Mithra Mandali Movie Review: మిత్ర మండలి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.0/5

నటీనటులు: ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, రాగ్ మయూర్, విష్ణు ఓఐ, ప్రసాద్ బెహ్రా, వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
దర్శకత్వం: విజేందర్ ఎస్
నిర్మాత: కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల
మ్యూజిక్: ఆర్ఆర్ ధ్రువన్
సినిమాటోగ్రఫి: సిద్దార్థ్ ఎస్జే
ఎడిటర్: పవన్ కల్యాణ్
బ్యానర్: బీవీ సినిమాస్
రిలీజ్ డేట్: 2025-10-17

జంగ్లీపట్నంలో చైతన్య (ప్రియదర్శి), సాత్విక్ (విష్ణు), అభి (రాగ్ మయూర్), రాజీవ్ (ప్రసాద్ బెహరా) నలుగురు స్నేహితులు. బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటారు. అదే గ్రామంలో తుట్టె కులానికి చెందిన నారాయణ (వీటీవీ గణేష్) కూతురు స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎమ్)‌ను ప్రేమిస్తుంటారు. అయితే స్వేచ్ఛ మాత్రం చైతన్యను ప్రేమిస్తుంటుంది. ఈ క్రమంలో కూతురు స్వేచ్చ కిడ్నాప్ గురైందని తెలుస్తుంది.

Mithra Mandali Movie Review

నారాయణకు పులిబిడ్డ అనే పేరు ఎందుకు ఉంది? ఊర్లో వారికి నారాయణ అంటే భయం ఎందుకు? తన కూతురు కిడ్నాప్ గురైందని తెలిసిన నారాయణ ఏం చేశాడు? స్వేచ్ఛను ఎవరు కిడ్నాప్ చేశారు? తమను ప్రేమించలేదని అభి, సాత్విక్ కిడ్నాప్ చేశారా? ఈ కేసును ఇన్స్‌పెక్టర్ (వెన్నెల కిషోర్) ఎలా సాల్వ్ చేశాడు? ఈ కథలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) ఏం చేశాడు? చైతన్య, స్వేచ్చ ప్రేమ కథ సుఖాంతమైందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

మిత్ర మండలి సినిమా కథ విషయానికి వస్తే.. సింపుల్ లైన్. పెద్దగా ఇంపాక్ట్ లేని పాయింట్ తీసుకొని దాని చుట్టూ క్రైమ్ కామెడీ కథను అల్లు కొన్నారు. అయితే ఇందులో సరిగా క్రైమ్ వర్కవుట్ కాలేదు. కామెడీ కూడా పెద్దగా పండకపోవడంతో జాతిరత్నాలు లెవెల్‌లో ఉంటుందని భావించిన వారికి నిరాశే మిగిల్చింది. సత్య కామెడీ సీన్లు అక్కడక్కడా వర్కువుట్ అయ్యాయి. వెన్నెల కిషోర్ ఒకే అనిపించేలా ఉంది. అయితే ప్రేమ కథలో బలం లేకపోవడంతో సాదాసీదా చిత్రంగా మిగిలిపోయింది.

ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా క్యారెక్టర్లకు తగినంతగా కామెడీ సన్నివేశాలను రాయకపోవడంతో వారు కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయారు. వారికి సరైనా పాత్రలు, పాత్రలకు కావాల్సినంత రైటింగ్ లేకపోవడం మైనస్‌. అయినా వారు తమకు తోచిన విధంగా నటించి మెప్పించేందుకు ప్రయత్నించారు. నిహారిక ఎన్ఎమ్ ఫర్వాలేదనిపించింది. దర్శకుడు పాత్రలను సృష్టించారనే కానీ.. వాటికి సరైన న్యాయం చేయలేకపోయాడనిపిస్తుంది.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ధ్రువన్ మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది. సిద్దార్థ్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఎడిటర్ పవన్ కల్యాణ్ తన అనుభవాన్ని రంగరించి ఈ సినిమాను పాజిటివ్‌గా రన్ చేసే ప్రయత్నం చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈ సినిమాలోని పాత్రలు, వాటికి ఎంపిక చేసిన నటీనటులు బాగున్నారు. కానీ వాటికి తగినట్టుగా కంటెంట్ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం బట్టి ఈ సినిమా విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X