twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్’ మూవీ రివ్యూ

    By Bojja Kumar
    |

    Recommended Video

    Mission: Impossible – Fallout Movie Review మిషన్ ఇంపాజబుల్ సినిమా రివ్యూ

    Rating:
    3.0/5

    హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రాల్లో 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ చిత్రాలది ప్రత్యేక స్థానం. టామ్ క్రూయిజ్ ప్రధాన పాత్రలో కనిపించే ఈ సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన ఐదు చిత్రాలు ఒళ్లు గగుర్బొడిచే సాహస విన్యాసాలు, ఉత్కంఠరేపే యాక్షన్ సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే సస్పెన్స్ అండ్ థ్రిలింగ్ అంశాలతో ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ముఖ్యంగా టామ్ క్రూయిజ్ చేసే సాహస విన్యాసాలు అభిమానులను ఎంతగానో అలరించాయి. తాజాగా ఈ సిరీస్‌లో 6వ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్' ప్రేక్షకుల ముందుకొచ్చింది.

    కథ ఏమిటంటే...

    కథ ఏమిటంటే...

    బెల్‌ఫాస్ట్‌లోని సేఫ్ హౌస్ నుండి మూడు ప్లూటోనియం బాల్స్ దొంగిలించబడ్డట్లు ఐఎంఎఫ్ ఏజెంట్ ఈతన్ హంట్(టామ్ క్రూయిజ్)కు సందేశం అందుతుంది. వాటిని అపోస్టీస్ అనే టెర్రరిస్ట్ గ్రూఫ్ తస్కరించిందని, సాలమన్ లేన్ తయారు చేసిన వెపన్ డిజైన్ ద్వారా భారీ విధ్వంసం సృష్టించే మూడు న్యూక్లియర్ బాంబులను వారు తయారు చేయబోతున్నారని.... వెంటనే వాటిని తిరిగి తీసుకొచ్చే మిషన్ ప్రారంభించాలని సందేశం అందుతుంది. దీంతో ఈతన తన టీం బెంజి, లూథర్‌తో కలిసి రంగంలోకి దిగుతాడు. వాటిని దక్కించుకోవడానికి పక్కా ప్లాన్ వేస్తారు. అయితే తన టీమ్ మెంబర్ లూథర్‌ను కాపాడుకునే క్రమంలో ప్లూటోనియం మళ్లీ మిస్సవుతుంది.

    సీఐఏ రంగంలోకి దిగడంతో కథ అనేక మలుపులు

    సీఐఏ రంగంలోకి దిగడంతో కథ అనేక మలుపులు

    ప్లూటోనియం మిస్సవ్వడంతో సీఐఏ రంగంలోకి దిగుతుంది. స్పెషల్ ఆఫీసర్ ఆగస్ట్ వాకర్ కూడా ఐఎంఫ్‌తో పాటు ఉండి సీఐఏకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాడని, అతడు లేకుంటే ఐఎంఎఫ్ టీమ్ ఈ మిషన్ నుండి తప్పుకోవాల్సి వస్తుందని సూచిస్తుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అతడిని కూడా తమ వెంట తీసుకెళతారు. మరి ఈథన్ హంట్ అండ్ టీమ్ ప్లూటోనియం‌ను దక్కించుకునే క్రమంలో ఎలాంటి సాహసాలు చేశారు, భారీ అను విస్పోటనం నుండి ప్రజలను ఎలా కాపాడారు అనేది అనేది తర్వాతి కథ.

    టామ్ క్రూయిజ్

    టామ్ క్రూయిజ్

    టామ్ క్రూయిజ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు. ముఖ్యంగా అతడు చేసిన ఒళ్లుగగుర్బొడిచే యాక్షన్ సన్నివేశాలు, బైక్ చేజింగ్, కార్ చేజింగ్ సీన్లు ప్రేక్షకుల్లో మరింత ఉంత్కంఠ రేపాయి.

    ఎంఐఎఫ్ టీం అదుర్స్

    ఎంఐఎఫ్ టీం అదుర్స్

    టామ్ క్రూయిజ్‌కు సహాయంగా ఉండే ఎంఐఎఫ్ టీమ్ సభ్యులుగా సిమన్ పెగ్, వింగ్ రామ్స్ తమదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

     టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాల పరంగా హాలీవుడ్ సినిమాల స్టాండర్ట్స్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ మిషన్ ఇంపాజబుల్ లాంటి చిత్రాలకు ది బెస్ట్ టెక్నీషియన్స్ పని చేస్తారు. రోబ్ హార్డీ అందించి సినిమాటోగ్రాఫీ ప్రేక్షకులకు సరికొత్త విజువల్ అనుభూతినిస్తుంది. లోర్నే బాపే సంగీతం సినిమాలోని యాక్షన్ సీన్లను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉంది. స్క్రీన్ ప్లే ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూసే విధంగా ఉంది.

    ఛేజింగ్ సీన్స్ అదుర్స్

    ఛేజింగ్ సీన్స్ అదుర్స్

    సాలమన్ లేన్‌ను కిడ్నాప్ చేసిన తర్వాత వచ్చే కార్ చేజింగ్ సీన్లు ఉత్కంఠ రేపే విధంగా ఉన్నాయి. సినిమాలో ప్రతీ యాక్షన్ అద్భుతంగా మలిచారు. క్లైమాక్స్‌లో వచ్చే హెలికాప్టర్ ఛేజింగ్ సీన్ సినిమాకే హైలెట్.

    ఆసక్తిని రేపే కథాంశం..

    ఆసక్తిని రేపే కథాంశం..

    సినిమా స్టోరీ లైన్ కూడా ఆసక్తిరేపే విధంగా ఉంది, ట్విస్టులు... కథలోకి ఎంటరయ్యే పాత్రలు ప్రేక్షకుల్లో సస్పెన్స్ మరింత పెంచుతుంది.

    క్రిస్టోఫర్ మెక్‌క్వారీ డైరెక్షన్

    క్రిస్టోఫర్ మెక్‌క్వారీ డైరెక్షన్

    ఇంతకు ముందు జాక్ రీచర్, మిషన్ ఇంపాజిబుల్ రోగ్ నేషన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రతి ఫ్రేమును ఆసక్తికరంగా, ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దారు. సాధారణ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఆసక్తిని రేకెత్తిస్తూ సినిమాను నడిపించారు.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    టామ్ క్రూయిజ్ పెర్ఫార్మెన్స్

    ఉత్కంఠ రేపే స్క్రీన్ ప్లే
    హెలికాప్టర్ ఛేజింగ్ సీన్

    మైనస్ పాయింట్స్

    నేరేషన్ కాస్త క్లిష్టంగా ఉండటం
    కొన్ని పాత్రలు వివరణ సరిగా లేక పోవడం

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ‘మిషన్ ఇంపాజిబుల్ -పాలౌట్' నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకు ముందు వచ్చిన ఐదు సిరీస్ చిత్రాలు చూసిన వారికి సినిమా ఈజీగా అర్థమవుతుంది. కొత్తగా చూసే వారికి సినిమా అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది.

    నటీనటులు, టెక్నీషియన్స్

    నటీనటులు, టెక్నీషియన్స్

    నటీనటులు: టామ్ క్రూయిజ్, హెన్రీ కావిల్, వింగ్ రామ్స్, సిమన్ పెగ్, రెబెకా ఫెర్గూసన్, సీన్ హారిస్

    దర్శకత్వం: క్రిస్టోఫర్ మెక్‌క్వారీ
    నిర్మాణ సంస్థలు: బ్యాడ్ రోబో ప్రొడక్షన్స్, స్కౌడాన్స్ మీడియా, అలిబాబా పిక్చర్స్
    సినిమాటోగ్రఫీ: రోబ్ హార్డీ
    విడుదల తేదీ: 2018-07-27

    English summary
    Mission: Impossible – Fallout Telugu Reviews. The sixth entry to ‘Mission: Impossible’ sees Tom Cruise’s Ethan Hunt and his IMF team take on yet another mission against all the odds.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X