Mission: Impossible 7 Review టామ్ క్రూజ్ వన్ మ్యాన్ షో.. యాక్షన్, ఛేజింగ్ ఎపిసోడ్స్ అదుర్స్!

Rating: 3.5/5

నటీనటులు: టామ్ క్రూజ్, హేలీ ఎట్‌వెల్, వింగ్ హేమ్స్, సైమ్ పెగ్, రెబెకా ఫెర్గూసన్, వెనెస్సా కిర్బీ, హెంజీ జేమీ తదితరులు
దర్శకత్వం: క్రిస్టఫర్ మెక్‌క్వెరీ
నిర్మాతలు: టామ్ క్రూజ్, క్రిస్టఫర్ మెక్‌క్వెరీ
సినిమాటోగ్రఫి: ఫ్రేజర్ టాగ్గర్ట్
ఎడిటింగ్: ఎడ్డీ హామిల్టన్
మ్యూజిక్: లోమే బాల్ఫే
బ్యానర్: స్కై‌డాన్స్
నిడివి: 163 నిమిషాలు
రిలీజ్ డేట్: 2023-07-12

ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో రష్యా రకరకాల వైరస్‌లను తయారు చేసి బాహ్య ప్రపంచంలోకి వదులుతుంది. ఆ క్రమంలో సముద్ర గర్బంలో తాము తయారు చేసిన ఒక ఆయుధం తమ సబ్‌మెరైన్‌ను కూల్చుతుంది. సబ్ మెరైన్‌లో ఉండే కంప్యూటర్ సిస్ఠమ్ సెవాస్టొపోల్‌కు గుట్టు బయటపెట్టాలంటే ఓ తాళం చెవి కీలకం అవుతుంది. ఆ తాళం చెవిని సొంతం చేసుకోవడానికి ఇథాన్ హంట్ (టామ్ క్రూజ్) వేట మొదలు పెడుతాడు.

Mission Impossible Dead Reckoning Part One Review

రష్యా తాము ప్రయోగించిన ఆయుధమే తమ సబ్‌మెరైన్‌‌ను ఎలా కూల్చివేసింది? అసలు సెవాస్టోపోల్ అంటే ఏమిటి? సెవాస్టోపోల్ వెనుక ఉన్న కథ ఏమిటి? రష్యా ఏ ఉద్దేశంతో సెవాస్టోపోల్‌ను తయారు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన సిస్టమ్ ఎంటిటీని గ్యాబ్రియల్ (ఇసాయి మోరెల్) ఎందుకు తయారు చేశాడు? దుష్ట శక్తులను అంతం చేసే ఇంపాజిబుల్ మిషన్ ఫోర్స్ (ఐఎంఎఫ్)లో పనిచేసిన గ్యాబ్రియల్ ఎందుకు ఎదురు తిరిగి టెర్రరిస్టుగా మారాడు? ఇథాన్ హంట్ మిషన్‌కు గ్రేస్ (హేలే ఎట్‌వెల్) ఎలా సహకరించింది? లిసా ఫాస్ట్ (రెబాకా ఫెర్గూసన్) పాత్ర ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ (Mission: Impossible - Dead Reckoning Part One) సినిమా కథ.

మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ మూవీ సబ్ మెరైన్‌లో కంప్యూటర్ ఎంటీటీ గురించి జరిగే చర్చతో ప్రారంభమవుతుంది. అయితే శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ప్రయోగించిన ఆయుధం తిరిగి తమ సబ్‌మెరైన్‌ను కూల్చివేయడంతో అసలు కథ మొదలవుతుంది. సబ్ మెరైన్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌తో పనిచేసే సిస్టమ్‌ను అన్ లాక్ చేయడానికి కీ అవసరమే పాయింట్‌తో ఇథాన్ హంట్ వేట మొదలుపెడుతుంది.

Mission Impossible Dead Reckoning Part One Review

ఇథాన్ హంట్ పాత్రను పరిచయం చేయడానికి కాస్త సమయమే తీసుకొన్నప్పటికీ.. ఒక్కసారి ఆ పాత్ర కథలోకి వచ్చిన తర్వాత స్టోరి పరుగులు పెడుతుంది. ఫస్టాఫ్‌లో యాక్షన్ పార్ట్ కంటే డైలాగ్ పార్ట్ ఎక్కువగా ఉండటం ఓ వర్గం ప్రేక్షకులకు కొంత విసుగు పుట్టించేలా ఉంటుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఎంటీటీ గురించి వివరంగా చెప్పకోవడంతో కొంత క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది.

అయితే టామ్ క్రూజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కాచుకొని కూర్చున్న ప్రేక్షకులకు సెకండాఫ్‌లో కొంత టైమ్ వారి సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. అయితే కథ డిమాండ్ మేరకు డైలాగ్ పార్ట్‌కు ప్రాధాన్యం ఇచ్చారనే విషయం క్లైమాక్స్‌కు వచ్చే సరికి అర్ధం అవుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమాలో సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ రచ్చ రచ్చగా ఉంటాయి. బైక్ రైడింగ్ ఎపిసోడ్స్, పారాచూట్ గ్లైడింగ్, ట్రైన్ ఎపిసోడ్స్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇథాన్ హంట్ పాత్రలో మరోసారి టామ్ క్రూజ్ విజృంభించాడు. 60 ఏళ్ల వయసులో కూడా యాక్షన్ సీన్లు, ఛేజింగ్స్‌, ఫైట్స్‌తో అదరగొట్టాడు. పలు సన్నివేశాల్లో బాడీ లాంగ్వేజ్‌తో అదరగొట్టాడు. మినీ కార్ ఛేజింగ్ ఎపిసోడ్‌లో మంచి హాస్యాన్ని పండించాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు టామ్ క్రూజ్ వన్ మ్యాన్ షో మాదిరిగానే తన ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాడు. మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. స్టోరీ పూర్తిగా అన్ లాక్ కాకపోవడంతో ఆ పాత్రల తీరు, పరిధి పెద్దగా ఎలివేట్ కాలేదనిపిస్తుంది.

Mission Impossible Dead Reckoning Part One Review

మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ హైలెట్‌గా కనిపిస్తాయి. ఈ సినిమాలో ప్రపంచంలోని పలు దేశాల్లో ఎంచుకొన్న లొకేషన్స్ సినిమాను మరింత రిచ్‌గా మార్చాయి. ఛేజింగ్, యాక్షన్, లవ్ సన్నివేశాలకు మ్యూజిక్ ప్రాణం పోసింది. సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు. దాంతో కథ పూర్తిగా చెప్పలేకపోవడం వల్ల సినిమా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎడిటర్‌కు ఇంకా చాలా పని మిగిలి ఉందేననిపిస్తుంది. టామ్ క్రూజ్, క్రిస్టఫర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకానింగ్ పార్ట్ వన్‌ మూవీలో యాక్షన్, ఛేజింగ్ ఎపిసోడ్స్‌ అదిరిపోయేలా ఉంటాయి. టామ్ క్రూజ్ వన్ మ్యాన్ షో పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. టెక్నికల్ అంశాలు, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. మిషన్ ఇంపాజిబుల్ అభిమానులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. కమర్షియల్‌తోపాటు ఫీల్ గుడ్ అంశాలు కొత్త అనుభూతికి గురిచేస్తాయి. అంచనాలు పెట్టుకొని వెళ్లినా.. పెట్టుకోకుండా వెళ్లినా ఈ సినిమా మంచి ఫీల్‌ అందిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X