Ms Shetty Mr Polishetty Review మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రివ్యూ.. అనుష్క, నవీన్ మెప్పించారా?

Rating:
3.0/5

నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమటం, సోనియా దీప్తి, తులసి తదితరులు
రచన, దర్శకత్వం: మహేష్ బాబు పీ
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
సినిమాటోగ్రఫి: నీరవ్ షా
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్: రధన్ (పాటలు), గోపి సుందర్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్)
బ్యానర్: యూవీ క్రియేషన్స్
మూవీ నిడివి: 147
రిలీజ్ డేట్: 2023-09-07

ప్రముఖ రెస్టారెంట్‌లో పనిచేసే అన్విత (అనుష్క శెట్టి) చెఫ్. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే సిద్దూ పార్ట్‌టైమ్ స్టాండప్ కమెడియన్. సిద్దూ స్టాండప్ కామెడీ చూసిన తర్వాత అతడికి చేరువ అవుతుంది. అన్వితతో పరిచయం సిద్దూను ప్రేమలో పడేలా చేస్తుంది. ఓ మంచి సమయం చూసుకొని అన్వితకు సిద్దూ ప్రపోజ్ చేస్తే.. నాకు ప్రేమ, పెళ్లి ఇష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని సిద్దూకు అన్విత షాక్ ఇస్తుంది.

Miss Shetty Mr Polishetty Review

సిద్దూతో అన్విత ఎందుకు దగ్గరైంది? సిద్దూను ఎలా వాడుకోవాలని అన్విత ప్లాన్ వేసింది. పీకల్లోతూ ప్రేమలో మునిగిన సిద్దూ ఎలాంటి పరిస్థితిలో మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. అన్విత చెప్పిన నిర్ణయంతో సిద్దూ పరిస్థితి ఏమైంది? అన్వితకు ప్రేమ అంటే ఎందుకు ఇష్టం లేదు? అన్విత జీవితంలో పెళ్లి చూసుకోకూడదని ఎందుకు నిర్ణయం తీసుకొన్నది? సిద్దూను ఎలా ఉపయోగించుకోవాలని అనుకొన్నది? చివరకు సిద్దూ, అన్విత పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారా? ఒక్కటైతే ఎలాంటి పరిస్థితుల్లో సిద్దూ, అన్విత దగ్గరయ్యారు అనే ప్రశ్నలకు సమాధానమే మిస్ శెట్టి పొలిశెట్టి సినిమా కథ.

అన్విత తల్లి (జయసుధ) క్యాన్సర్‌తో చనిపోవడమనే పాయింట్‌తో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. తల్లి చెప్పిన మాటలు అన్విత జీవితంపై తన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి క్రమంలో అన్విత తీసుకొన్న నిర్ణయం వల్ల సిద్దూకు దగ్గర కావడంతో మూవీ చాలా ఫన్నీగా, హీలేరియస్ కామెడీతో పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు లవ్లీ సెటప్‌లో ఓ ఎమోషనల్ ఎపిసోడ్‌తో రెండో భాగంపై ఆసక్తి పెంచేలా తొలి భాగం ముగుస్తుంది.

Miss Shetty Mr Polishetty Review

ఇక లవ్ ప్రపోజల్ బెడిసికొట్టడంతో సిద్దూలో అంతర్మథనం మొదలు కావడం, అన్విత వేరే వ్యక్తికి చేరువ అవ్వడానికి ప్రయత్నిచడం లాంటి అంశాలు మూవీని సాగదీసిన ఫీల్ కలుగుతుంది. చివరకు అన్విత తన స్వార్ధం కోసం పెట్టిన కండీషన్లకు సిద్దూ ఒప్పుకోవడంతో వారి మధ్య బాండింగ్ మళ్లీ మొదలవుతుంది. సెకండాఫ్‌లో తన తల్లిదండ్రుల రిలేషన్ గురించి సిద్దూ చేత చెప్పించిన స్టాండప్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది.

చివర్లలో సిద్దూతో మురళీ శర్మ మాట్లాడుతూ.. నేను ప్రేమించాను అని చెప్పడం కంటే.. నేను నీ వెంట ఉన్నాననే విషయం చెప్పావా? అనే డైలాగ్‌తో సినిమా ఫిలాసఫీ మారిపోతుంది. చివరకు సిద్దూ ప్రేమను అన్విత ఎలా అంగీకరించింది? ఎలా ఒప్పుకొన్నదనే విషయం చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

నటీనటుల ఫెర్పార్మెన్స్ విషయానికి వస్తే.. సింగిల్ పేరెంట్ యువతిగా అనుష్క శెట్టి ఎమోషనల్, భారమైన పాత్రలో నటించింది. చెఫ్‌గా తన పాత్రను అర్థం చేసుకొని చక్కటి బాడీ ల్వాంగేజ్‌తో ఆకట్టుకొన్నది. ఫెర్ఫార్మెన్స్‌కు డెప్ట్ ఉన్న క్యారెక్టర్‌ను అవలీలగా పోషించినట్టు కనిపించింది. ఇక ముద్దుగా, బొద్దుగా అందంతో ఆకట్టుకొన్నది.

Miss Shetty Mr Polishetty Review

అలాగే నవీన్ పొలిశెట్టి ఈ సినిమాను పూర్తిగా తన భుజాల మీద మోశాడనే చెప్పాలి. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో జాతిరత్నాలు పెంచిన అంచనాలను అందుకొన్నాడు. కామెడీ టైమింగ్ చాలా బాగుంది. కొన్ని సీన్లలో అనుష్కతో కొన్ని హావభావాలు బ్రహ్మండంగా పలికించాడు. మిగితా నటీనటుల్లో తులసి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకొన్నది. మురళీ శర్మ మరోసారి ఎమోషనల్ పాత్రలో తన బ్రాండ్‌ను చూపించాడు.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. డైలాగ్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రతీ సన్నివేశంలో మాటలను దట్టించి కామెడీని క్రియేట్ చేసిన విధానం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ తమ పరిధి మేరకు సినిమాను అందంగా మార్చింది. యూవీ క్రియేషన్స్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Miss Shetty Mr Polishetty Review

సమాజంలో బయటకు చెప్పుకోలేని ఓ ఎమోషనల్ పాయింట్‌కు హ్యుమర్, ఫన్ జోడించి చేసిన సీరియస్ టాపిక్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. అనుష్క, నవీన్ పొలిశెట్టి ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బ్యూటీ అని చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ చాలా వేగంగా, వినోదంగా సాగితే.. సెకండాఫ్‌లో కొంత డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు ఎమోషనల్‌గా ఉండటంతో మంచి సినిమా చూశానమనే సంతృప్తి కలుగుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు, వినోదాన్ని ఆశించే వారికి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి ట్రీట్‌లా ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X