RGV's Mission Impossible 8 Review: మిషన్ ఇంపాసిబుల్ 8 మూవీపై రాంగోపాల్ వర్మ రివ్యూ
పారామౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్, టీసీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్, క్రిస్టఫర్ మెక్వారైన్ నిర్మించిన చిత్రం మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకానింగ్. ఈ చిత్రంలో టామ్ క్రూజ్‌తోపాటు హేలీ ఎట్‌వెల్, వింగ్ రేమ్స్, సూమాన్ పెగ్, హెన్రీ జేమీ, ఎంజెలా బాసెట్ తదితరులు నటించారు. ఈ సినిమాను మే 17వ తేదీన ఇండియాలో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా గురించిన విశేషాలతోపాటు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పిన రివ్యూ గురించిన వివరాల్లోకి వెళితే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచంలో మారణకాండను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న దుష్ట శక్తుల అంతు చూసేందుకు ఇంపాసిబుల్ మిషన్ ఫోర్స్ (IMF) టీమ్‌తో ఇథాన్ హంట్ (టామ్ క్రూజ్) ఆపరేషన్ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాడు అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రంలో అనేక ట్విస్టులు, ఊహకు అందని సైంటిఫిక్ అంశాలు ప్రేక్షకులను అబ్బుర పరుస్తాయి.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌లో 8వ చిత్రానికి ఇండియాలో ఆడియెన్స్ తొలి రోజు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాను చూసేందుకు సాధారణ ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు, దర్శకులు, నటులు, నిర్మాతలు పోటీపడ్డారు. ఈ చిత్రాన్ని ప్రసాద్ ఐమాక్స్‌లో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వీక్షించారు. అనంతరం యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇచ్చిన తన రివ్యూ ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
మిషన్ ఇంపాజిబుల్ సినిమా చూశాను. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఫెంటాస్టిక్ ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా సూపర్బ్‌గా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత సిగ్గు పడాల్సిన అవసరం ఏర్పడింది. మనం కూడా ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడం సిగ్గేస్తున్నది అంటూ ఆర్జీవి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన భావోద్వేగానికి గురైనట్టు కనిపించింది. ఈ మూవీపై అద్బుతమైన రివ్యూను తన మాటల్లో వ్యక్తం చేశారు.
ఇండియాలో మే 17వ తేదీన, అమెరికాలో మే 23వ తేదీన రిలీజ్ చేయడం లాంటి విషయం హాలీవుడ్‌లో జరిగే ఆనవాయితీ. ఇందులో కొత్తేమీ లేదు. గతంలో కూడా చాలాసార్లు ఇలా ముందుగానే దేశంలో రిలీజ్ అయ్యాయి అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 8 పార్టులు వచ్చాయి. అందులో మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మూవీ ది బెస్ట్. ఈ సినిమాలో వేలు పెట్టి లోపాలను చూపించడానికే అవకాశం లేదు. ప్రతీ విషయం కూడా ఫెంటాస్టిక్‌గా ఉంది. ఈ సబ్జెక్ట్ చూసిన తర్వాత ఇంతకు మించి ఎవరు తీయలేరని అనిపించింది అని వర్మ అన్నారు.


Click it and Unblock the Notifications











