For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మిస్టర్ మూవీ రివ్యూ

  By Rajababu
  |

  Rating:
  2.0/5
  Star Cast: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్
  Director: శ్రీను వైట్ల

  ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన లోఫర్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మిస్టర్. ముకుంద, కంచె లాంటి సినిమాలకు మంచి పేరు వచ్చినా వరుణ్‌కు అనుకున్న రేంజ్‌లో హిట్‌ను అందించలేకపోయాయి. దూకుడు, బాద్షా లాంటి బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకొన్న దర్శకుడు శ్రీను వైట్లకు ఆగడు, బ్రూస్‌లీ చిత్రాల తర్వాత పరిస్థితి అంతా ఆశాజనకంగా లేదు. టాలీవుడ్‌లో వరుణ్ తేజ్, శ్రీను వైట్ల నిలదొక్కుకోవాలంటే వారికి కావాల్సింది భారీ హిట్. అలాంటి పరిస్థితుల్లో వారిద్దరూ కలిసి చేసిన సినిమా మిస్టర్. ఈ చిత్రానికి వరుస విజయాలతో దూసుకెళ్తున్న లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌లు జతకలిశారు. ఇలాంటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం వారికి ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకోవాలంటే అసలు మిస్టర్ కథ ఏంటీ అనేది తెలుసుకోవాల్సిందే. .

  స్పెయిన్.. మీరాతో తొలి ప్రేమ..

  స్పెయిన్.. మీరాతో తొలి ప్రేమ..

  పిచ్చయ్య నాయుడు అలియాస్ చయ్ ( వరుణ్ తేజ్) స్పెయిన్‌లో జాలీగా గడిపే యువకుడు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకొంటారు. తనకు నచ్చిన వాళ్లు కష్టాల్లో ఉంటే తన కష్టంగా భావించి వారికి అండగా ఉండే లక్షణం. స్పెయిన్ పర్యటనకు వచ్చిన మీరా (హెబ్బా పటేల్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ అప్పటికే మీరాకు ఇండియాలో ఉండే సిద్ధార్ఠ్ (ప్రిన్స్)తో అఫైర్ ఉంటుంది. అది తెలిసి చయ్ హర్ట్ అవుతాడు. తొలి ప్రేమ బెడిసి కొట్టడంతో బాధ పడుతాడు. స్పెయిన్ టూర్ ముగించుకొని కర్ణాటక ప్రాంతంలోని తన సొంతూరుకు తిరిగి వచ్చిన మీరా కష్టాల్లో పడుతుంది. తన కష్టాన్ని చయ్‌కి చెప్పి బాధపడుతుంది. కష్టాల్లో పడిన మీరాను గట్టెక్కించడానికి చయ్ ఇండియా వస్తాడు.

  తాతయ్య పిచ్చయ్య నాయుడిపై కోపం

  తాతయ్య పిచ్చయ్య నాయుడిపై కోపం

  ఇండియాకు వచ్చే సమయంలో తన కుటుంబ సభ్యులు తాతయ్య (పిచ్చయ్య నాయుడు)ను కలువాలని చయ్‌ని కోరుతారు. అయితే చయ్‌కి తాతయ్య పిచ్చయ్య నాయుడు అంటే చెప్పలేనంత కోపం. కర్ణాటక ప్రాంతానికి సమీపంలోని ఓ ప్రాంతానికి తాత పిచ్చయ్యనాయుడు పెద్ద. పిచ్చయ్య నాయుడుకి ఓ సమస్య ఉంటుంది. చయ్‌ని తన చివరి రోజుల్లో పిచ్చయ్య నాయుడు చూడాలనుకొంటాడు.

  రాజవంశానికి చెందిన చంద్రముఖితో..

  రాజవంశానికి చెందిన చంద్రముఖితో..

  కర్ణాటక ప్రాంతానికి వచ్చిన చయ్‌కి విజయనగర రాజకుటుంబానికి చెందిన చంద్రముఖి (లావణ్య ) తారసపడుతుంది. ఇంటి నుంచి పారిపోయిన వచ్చిన చంద్రముఖి చయ్‌కి దగ్గరవుతుంది. కొన్ని పరిస్థితుల కారణంగా చయ్‌ని చంద్రముఖి ప్రేమిస్తుంది. చయ్‌కి తాను అంటే ఇష్టమని మీరాకు తెలుస్తుంది.

  సమస్యలను ఎలా ఎదురించాడు..

  సమస్యలను ఎలా ఎదురించాడు..

  ఇలాంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న మీరాను ఎలా గట్టెక్కించాడు? మీరాకు ఎదురైన సమస్య ఏంటి? తాతయ్య అంటే చయ్‌కి ఎందుకు కోపం. చంద్రముఖి ఇంటి నుంచి ఎందుకు పారిపోయి వచ్చింది? తాత పిచ్చయ్యకు ఉన్న సమస్య ఏంటి? ఇలాంటి చిక్కు ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ చిత్రం. ఇలాంటి సమస్యలను చయ్ ఎలా ఎదురించాడనేది కథకు ముగింపు.

  ఫస్టాఫ్ ఇలా..

  ఫస్టాఫ్ ఇలా..

  కర్ణాటక సమీపంలోని ఓ గ్రామానికి పెద్ద అయిన పిచ్చయ్య నాయుడు కర్రసాము పోటీలతో కథ ప్రారంభమై.. స్పెయిన్‌లో తన మనుమడి స్టోరితో సినిమా ప్రారంభమవుతుంది. స్పెయిన్ పర్యటనకు వచ్చి హెబ్బా పటేల్ పరిచయం, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కామెడితో ఫస్టాఫ్‌లో కావాల్సినంత కాలక్షేపం జరుగుతుంది. మధ్యలో సినిమా పిచ్చోడు రఘుబాబు పాత్ర స్పెయిన్‌లో ఎంట్రీ ఇచ్చి సినిమాను మరికొంత దూరం లాక్కెళ్తుంది. ఊపిరి చిత్రంలోని నాగార్జున పాత్రకు రఘుబాబు కారెక్టర్ పేరడి. అయినా కథ ఏదో జరుగుతున్న ఫీలింగ్ ఉండదు. ఇంకా ఏదో ఊరింపు ధోరణితో సినీ దర్శకుడు లక్ష్మీ తులసి (పృథ్వీ) కారెక్టర్ ఎంటరవుతుంది. అలా మరికొంత టైమ్ పాస్ చేసి.. ఇంటర్వెట్ బ్యాంగ్‌లో అతి సాధారణమైన ట్విస్ట్‌ ఇవ్వడంతో కొంత రిలీఫ్‌గా అనిపిస్తుంది. అలా ఫస్టాఫ్‌ను చూసిన రెండో భాగంలో ఏదైనా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని ఆశించడం ప్రేక్షకుడు వంతయింది.

  సెకండాఫ్ అలా..

  సెకండాఫ్ అలా..

  ఇక రెండో భాగంలో అనేక మలుపులతో కథ అక్కడక్కడే తిరిగి దాదాపు సినిమా అయిపోయిందనే అనుకొంటుండగానే సినిమా మళ్లీ మొదటికి వస్తుంది. విజయనగర రాజవంశ కథ, హాస్పిట్ సీన్లు ఇలా అనేక పాయింట్లతో సాగదీసి కథను బలవంతంగా ముగించేందుకు సినిమా క్లైమాక్స్‌కు చేరుకొంటుంది. ఇక అంతా అయిపోయిందని ప్రేక్షకుడు లేచే ప్రయత్నం చేసే సమయంలో ఓ పాట, తాతయ్య కథను బలవంతంగా లాక్కొచి సినిమాకు అతికించడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్లవుతుంది. టోటల్‌గా శ్రీను వైట్ల తాను తీసిన అన్ని సినిమాలు కలిపి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వరుణ్‌తో చేసిన ప్రయోగంలా అనిపిస్తుంది.

  మిస్టర్‌గా సినిమా భారాన్నంతా

  మిస్టర్‌గా సినిమా భారాన్నంతా

  మూడు, నాలుగు సినిమాల అనుభవం ఉన్న వరుణ్ తేజ్ మిస్టర్‌గా సినిమా భారాన్నంతా ఒక్కడే మోశాడని చెప్పవచ్చు. గత చిత్రాల కంటే మెరుగైన ఫెర్ఫార్మెన్స్‌ను కనబరిచాడు. ఇంకా కామెడీ టైమింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ఉద్వేగ భరిత సన్నివేశాల్లో నటనకు పదను పెడితే వరుణ్ మెగా క్యాంపులో స్టార్ హీరోగా మారడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. హైట్‌కు తగిన ఫిజిక్, లుక్స్‌తో తెరపై హండ్సమ్‌గా కనిపించాడు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి అంచనాలు పెరుగుతున్న సమయంలో సరైన కథను ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మిస్టర్ చిత్రం చెప్పకనే చెప్పింది. టాలీవుడ్ ఇంకా లాంగ్ కెరీర్ ఉన్నందున ఇప్పుడే జాగ్రత్త పడితే స్టార్ స్టేటస్ సొంతం అవుతుంది. ముకుంద, కంచె, లోఫర్ ఇవన్నీ డైరెక్టర్ ఓరియెంటెడ్ చిత్రాలు. వీటికి భిన్నంగా వరుణ్ మిస్టర్ చిత్రం చేసినట్టు కనిపిస్తుంది. అంటే సోలో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది. ఇలాంటి ప్రయోగం చేసేటప్పడు కథ, కథనాలపై రెండోసారి ఆలోచించి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదేమో..

  లావణ్య త్రిపాఠి లక్కీ మస్కట్

  లావణ్య త్రిపాఠి లక్కీ మస్కట్

  టాలీవుడ్‌లో ప్రస్తుతం లావణ్య త్రిపాఠికి లక్కీ మస్కట్ అనే ట్యాగ్ ఉంది. ఆమె నటించిన భలే భలే మొగాడివోయ్, సొగ్గాడే చిన్నినాయనా, శ్రీ రస్తు శుభమస్తు చిత్రాల విజయాలను లావణ్య తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకొన్నది. తాజాగా మిస్టర్‌తో మరో విభిన్నమైన పాత్రను పోషించింది. రాజవంశంలో 12 ఏళ్ల పాటు గృహనిర్భంధంలో ఉన్న పాత్రను పోషించింది. అలా కఠినమైన జీవితాన్ని గడిపిన ఆమె స్వేచ్ఛ కోసం ఇంటిని పారిపోయే పాత్రలో లావణ్య ఒదిగిపోయింది. బస్సులో జరిగే సన్నివేశాల్లో మంచి నటనను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించింది. క్లైమాక్స్‌లో కూడా తన మార్కును చూపించేందుకు కష్టపడింది. ఏది ఏమైనా పాత్ర పరిధి మేరకు లావణ్య త్రిపాఠి చంద్రముఖిగా మెప్పించిందని చెప్పవచ్చు.

  చిలిపితనం, చలాకీతనంతో హెబ్బా

  చిలిపితనం, చలాకీతనంతో హెబ్బా

  మీరాగా హెబ్బా పటేల్ పర్వాలేదనింపింది. కథకు ఉన్న పరిమితుల దృష్ట్యా గ్లామర్‌ను పండించడానికి హెబ్బాకు అవకాశం దక్కలేదు. నటనలో చిలిపితనం, చలాకీతనం, ఉన్నంతలో గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హెబ్బాకు ఈ చిత్రం పెద్దగా అవకాశాలు కల్పించకపోగా, వచ్చే అవకాశాలకు ముప్పు కలిగించే చిత్రం మాత్రం కాదని చెప్పవచ్చు. అందివచ్చిన అవకాశాన్ని హెబ్బా సద్వినియోగపరుచుకుందనే భావన కలుగుతుంది.

  దర్శకుడు శ్రీను వైట్లది అందెవేసిన చేయి

  దర్శకుడు శ్రీను వైట్లది అందెవేసిన చేయి

  బలమైన కథ, పకడ్బందీగా కథనాన్ని నడిపించడం, వాటికి తోడు హాస్యాన్ని మేలవించడంలో దర్శకుడు శ్రీను వైట్లది అందెవేసిన చేయి అని గత చిత్రాలు నిరూపించాయి. మిస్టర్‌ చిత్రంలో కూడా తనకు అచ్చి వచ్చిన ఫార్మాలానే నమ్ముకున్నాడని అనిపిస్తుంది. రఘుబాబు, సినిమా డైరెక్టర్ పృథ్వీ, తెలంగాణ యాసలో పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి పులికొండ, అభయ్ బేతిగంటి పాత్రలతో కొత్త రకమైన హాస్యాన్ని పండించడానికి చేసిన ప్రయత్నం గత చిత్రాల్లో మాదిరిగా ఆకట్టుకోలేకపోయింది. కథలో అనేక ట్విస్టుల మధ్య ప్రేక్షకుడికి కామెడికి మింగుడుపడని ఔషధంలా మారింది. హాస్పిటల్ సీన్లు ప్రేక్షకుడి సహనానికి ఓ పరీక్షే. ఎలాగైనా హిట్ సాధించాలన్న టెన్షన్‌లో ‘శ్రీను వైట్ల తడబాటుకు గురయ్యాడు. సినిమా నిడివిపై నియంత్రణ కోల్పోయాడు' అనే భావన ప్రేక్షకుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ చూరగొనడం, మల్టిప్లెక్స్‌లకు ఆడియెన్స్‌ను రప్పించడం లాంటి అంశాలపైనే దర్శకుడి ఫేట్ ఆధారపడి ఉంటుంది. దూకుడు లాంటి మరో భారీ హిట్ శ్రీను వైట్లకు దక్కాలంటే మరో చిత్రం వరకు వేచి చూడాల్సిందే.

  కామెడీ టైమింగ్..

  కామెడీ టైమింగ్..

  కామెడీ పరంగా తన పాత్ర పరిధి మేరకు రఘుబాబు పూర్తిగా ఆకట్టుకొన్నాడు. ఇక డైరెక్టర్ లక్ష్మి తులసి పాత్రలో కనిపించిన పృథ్వీ పర్వాలేదనిపించాడు. గత చిత్రాల మాదిరిగా కామెడీ టైమింగ్ లోపించింది. ఆయన పక్కన ఉన్న పాత్రలు అంతగా సపోర్ట్ ఇవ్వకపోవడంతో వారి ఎపిసోడ్ సాదాసీదాగా నడిచిపోయింది. ప్రియదర్శి పాత్ర వచ్చి పోయే పాత్రగానే అనిపించడం తప్ప గుర్తుండి పోయే పాత్ర మాత్రం కాదు.

   కేవీ గుహన్ పనితీరు

  కేవీ గుహన్ పనితీరు

  స్పెయిన్‌లోని అందమైన లొకేషన్లను తెరకెక్కించడంలోనూ, చేజింగ్ సీన్లు, కర్ణాటకలోని పలు ప్రాంతాలను సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ అద్భుతంగా చిత్రీకరించాడు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఫారిన్ లొకేషన్లను తలదన్నేలా తెరకెక్కించాడు. ఈ చిత్రానికి కేవీ గుహన్ పనితీరు అదనపు ఆకర్షణ.

  మిక్కి మ్యూజిక్

  మిక్కి మ్యూజిక్

  అందించిన పాటలు వినడానికి అంతగా బాగలేవనది. సినిమాకు ముందు ఉన్న టాక్. అయితే తెరపైనా అయినా బాగుంటాయా అంటే అదీ లేదు. కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా నాసిరకంగా ఉంది. మిస్టర్ కోసం మిక్కి అందించిన పాటలు ఇవే.

  1. రాహుల్ నంబియార్ పాడిన ఇదో ఇదో బాగుందే..
  2. మిక్కి జే మేయర్ గానం చేసిన కదిలే లోకం మొత్తం
  3. రమ్య బెహారా, అనురాగ్ కులకర్ణి పాడిన సయ్యోరి.. సయ్యెరి
  4. కనులకే తెలియని రమ్య బెహారా
  5. నకాశ్ ఇజాజ్, మోహనా భోగరాజు పాడిన జుమ్మెరి.. జుమ్మెరీ

  ప్రధానమైన సమస్య నిడివి

  ప్రధానమైన సమస్య నిడివి

  మిస్టర్ సినిమాకు ప్రధానమైన సమస్య నిడివి. ఒక సినిమా టికెట్‌పై నాలుగు సినిమాలు చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. తాను చిత్రీకరించిన ప్రతీ సన్నివేశం అద్భుతమని భావించడంలో దర్శకుడిని తప్పుపట్టలేం. అట్లా అని ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే విధంగా సినిమాలో సీన్లను జొప్పించడం సరికాదు అనేది ప్రస్తుతం దృష్టిపెట్టాల్సిన అవసరం. సినిమా విడుదలైన తర్వాత కూడా ఎడిటర్‌కు ఇంకా బోలెడంత పని మిగిలే ఉంది అనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదను పడితే తప్ప ప్రేక్షకుడికి ఉపశమనం ఉండదేమో.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  నెగిటివ్ పాయింట్స్
  కథ, కథనం
  డైరెక్షన్
  సంగీతం
  సినిమా నిడివి

  పాజిటివ్ పాయింట్స్
  వరుణ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్
  లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ గ్లామర్
  కామెడీ

  తెర ముందు.. తెర వెనుక

  తెర ముందు.. తెర వెనుక

  నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్, నాజర్, చంద్రమోహన్, రఘబాబు, పృథ్వీ, నికితిన్ ధీర్, హరీష్ ఉతామన్, ఆనంద్ తదితరులు
  దర్శకత్వం: శ్రీను వైట్ల
  నిర్మాతలు: నల్లమలుపు బుజ్జి, టాగోర్ మధు
  కథ: గోపి మోహన్, శ్రీధర్ సీపాన
  సినిమాటోగ్రఫి: కేవీ గుహన్
  సంగీతం: మిక్కి జే మేయర్
  రిలీజ్ డేట్: ఏప్రిల్ 14, 2017
  నిడివి: 160 నిమిషాలు

  English summary
  Director Srinu Vaitla, Actor Varun Tej's latest movie Mister released on 14 April 2017. Lavanya Tripathi, Hebah Patel are the lead heroines. Naasar, Chandramohan, Pruthvi are potrayed other roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X