'మొదటి సినిమా' సమీక్ష

By Staff

Modati Cinema
-జోశ్యుల సూర్యప్రకాష్‌
సినిమా: మొదటి సినిమా
విడుదల తేదీ: 21-10-05
నటీనటులు: నవదీప్‌, పూనమ్‌, చిత్రం సీను,
వేణుమాధవ్‌, రవిప్రకాష్‌, బ్రహ్మానందం, కృష్ణభగవాన్‌, అలీ,
సునీల్‌, రాళ్ళపల్లి, శుభలేఖ సుధాకర్‌, తనికెళ్ళ భరణి తదితరులు
సంగీతం: స్వరాజ్‌
కెమెరా: సమీర్‌రెడ్డి
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కూచిపూడి వెంకట్‌
నిర్మాత: కుందురు రమణారెడ్డి

కొత్తదనం పేరుతో ప్రాధమిక అంశాలు కూడా మరిచి స్క్రిప్టులు తయారుచేసుకుంటే 'మొదటి సినిమా'లా ఉంటుంది. కథను వదిలేసి కామెడీతో సినిమాను నడిపే ఆలోచన ఎప్పుడూ ప్రమాదమే. బలం లేని పాత్రలు, అర్ధం లేని కథనం సినిమాను దెబ్బతీశాయి.

ఉదయం పది గంటలకు పరిచయమైన యువతీయువకులు రాత్రి తొమ్మిది గంటలకు ఎలా పెళ్ళి చేసుకుంటారు? అనే విచిత్ర విషయాలు కలిగిన 'మొదటి సినిమా' ఇది. పాత సినిమాల్లో సావిత్రిలా పినతల్లితో బాధలు పడే ఒక యువతి (పూనమ్‌) ఆరోజు ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది. సరిగ్గా అప్పుడే శ్రీరామ్‌ (నవదీప్‌) ఆమెను రోడ్డు మీద చూసి తొలిప్రేమలో పడిపోయి వెంబడిస్తాడు. ఆమె ఇంటర్వ్యూకి లేటవకుండా లిఫ్ట్‌ ఇస్తాడు. ఉద్యోగం వచ్చాక ఆమెకు గిఫ్ట్‌ ఇద్దామని మిత్రుడు సునీల్‌కి ఫోన్‌ చేస్తాడు. సునీల్‌ వచ్చేలోపల ఆమెను పక్కకు తప్పించి, సర్‌ప్రైజ్‌ చేద్దామని దగ్గరలో ఉన్న జ్యోతిషుడిని కలవమంటాడు. ఆ జ్యోతిష్యుడు ఆమెను చూడగానే ముందే ప్రిపేరైనట్టు రెండు విషయాలు చెబుతాడు. ఆరోజు ఆమెకు ఒక యాక్సిడెంట్‌ తప్పుతుందని, పరిచయమైన యువకునితో అదే రోజు రాత్రి పెళ్ళవుతుందని చెబుతాడు. ఆమె ఇలాంటి వాటిని నమ్మనని చెప్పి తనను అక్కడికి పంపిన శ్రీరాం చెంప మీద వాయిస్తుంది. ఇలా మొదటి సినిమా ఇంటర్వల్‌ బ్యాంగ్‌ అయినాక ఆమెకు యాక్సిడెంట్‌ కాబోయి తప్పుతుంది. ఇంతలో ఆమె తండ్రి (శుభలేఖ సుధాకర్‌) ఒక సంబంధం కుదిరిందని, ఈ రాత్రికే పెళ్ళని చెబుతాడు. జ్యోతిషుడు చెప్పిన ప్రకారం ఆరోజు పరిచయమైన వ్యక్తినే పెళ్ళి చేసుకుంటుందా అనేది తెర మీద చూడాల్సిందే.

తలాతోకా లేని ఈ కథకు కెమెరాయే ప్రాణమైంది. సినిమా విజయవంతమైతే పాటలు ఎలివేట్‌ అయ్యేవి. కానీ స్క్రిప్టు మరీ బలహీనంగా ఉండడం, స్క్రీన్‌ప్లేను గాలికి వదిలేయడం, కథలో కలవని కామెడీ సినిమాను ఆసక్తి లేకుండా చేశాయి. ఏ సినిమాకైనా మొదట్లో పాత్రల పరిచయం 'సెటప్‌ సీన్స్‌' ఉంటాయి. దీనిలో విచిత్రంగా సినిమా ముగిసే వరకు కొత్త పాత్రలు వస్తుంటాయి. అసహనం కలిగిస్తాయి. ఏ కథకైనా కీలకమైన కాన్‌ఫ్లిక్ట్‌ (సంఘర్షణ) ఉండాలి. అది ఈ సినిమాలో లోపించింది. జ్యోతిష్యాన్ని ఎలివేట్‌ చేసే సీన్లు మొదట్లో లేకపోవడంతో 'రిలాక్స్‌' చిత్రంలో లాగా దానిని నమ్మి కథను ఫాలో కావడం కష్టం. కథలోకి వస్తే ఎన్నో విచిత్రాలు ఉంటాయి. ఏ తండ్రి అయినా మరో గంటలో పెళ్ళి అని కూతురికి చెబుతాడా? అదీ ఆమెరికా వెళ్ళే కుర్రాడితో అయినప్పుడు ఉదయం ఉద్యోగం ఇంటర్వ్యూకి ఎందుకు పంపిస్తాడు? పెళ్ళి కొడుకైన రవిప్రకాష్‌ తమ పెళ్ళికి రమ్నని హీరోని పదే పదే కోరుతుంటాడు. గంట క్రితం పరిచయమైన వ్యక్తిని అంతగా అభ్యర్ధించడం సహజంగా లేదు. రఘుబాబు హోమోసెక్సువల్‌ పాత్ర సినిమా మొదటి నుంచి చివరివరకు వెంటాడుతూ అసహ్యం కలిగిస్తుంది. బ్రహ్మానందం,అలీ, వేణుమాధవ్‌ల పాత్రలకు ముగింపు ఉండదు. ఇలా ఇన్ని తప్పులున్నా సినిమాలో పాటలు, వాటి చిత్రీకరణలో దర్శకుడి అభిరుచిని మెచ్చుకోవాలి. ఛానల్స్‌పై సెటైర్లు బాగా పేలాయి. ఫ్రెష్‌నెస్‌ ఉన్న సినిమాగా ప్రొజెక్ట్‌ అయినా ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది.

గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X