twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mission 2020 movie Review: పోర్న్, డ్రగ్స్ బ్యాక్‌డ్రాప్‌తో మర్డర్ మిస్టరీ

    |

    ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అందర్నీ వేధించే సమస్య సోషల్ మీడియా. సోషల్ మీడియా మత్తులో యువత పెడదార్లు పడుతుందనే వాదనకు బలం చేకూరేలా సమాజంలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి. అశ్లీల వీడియోల మత్తులోపడి యువత ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారనే విషయం మీడియాలోనే కాదు సమాజంలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇంటర్నెట్ మీడియా వల్ల యువత ఎలా అడ్డదార్లు తొక్కుతుందనే పాయింట్ ఆధారంగా దర్శకుడు కరణం బాబ్జీ మిషన్ 2020 తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎలాంటి అంశాలను ఆధారంగా చేసుకొని సినీ విమర్శలను సంధించారంటే..

    Mission 2020 movie Review

    అన్యాయాలు, అక్రమాలపై తూటా గురిపెట్టే నిజాయితీ ఆఫీసర్ జయంత్ (నవీన్ చంద్ర)కు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకొంటారు. చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకొని తప్పించుకోవాలనుకొనే నేరస్థలుకు సింహస్వప్నంగా మారతాడు. ఈ క్రమంలో ప్రకాశ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి అశ్లీల వీడియోలను చూసే వ్యసనానికి అలవాటు పడుతారు. సోషల్ మీడియాలో చూసిన వీడియో ఆధారంగా స్వాతి అనే అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తారు.

    గ్యాంగ్ రేప్‌కు గురైన స్వాతి కేసును పోలీస్ ఆఫీసర్ జయంత్ ఎలా దర్యాప్తు చేశారు? రేప్‌కు పాల్పడిన ప్రకాశ్ బృందం తప్పించుకోవాలని చూస్తే జయంత్ ఏం చేశాడు? ప్రకాశ్ బృందాన్ని పట్టుకొని జయంత్ ఎలాంటి శిక్షను విధించాడు? స్వాతి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మిషన్ 2020 సినిమా కథ.

    దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలనే కాకుండా సెలబ్రిటీలు పోర్న్ వీడియోల మత్తులో పడుతున్నారనే విషయాలు ఇటీవల కాలంలో సంచలన అంశాలుగా మారాయి. యాప్స్, సోషల్ మీడియాలో గ్రూప్‌ల్లో పోర్న్ వీడియోలను పెట్టి యువతను ఆకట్టుకోవడం యదేచ్చగా జరుగుతున్నది. ఇలాంటి అంశాలకు భావోద్వేగ కథను జోడించి దర్శకుడు కరణం బాబ్లీ తెరకెక్కించడంలో సఫలీకృతం అయ్యారు. కథలో మరిన్ని ఎమోషనల్ పాయింట్స్ జోడించి.. మిగితా క్యారెక్టర్లను హైలెట్ చేసి ఉంటే మరింత మెరుగైన ఫలితాన్ని అందుకొనే వారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ జయంత్ పాత్రను డిజైన్ చేసుకొన్న విధానం బాగుంది.

    జయంత్ పాత్రలో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్‌గా ఒదిగిపోయాడు. కీలక సన్నివేశాల్లో నవీన్ చంద్ర తన బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకొన్నాడు. నిఖార్సైన అధికారి పాత్రను పోషించడమే కాకుండా సగటు ప్రేక్షకుడిని మెప్పించాడని చెప్పవచ్చు. ఇక మిగితా పాత్రల్లో నాగబాబు, సత్యప్రకాశ్, జయప్రకాశ్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సమీర్ చలాకీ చంటి పాత్రలు ఆకట్టుకొనేలా ఉంటాయి. ఇక శ్రీ రాపాక ఐటెమ్ సాంగ్ ఈ సినిమాకు హైలెట్‌గా మారింది.

    మిషన్ 2020 సినిమా విషయానికి వస్తే.. ర్యాప్ రాక్ షకీల్ అందించిన మ్యూజిక్ బాగుంది. అల్లుడు గారెలు వండాలా? , సెల్లు సెల్లు అనే పాటలు మాస్ బీట్‌తో ఆకట్టుకొన్నాయి. ఈ సినిమాకు వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫి ప్రత్యేక ఆకర్షణ. ఎస్బీ ఉద్ధవ్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.

    నిర్మాతలు కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కేవీఎస్ఎస్ ఎల్ రమేష్ రాజు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే సమాజాన్ని ఆలోచింపజేసే చిత్రంగా మారేది. సినిమాను కాంప్రమైజ్ కాకుండా రూపొందించడంలో మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తమ అభిరుచి చాటుకొన్నారు. సామాజిక ఇతివృత్తంతో రూపొందిన సినిమాలను ఇష్ట పడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

    నటీనటులు: నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాష్, సత్య ప్రకాష్, చలాకీ చంటి, సమీర్, స్వాతి శర్మ తదితరులు
    సంగీతం: ర్యాప్ రాక్ షకీల్
    ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్
    సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్
    బ్యానర్: మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్
    సమర్పణ: హనీ బన్నీ క్రియేషన్స్, శ్రీ మిత్ర & మై విలేజ్
    నిర్మాతలు: కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కేవీఎస్ఎస్ ఎల్ రమేష్ రాజు
    దర్శకత్వం: కరణం బాబ్జి

    English summary
    Mission 2020 movie Review: This movie comes with porn, Drugs elements.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X