twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిత్రుడు ఓ బకరా(రివ్యూ)

    By Staff
    |
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సినిమా: మిత్రుడు
    సంస్థ: వైష్ణవి సినిమా
    నటీనటులు: బాలకృష్ణ, ప్రియమణి, చంద్రమోహన్‌, బ్రహ్మానందం, ప్రదీప్‌ రావత్‌,
    బాలయ్య, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్‌, చలపతిరావు, హేమ, ఝాన్సీ తదితరులు.
    కెమెరా: బాల మురగన్
    ఎడిటింగ్: కోలా భాస్కర్
    ఆర్ట్స్: ఆనంద్ సాయి
    ఫైట్స్: రామ్-లక్ష్మణ్
    రచన: విజయేంద్ర ప్రసాద్
    మాటలు: ఎం రత్నం
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌
    దర్శకత్వం: మహాదేవ్‌
    రిలీజ్ డేట్: మే ఒకటి,2009

    కొత్త డైరక్టర్..రాజమౌళి శిష్యుడు..అందులోనూ బాలకృష్ణను హీరోగా తీసుకున్నాడు..ఏదో యాక్షన్ ఫిలిం చేసి అదర కొడతాడు..అని ఎన్నో ఆశలు పెట్టుకుని మిత్రుడు ధియోటర్లో దూకిన వాళ్ళకు తీవ్ర నిరాశే ఎదురైంది. దర్శకుడుగా ప్రమోట్ అయిన మహదేవ్ తనపై అందరూ పెట్టుకున్న అంచనాలను తలక్రిందులు చేస్తూ ఎనభైల నాటి ఓ ఫ్యామిలీ కథను దుమ్ము దులిపి తీసాడు. అంతేగాక ఆ కాలానికి తగ్గ టేకింగ్ తోనే ఆ కథను తెరకెక్కించాడు. దాంతో టీవీ సీరియల్ చూస్తున్న అనుభూతి కలిగి ప్రేక్షకులకు విసుగు రప్పించింది. అక్కడికీ బాలకృష్ణ ఉన్నంతలో సీన్లు పండించటానికి ట్రై చేసారు. కానీ రస హీనమైన కథలో ఆ సన్నివేశాలు పేలవంగా మారి ఎంత లాగినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మిత్రుడు ఏ సెంటర్ నైనా మెప్పించగలగుతాడా అన్నది సందేహంగా మారిపోయింది.

    ఇందు(ప్రియమణి) ఓ పెద్దింటి అమ్మాయి. మలేషియాలో ఉన్నామెకు జాతకం చూపించుకుంటుంది(ఇంట్లో పెద్దలు చూపించరు..ఆమే చూపించుకుంటుంది). దాంట్లో ఆమెకు పెళ్ళయితే ...భర్త నెల లోపలే చస్తాడు అని ఉంటుంది. అయితే అప్పటికే ఆమె దీపక్ తో ప్రేమలో ఉంటుంది. దాంతో ఓ బకరాని పట్టుకుని వాడిని పెళ్ళి చేసుకుని తన నష్ట జాతకానికి బలిపెడదామని ప్లాన్ చేస్తుంది. అలా ఆమె బకరా కోసం వెతుకుతున్న సమయంలో ఎదురౌతాడు ఆదిత్య (బాలకృష్ణ). అతను ఎప్పుడూ ఎప్పుడూ తాగుతూ,ఒంటరిగా ఏదో పోగుట్టుకున్నట్లు నిరాశ, నిస్పృహలతో ఉంటాడు. అతన్ని సెలెక్టు చేసుకున్న ఆమె రకరకాల సినిమాటెక్ విన్యాసాలతో ప్రేమలో పడేసి ఒప్పించి పెళ్ళిచేసుకుంటుంది. అప్పుడు ఏం జరిగింది..ఆదిత్య నిజంగానే మరణిస్తాడా..ఆమె ప్రేమించిన దీపక్ ఏమయ్యాడు..ఇంతకీ ఆదిత్య నీరసంగా అలా నిర్వేదంతో ఉండటానికి కారణం ఏమిటి అన్న విషయాలుపై ఆసక్తి కలిగిన వాళ్ళు తెరపై చూడాల్సిందే.

    ఇక పై విధంగా కథ చెప్పినా(ప్రియమణి పెళ్ళాడబోయే వ్యక్తి మరణిస్తాడు) విషయం తెలిసి ప్రేక్షకులకు కొద్దో గొప్పో ఆసక్తి ఉండేది. అయితే సినిమాలో ఇంటర్వెల్ కి కానీ ఆ అసలు విషయం చెప్పి కథలోకి రారు. దాంతో అప్పటివరకూ హీరోకి సమస్య అనేది ఎటువైపు నుంచి లేక పరమ బోర్ గా తయారైంది. అందులోనూ ఎక్కడో సెకెండాఫ్ చివర్లో చెప్పే ప్లాష్ బ్యాక్ కోసం హీరో పాత్ర(బాలకృష్ణను) ఎప్పుడూ నీరసంగా, నిర్వేదంగా చేసేసారు. పోనీ ఇంత బిల్డప్ ఇచ్చిన బాలకృష్ణ ప్లాష్ బ్యాక్ ఏమన్నా గొప్పగా ఉంటుందా అంటే అత్యంత పేలవంగా ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి ఓ సమస్య పుట్టి అది కథను లేదా హీరోని వెంబడించదు. ఫ్లాష్ బ్యాక్ లేకపోయినా కథ నడుస్తుందనే భరోసా ఇస్తుంది. సాధారణంగా ఇలాంటి కథల్లో ప్లాష్ బ్యాక్ లో జరిగిన సంఘటనకి సంభంధించిన విలన్లు సినిమా మొదటి నుంచి కనపడుతూ ..తిరుగుతూ..ఎదర ఏదో ఉందనే ఆసక్తి గొలుపుతూంటారు.

    పోనీ ప్రియమణి వైపు నుంచి ఉన్న విలన్స్ (దీపక్, ప్రదీప్ రావత్) విలనీ చూద్దామన్నా అది అస్సలు పండలేదు. వారికి హీరో ట్వీస్ట్ లివ్వటం వంటివి లేకుండా పోయాయి. హాలీవుడ్ సినిమా సంధింగ్ ఎబౌట్ మేరీలో లాగ దీపక్ పాత్రను వికలాంగుడుగా నటించటం పెట్టారు. అలాగే మెయిన్ లైన్ జాతకాలుది భద్రాద్రి రాముడు,రాంబంటు చిత్రాలను పూర్తిగా గుర్తుకు తెస్తుంది. వీటన్నటికీ తోడు ఎక్కడా మిత్రుడు అనే టైటిల్ జస్టిఫికేషన్ ఉండదు. ఇక చిత్ర రచన వైపు ఎంత నిర్లక్ష్యం అంటే బాలకృష్ణ ప్లాష్ బ్యాక్ విప్పే కృష్ణభగవాన్ ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడా కనపడడు. ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రియమణిపై చేసిన లెబ్సియన్ కామిడీ, బాలకృష్ణ..వయాగ్రా సన్నివేశాలు దర్శక, రచయితల చీప్ టేస్ట్ తెలియచేస్తాయి.

    సంగీత పరంగా మణిశర్మ క్లైమాక్స్ సాంగ్ తప్ప ఏదీ బాగా ఇవ్వలేదు..ఆర్.ఆర్.స్పెషలిస్ట్ అయిన ఆయన ఈ సినిమాలో అదీ ఫెయిల్యూర్ కావటం దురదృష్టం. ఎడిటింగ్, కెమెరా కథకు, దర్శకుడు టేస్ట్ కి తగ్గట్లే ఉన్నాయి. కొత్త దర్శకుడుగా మహదేవ్ ఏమీ మెరుపులు మెరిపించలేకపోయాడు. అంతకుముందు అతని సహచరుడు ద్రోణ దర్శకుడు రూట్ లోనే వెళ్ళాడు. నటీనటుల్లో బాలకృష్ణ ఎమోషన్ సన్నివేశాల్లో బాగా చేసారు. ప్రియమణి తన అందాలను ఆరబోద్దామని ప్రయత్నించింది కానీ ద్రోణ బికినీ సీన్ చూసిన వారికి అవి ఆనని పరిస్ధితి వచ్చేసింది. ఇక బ్రహ్మానందం, కృష్ణభగవాన్ ఉన్నంతలో నవ్వించాడు. ధర్మవరపు, శ్రీనివాసరెడ్డి వంటి హాస్యనటులు ఉన్నా వినియోగించుకోలేదు.

    ఏదైమైనా మిత్రుడు అభిమానులను సైతం నిరాశపరిచే సినిమా అనటంలో సందేహం లేదు. అయితే బాలకృష్ణ ఇన్ని ప్లాప్ ల తర్వాత కూడా మంచి ఓపినింగ్స్ తెచ్చుకోవటం ఆయన స్టామినాను తెలియచేస్తుంది. మంచి కథ ఎన్నుకుంటే ఇప్పటికీ బాలకృష్ణ ముందువరసలో ఉంటాడనిపిస్తుంది. ఫ్యామిలీలను ఉద్దేశించి తీసిన ఈ సినిమా వారికి నచ్చితే యావరేజ్ అవుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X