Mission: Impossible Twitter Review: మిషన్ ఇంపాజిబుల్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. టామ్ క్రూజ్ హిట్ కొట్టారా?

పారామౌంట్ పిక్చర్స్, స్కై డ్యాన్స్ టీసీ ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై టామ్ క్రూజ్, క్రిస్టోఫర్ మెక్‌క్యూరేలు సంయుక్తంగా ఈ మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ చిత్రాన్ని దాదాపు 400 మిలియన్ల బడ్జెట్‌తో (భారత కరెన్సీలో రూ.3,400 కోట్లు) తెరకెక్కించారు. ఈ సినిమాకు ఫ్రాసెర్ టాగ్గార్ట్ సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించగా.. మ్యాక్స్ అరుజ్, అల్ఫీ గాడ్‌ఫ్రెలు సంగీత సారథ్యం వహించారు. ప్రమీయర్ షో తర్ాత ఈ సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే?

Mission  Impossible Movie Twitter Review in Telugu  Tom Cruise hits bulls eye

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికోనింగ్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ యాక్షన్ మూవీస్‌లో ఒకటి.. టెన్షన్, స్టంట్స్, దర్శకత్వం, ఎడిటింగ్ అన్ని బోర్డర్ దాటేశాయని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. టామ్ క్రూజ్ మరోసారి దిగ్గజ నటుడినని అనిపించుకున్నాడు, నిర్మాణ విలువలు చూస్తుంటేనే పిచ్చెక్కుతుంది. మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజీలో వచ్చిన అన్ని సినిమాలను ఖచ్చితంగా ఇది దాటేస్తుందని అతను రాసుకొచ్చాడు.

ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ సెకండ్ వరకు మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ మైండ్ బ్లోయింగ్‌లా ఉంది, ప్రతిది పర్ఫెక్ట్‌గా ఉంది. యాక్షన్ అల్టిమేట్, సస్పెన్స్ పీక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్. టామ్ క్రూజ్‌కు మరో ఐకానిక్ సినిమా, అందరూ చూడండని ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ పెట్టాడు.

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్‌తో ఈ ఫ్రాంచైజీకి సంతృప్తికరమైన ముగింపు పలికారు. ఈథన్ హంట్ ఎదుర్కొన్న అనుభవాలు, అతని నినాదంపై ఎన్నో జ్ఞాపకాలున్నాయి. టామ్ క్రూజ్ 30 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాడో ఇప్పటికీ అలాగే స్టంట్స్ ఇరగదీశాడు. ఎన్నో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. కానీ నాకు థర్డ్ యాక్ట్ చాలా ఇష్టమని ఇక్కడి వరకు చేరుకోవడానికి చాలా కాలం పట్టింది.. టామ్ క్రూజ్ ఈ ఫ్రాంచైజీ కోసం ఏళ్లుగా పడ్డ కష్టాన్ని ఆరాధించకుండా ఉండలేమని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

నిన్న రాత్రి ముందుగానే మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్ స్క్రీనింగ్ వీక్షించగలిగా.. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుంది, ముఖ్యంగా ప్లేన్ సీన్ పిచ్చెక్కించింది. మిషన్ ఇంపాజిబుల్‌ ఫ్రాంచైజీలో ఇది బెస్ట్ మూవీ కాదు.. కానీ వీడ్కోలు చెప్పడానికి పర్లేదని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

నాకు మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ బాగా నచ్చింది. అద్భుతమైన సినిమాల ఫ్రాంచైజీకి ఇది సరైన ముగింపు. నా వైపు నుంచి థంబ్స్ అప్ ఇదిగో అంటూ ఓ అమ్మాయి రివ్యూ ఇచ్చింది

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్‌ గురించి చాలా ఫస్ట్ రివ్యూలు నిరాశపరిచాయని, ఇప్పటికీ బిగ్ స్క్రీన్‌పై యాక్షన్ కోసమే వెతుకుతున్నానని జర్మనీ నుంచి ఓ టామ్ క్రూజ్ అభిమాని కామెంట్ చేశాడు.

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్‌ ప్యూర్ సినిమా. ఇది ఖచ్చితంగా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ యాక్షన్ సినిమాగా నిలిచిపోతుంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ హృదయాన్ని కదిలించేలా, థ్రిల్ కలిగించేలా సీన్స్ ఉన్నాయని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X