Mission: Impossible 7 ఊహ కందని యాక్షన్ సీన్లు.. సీట్లకు అత్తుకుపోయేలా స్క్రీన్ ప్లే.. ఎన్ని కోట్ల బడ్జెట్ తెలు
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్, సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టఫర్ మేక్‌క్వారీ కాంబినేషన్‌లో వస్తున్న మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్దమైంది. జూలై 12వ తేదీన ఈ చిత్రం భారత్‌తోపాటు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో విడుదలకు ముస్తాబైంది. అయితే రిలీజ్‌కు ముందు భారీ ఓపెనింగ్స్‌ను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. అయితే ఈ సినిమాలోని బలబలాలు, ప్రత్యేక అంశాలు మీ కోసం..
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ ఏడోది. ఏడో సిరీస్‌ను రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్ని మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు టామ్ క్రూజ్, దర్శకుడు క్రిస్టఫర్ నిర్మాతలుగా వ్యవహరించడం గమనార్హం.

ఇప్పటి వరకు హాలీవుడ్ నటులు మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో విలన్లుగా నటించారు. ఈ సినిమాలో విలన్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపించబోతున్నది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హాట్ టాపిక్. అయితే ఏఐ కాన్సెప్ట్‌తో 2018లోనే కథను దర్శకుడు క్రిస్టఫర్ సిద్దం చేసుకోవడం ఆయనకు ఈ టాపిక్‌పైన ముందు చూపు ఏమిటో స్పష్టం చేసింది.
మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ చిత్రాన్ని సుమారు 290 మిలియన్ డాలర్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కించారు. అంటే భారతీయ కరెన్సీలో 2.4 వేల కోట్ల రూపాయలు. అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యంత సాంకేతికతతో రూపొందిన ఈ సినిమాను ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కొరియా, మెక్సికో, స్పెయిన్, తైవాన్, యూకేతోపాటు మొత్తం 70 దేశాల్లో రిలీజైంది.
మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ చిత్రం ఇప్పటికే రోమ్ నగరంలో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించారు. రోమ్‌లో వేసిన షోకు అద్బుతమైన రెస్సాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి క్రిటిక్స్ ఇప్పటికే పాజిటివ్ రివ్యూలతో జై కొట్టారు. సీట్లకు అత్తుకుపోయి.. అనుక్షణం ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను, అనుభూతిని ఈ సినిమా అందిస్తుందని చెప్పారు. అ ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని జూలై 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ సినిమాకు లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు రోజుల వీకెండ్‌లో ఈ సినిమా సుమారు 250 మిలియన్ల డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఉత్తర అమెరికాలో 90 మిలియన్ డాలర్లు, 70 దేశాల్లో 160 డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది. అంటే 5 రోజుల్లో ఈ చిత్రం 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











