Mix Up OTT Review శృంగార సమస్యలు.. వివాహేతర సంబంధాలు.. మిక్స్ అప్ సినిమా రివ్యూ!
Rating: 2.75/5
మూవీ: మిక్స్ అప్ (Mix Up)
నటీనటులు: ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజా జే జవేరి, కామాక్షి భాస్కర్ల తదితరులు
రచన: హైమా వర్షిణి
దర్శకత్వం: ఆకాశ్ బిక్కి
నిర్మాత: తిరుమల్ రెడ్డి అమిరెడ్డి
కో డైరెక్టర్: హేమంత్ దుర్గం
సినిమాటోగ్రఫి: దినేష్ కే బాబు
ఎడిటింగ్: సత్య
మ్యూజిక్: కౌశిక్
ఓటీటీ రిలీజ్: 2024-03-14
ఓటీటీ స్ట్రిమింగ్: ఆహా
సాహు (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజా జవేరి) ఏడు నెలలుగా భార్య భర్తలు, అలాగే అభి (కమల్ కామరాజ్)తో నిక్కి (అక్షర గౌడ) కూడా ఆరు నెలల క్రితం పెళ్లి అవుతుంది. ఈ ఇద్దరి కాపురాల్లో శృంగారం, సెక్స్ ఓ సమస్యగా మారుతుంది. సాహుకు సెక్స్ కోరికలు ఎక్కువైతే మైథిలికి శృంగారం ఇష్టం ఉండదు. ఇక నిక్కికి శృంగారమంటే మహా మోజు.. కానీ అభికి అదంటే చిరాకు. దాంతో పద్మావతి అనే సెక్స్ థెరపిస్టును సంప్రదిస్తారు. ఈ రెండు ఫ్యామిలీలను కొన్ని రోజులు వెకేషన్స్‌కు వెళ్లమని సలహా ఇస్తుంది. వేర్వేరుగా ఓ వారు వెకేషన్‌కు వెళ్తారు. అక్కడ నిక్కి, సాహుతో, మైథిలి అభితో శారీరకంగా దగ్గరవుతారు.

విహార యాత్రకు వెళ్లిన మైథిలీ, సాహు జంటకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అలాగే అభితో శృంగార జీవితాన్ని గడపడానికి చేసిన ప్రయత్నాలు ఎలా విఫలమయ్యాయి? ఎలాంటి పరిస్థితుల్లో నిక్కి, సాహు దగ్గరయ్యారు? ఎలాంటి సంఘటనలు మైథిలిని, అభిని దగ్గరకు చేర్చారు. భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడానికి రీతూ (కామాక్షి భాస్కర్ల) ఎలాంటి పాత్ర పోషించింది. చివరకు ఈ రెండు జంటల జీవితాలకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే మిక్స్ అప్ (Mix Up Story) సినిమా కథ.
శృంగారమే ప్రపంచం.. అది తప్పా మరోటి లైఫ్‌కు సంతృప్తి ఇవ్వదు అనుకొనే ఇద్దరు.. అలాగే దాంపత్యం అంటే సెక్స్ మాత్రమే కాదు.. అనుబంధాలు, ప్రేమ, మరోటి అనుకొనే ఇద్దరు వ్యక్తలు మధ్య అభిప్రాయ బేధాలు..వారి కాపురంలో ఎలాంటి సమస్యలు సృష్టించాయనే కోణంలో దర్శకుడు ఆకాశ్ బిక్కి రాసిన కథ బాగుంది. రెండు జంటల మధ్య చోటుచేసుకొన్న భిన్నాభిప్రాయలను చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే అడల్డ్ కంటెంట్ కొంచెం భాగానే దట్టించాడు. స్టోరీ నేచర్, డిమాండ్ చేయడం వల్లే సీన్లు కాస్త ఘాటుగా ఉంటాయి. నాలుగు పాత్రల మధ్య మానసిక సంఘర్షణ తెరపైన బాగుందని చెప్పవచ్చు.

ఫస్టాఫ్‌లో సాహు, మైథిలీ, అలాగే అభి, నిక్కి వైవాహిక జీవితంలో చోటు చేసుకొన్న సమస్యలు ప్రస్తావిస్తూ కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. విహార యాత్రలో జీవితంలో ఒకే రకమైన అభిరుచి ఉన్న ఇద్దరు వ్యక్తులను కలిపి డ్రామాను కొనసాగించారు. వెకేషన్‌లో అక్రమ సంబంధాలు బ్యాక్ డ్రాప్‌తో సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది. చివర్లో భావోద్వేగాలు సినిమాకు బలంగా మారాయి. లైఫ్‌లో ప్రేమించడమే కాదు.. మరో పార్ట్‌నర్ చేత ప్రేమించబడాలనే విషయం గుర్తుంచుకొనే జీవితం సుఖవంతం అవుతుందనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం ఈ సినిమాకు కీలక అంశంగా మారింది.
ఇక సెక్స్ కోరికలతో పరితపించే సాహుగా ఆదర్శ్ బాలకృష్ణ.. అదే పాత్ర తీరులో నిక్కిగా అక్షర గౌడ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సంసారమంటే శృంగారం కాదనే ఆలోచనతో సాత్వికమైన పాత్రల్లో అభి, మైథిలి మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఫ్రెండ్ క్యారెక్టర్‌లో రీతూగా కామక్షి భాస్కర్ల మెరిసింది. మిగితా పాత్రలకు పెద్దగా స్కోప్ లేకపోయిందనే చెప్పాలి.

మిక్స్ అప్ సినిమాకు హైమా వర్షిణి రచన సహకారం అందిచారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి, మ్యూజిక్ పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. సముద్ర తీరంలో నడిచే ఈ కథలో సన్నివేశాలను దినేష్ బాబు చక్కగా చిత్రీకరించారు. కౌశిక్ మ్యూజిక్ బాగుంది. సత్య ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. తిరుమల్ రెడ్డి అమ్మిరెడ్డి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామిని అర్ధం చేసుకోవాలనే పాయింట్‌తో కథను నడించారు. కానీ అడల్ట్ కంటెంట్ కారణంగా కుటుంబ సభ్యులతో కలిసి చూసే వీలుండదు. కథ డిమాండ్ మేరకు వచ్చే కొన్ని శృంగార సన్నివేశాలు చూడటానికి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. పిల్లలు లేని సమయంలో పెద్దలు ఈ సినిమా చూడొచ్చు. వివాహితులు, యూత్ చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు. తీరిక వేళలో కిడ్స్‌కు దూరంగా ఉండి ఈ సినిమా చూసేయండి.. మంచి అనుభూతిని కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications











