: శ్రీరామ్ రాజు, భరత్ రామ్

  మ్యూజిక్: జిఫ్టాన్ ఎలియాస్

  సినిమాటోగ్రఫి: గణేష్ చంద్ర

  ఎడిటింగ్: ఎస్‌పీ రాజా సేతుపతి

  ఫైనల్..

  ఫైనల్..

  మిస్‌మ్యాచ్ అంటూ భిన్న టైటిల్ పెట్టిన దర్శకుడు.. అంతే భిన్నంగా తెరకెక్కించడంలో కాస్త తడబడినట్టు అనిపిస్తోంది. బీ, సీ సెంటర్లలోని ప్రేక్షకుల ఆదరణపై ఈ మూవీ విజయం ఆధారపడి ఉంటుంది.

  English summary
  Mismatch is an Telugu language Action Drama written and directed by NV Nirmal Kumar. The film stars Uday Shankar, Aishwarya Rajesh. This movie released on December 6, 2019.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more