twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిషన్ మంగళ్ మూవీ రివ్యూ: జాతీయ భావం, భావోద్వేగాలే కీలకంగా

    |

    Rating:
    3.5/5
    Star Cast: అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పొన్ను, నిత్య మీనన్
    Director: జగన్ శక్తి

    బాలీవుడ్‌లో కథల ఎంపిక, టేకింగ్ విషయంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. నేల విడిచి సాము చేసే స్టోరీలకు స్వస్తి చెప్పిన ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే వచ్చిన దంగల్, ప్యాడ్‌మ్యాన్ లాంటి చిత్రాలు వాస్తవికతను బలంగా చెప్పగలిగాయి. ఫిక్షన్ కంటే రియాలిటీకి ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో దర్శక, నిర్మాతలు రూటు మార్చుకోవాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఆ క్రమంలోనే తాజాగా వచ్చిన చిత్రం మిషన్ మంగళ్. భారతీయ అంతరిక్ష కీర్తి పతాకాన్ని గగనంలో ఎగురువేసిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) లేదా మంగళ్ యాన్ వెనుక ఉన్న వాస్తవ అంశాలను అల్లుకొని రూపొందించిన చిత్రం మిషన్ మంగళ్. ఆగస్టు 15న విడుదలై సినీ, సగటు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ఈ చిత్రం ఎలా ఉందంటే..

    మిషన్ మంగళ్ కథ ఏంటంటే

    మిషన్ మంగళ్ కథ ఏంటంటే

    జీఎస్ఎల్‌వీ ప్రయోగం దారుణంగా విఫలం కావడంతో ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ రాకేష్ ధావన్ (అక్షయ్ కుమార్)‌ను అసంభవంగా భావించే మార్స్ ప్రాజెక్ట్‌కు బదిలీ చేస్తారు. అసంభవం అంటే నచ్చని రాకేష్ తనదైన శైలిలో మార్స్ ప్రాజెక్ట్‌ను సాకారం చేయడానికి భుజానికెత్తుకుంటాడు. ఆ క్రమంలో జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విఫలం కావడానికి ఓ కారణమైన తారా షిండే (విద్యా బాలన్) ఆ ప్రాజెక్ట్‌లో చేరుతుంది. మార్స్ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించే రూపర్ట్ దేశాయ్ (దిలీప్ తాహిల్) అనుక్షణం ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలోనే కనీస అనుభవం లేని ఏకా గాంధీ (సోనాక్షి సిన్హా), కృతిక అగర్వాల్ (తాప్సీ పొన్ను), వర్ష పిళ్లై (నిత్య మీనన్), నేహా సిద్ధిఖి (కృతి కుల్హారి), ఆనంత్ అయ్యర్ (శర్మన్ జోషి)ని ప్రాజెక్ట్‌లో భాగం చేస్తాడు.

    మిషన్ మంగళ్‌లో మలుపులు

    మిషన్ మంగళ్‌లో మలుపులు

    మార్స్ ప్రాజెక్ట్‌ను రూపర్ట్ దేశాయ్ అడ్డుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తాడు? మామ్‌ను విజయవంతంగా ప్రయోగించేందుకు ప్రక్రియలో రాకేష్ ధావన్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? నేహా సిద్ధిఖికి సామాజికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. శాటిలైట్ డిజైనర్ వర్ష పిళ్లై (నిత్య మీనన్) ఎదురైన శారీరక సమస్యలు ఎంటీ? ప్రాజెక్ట్ మేనేజర్ తారా (విద్యా బాలన్)‌కు వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా ఎలాంటి అవరోధాలను చవిచూసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిషన్ మంగళ్ సినిమా కథ.

    మిషన్ మంగళ్ ఫస్టాఫ్

    మిషన్ మంగళ్ ఫస్టాఫ్

    హోమ్ సైన్స్‌కు రాకెట్ సైన్స్‌కు లింకు కలుపుతూ సులభమైన పద్దతిలో స్పేస్ రీసెర్చ్‌ను అర్ధమయ్యే విధంగా చెప్పిన తీరుతోనే సాధారణ ప్రేక్షకుడికి కూడా సంతృప్తి కలుగుతుంది. చైనా, అమెరికా దేశాల ప్రభావంతో స్థానిక సైంటిస్టుల సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేసే తీరు, అలాంటి పరిస్థితులను మామ్ టీమ్ అధిగమించిన తీరు సినిమా చూసే ప్రేక్షకుడిలో ఓ కసిని రేకెత్తించేలా ఉంటాయి. మామ్ ప్రాజెక్ట్‌ను అసంభవం చేయడానికి బడ్జెట్ కోతలు విధించడం, రకరకాల అంశాలతో ప్రయోగాన్ని అడ్డుకోవాలన్న అంశాలు ప్రేక్షకుడిలో ఆసక్తిని రేపుతాయి. అంతేకాకుండా ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమైన సైటింస్టుల వ్యక్తిగత జీవితాలకు ఎమోషనల్ కంటెంట్‌ను సినిమాటిక్ అద్దడం సినిమా కమర్షియల్‌ ఫార్మాట్‌లోకి మారేలా చేసింది.

    మిషన్ మంగళ్ సెకండాఫ్

    మిషన్ మంగళ్ సెకండాఫ్

    ఇక సెకండాఫ్‌లో పరిమితమైన వనరులతో మామ్ ప్రయోగానికి సైంటిస్టులు సిద్ధకావడం, ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు కూడా సహకరించకపోవడం అనే అంశాలు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసేలా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు ఉండే కంటెంట్ ప్రేక్షకుడిని ఎమోషనల్‌గా కట్టిపడేస్తుంది. భూమి నుంచి మార్స్ వరకు సాగిన ప్రయాణంలో కిలోమీటర్‌కు రూ.7 ఖర్చు అయిందనే కామెంట్‌తో బరువెక్కిన ప్రేక్షకుడి గుండె ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. ఈ ప్రయోగానికి మామ్ అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందనే విషయం అత్యంత ఆసక్తిని రేపుతుంది.

     అక్షయ్ కుమార్, విద్యా బాలన్ నటన

    అక్షయ్ కుమార్, విద్యా బాలన్ నటన

    ఇక మామ్ ప్రయోగంలో సైంటిస్టులుగా నటించిన అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పొన్ను, నిత్య మీనన్, కృతి కుల్హారి, శర్మాన్ జోషి, హెచ్‌జీ దత్తాత్రేయ ఎక్కడ యాక్టర్లుగా అనిపించరు. తమ తమ పాత్రల్లో జీవించారా అనే విధంగా ఫీలింగ్ కల్పించారు. దేశం కోసం ప్రేమ, ఫ్యామిలిని, జీవితాన్ని త్యాగం చేసిన సైంటిస్టుగా అక్షయ్ మరోసారి తనదైన నటనతో మెప్పిస్తాడు. ఇక విద్యాబాలన్ సామాన్య గృహిణిగా.. దేశానికి గర్వ కారణమైన మంగళ్ యాన్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా మంచి నటనను కనబరిచారు. వినోదంతోపాటు భావోద్వేగాన్ని పండించారు.

     నటీనటులు పెర్ఫార్మెన్స్

    నటీనటులు పెర్ఫార్మెన్స్

    ఆర్మీ జవాన్ భార్యగా, సైటింస్టుగా తాప్సీ ఆకట్టుకొన్నది. గర్భవతిగా ఉంటూ దేశం ప్రతిష్ట కోసం యువతి పాత్రలో నిత్య మీనన్ కనిపించింది. 59 ఏళ్ల సైటింస్టుగా కన్నడ నటుడు దత్తాత్రేయ ఆకట్టుకొంటాడు. నాసాలో పనిచేసి ఇస్రోలో ఉన్నతాధికారిగా దిలీప్ తాహిల్ నటన కూడా అదనపు ఆకర్షణ. నేహా సిద్ధిఖీ పాత్రలో కృతి కుల్హారి పాత్ర కూడా చక్కగా ఉంటుంది. మొత్తంగా ప్రతీ నటుడి పవర్ ప్యాక్ట్ ఫెర్ఫార్మెన్స్‌ ప్రతీ సన్నివేశంలోనూ కనిపిస్తుంది.

    దర్శకుడు ప్రతిభ

    దర్శకుడు ప్రతిభ

    అత్యంత సాంకేతిక కంటెంట్‌తో ఉండే కథను సులభంగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా దర్శకుడు జగన్ శక్తి తెరకెక్కించిన తీరు అభినందనీయం. దర్శకుడు ఆర్ బాల్కీ, నిధి సింగ్, సాకేత్ కొండిపర్తి లాంటి సమర్ధులతో రూపొందించిన స్క్రిప్టు సగటు ప్రేక్షకుడికి జీర్ణం అయ్యేలా ఉంది. జాతీయ భావాన్ని పెంపొదించే విధంగా రాసుకొన్న కథ, కథనాలు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టాయి.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అమిత్ త్రివేది, తనిష్క అందించిన సంగీతం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. రవి వర్మన్ సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంటుంది. నిజంగా అంతరిక్ష ప్రయోగాన్ని చూస్తున్నామా అనే ఫీలింగ్‌ను రవి వర్మన్ కల్పించాడని చెప్పవచ్చు. చందన్ అరోరా ఎడిటింగ్ సినిమాకు మరో బలం.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    జాతీయ భావం, భావోద్వేగత, అణిచివేత ఎదురించే అంశాలతో అల్లుకొనే వాస్తవిక సంఘటనలకు ప్రతీ రూపం మిషన్ మంగళ్. అన్ని రకాలుగా వినోదాన్ని పంచే ఈ సినిమా ప్రేక్షకుడి పైసా వసూల్ మూవీ అనేది గ్యారెంటి. మంగళ్ యాన్‌ ప్రాజెక్ట్‌లో స్త్రీ శక్తి విజయం ప్రేక్షకుడిని ఉత్తేజానికి, ఉద్వేగానికి గురిచేస్తుంది. మంగళ్ యాన్‌ ఎంత సక్సెస్ అయిందో.. మిషన్ మంగళ్‌ సినిమాను కూడా ప్రేక్షకుడు తమ భుజాలపై విజయ లక్ష్యాలకు చేరుస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటినటులు: అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పొన్ను, నిత్య మీనన్, కృతి కుల్హారి, శర్మాన్ జోషి, హెచ్‌జీ దత్తాత్రేయ, దిలీప్ తాహిల్ తదితరులు
    దర్శకత్వం: జగన్ శక్తి
    స్క్రిప్టు: ఆర్ బాల్కీ, జగన్ శక్తి, నిధి సింగ్, సాకేత్ కొండిపర్తి
    సంగీతం: అమిత్ త్రివేది, తనిష్క్ బాగ్చి
    సినిమాటోగ్రఫి: రవి వర్మన్
    ఎడిటింగ్: చందన్ అరోరా
    బడ్జెట్: 32 కోట్లు
    రిలీజ్: 2019-08-15

    English summary
    Mission Mangal is enjoyable and entertaining. With Akshay Kumar and Vidya Balan, director Jagan Shakti delivers a space movie that lifts off and frequently soars.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X