Modern Masters: SS Rajamouli Documentary Review: మోడర్న్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి ఓటిటి రివ్యూ
కామెంటేటర్స్: రాజమౌళి, రామా రాజమౌళి, రామ్ చరణ్, ప్రభాస్, జూ. ఎన్టీఆర్, ఎం ఎం కీరవాణి, కరణ్ జోహార్, రాఘవేంద్రరావు, జేమ్స్ కామెరాన్, జో రస్సో.
దర్శకులు: రాఘవ్ కన్నా, తన్వి అజింక్య
నిర్మాతలు: అనుపమ్ చోప్రా, దీపక్, సమీర్ నాయర్
విడుదల: 02/08/2024.
స్టోరీ:
ప్రైడ్ ఇండియన్ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ లెవెల్ దర్శకునిగా ఎలా మారారు అనే కోణంపై ప్రపంచ టాప్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చిన కొత్త ప్రయత్నమే ఈ మోడర్న్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి. ఇందులో రాజమౌళి ఎలా ఒక సీరియల్ దర్శకుడు నుంచి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ దర్శకునిగా రూపాంతరం చెందారు? తనకి తన కుటుంబానికి ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఎలాంటిది? తన హీరోస్ తో సినిమాలు చేసినప్పుడు వారు పడే బాధలు ఏంటి? అసలు రాజమౌళి ఎప్పుడైనా పాన్ వరల్డ్ దర్శకుడిగా మారుతాను అని ఎప్పుడైనా అనుకున్నారా? రాజమౌళిని ఎందుకు పని రాక్షసుడు అంటారు? సినిమాల నుంచి బ్రేక్ సమయాల్లో రాజమౌళి ఏం చేస్తాడు? బడ్జెట్ లు తగ్గించడం కోసం రాజమౌళి చేసిన త్యాగాలు, తమ కుటుంబం పడ్డ కష్టాలు ఏంటి? రాజమౌళి కోసం తన సినిమా నటీనటులు నిర్మాతలు హాలీవుడ్ దర్శకులు సైతం ఏం చెప్పారు.. అనేవి అసలు వాట్ ఈజ్ రాజమౌళి అనే ఇంకా చాలా అంశాల కలయికే ఈ డాక్యుమెంటరీ చిత్రం తాలూకా అసలు సారాంశం.

విశ్లేషణ:
ప్రపంచ నెంబర్ 1 సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చిన ఈ వినూత్న ప్రయోగంకి ముందుగా మంచి మార్కులు ఇవ్వవచ్చు. భారతీయ సినిమా దగ్గర మన తెలుగు సినిమా స్థాయిని పెంచడం, ప్రపంచ సినిమా దగ్గర భారతీయ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిన దర్శకుడిగా రాజమౌళి చేసిన కృషి ఏంటి అనేది చాలా మందికి తెలుసు. కానీ ఈ చిత్రంలో అంతకు మించే అంశాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా రాజమౌళి ఒక దర్శకుడిగా ఎలా ఎవాల్వ్ అయ్యారు అని చూపించిన అంశాలు ఈ చిత్రంలో ఇంప్రెస్ చేస్తాయి.
తన చిన్నతనంలోనే తన తండ్రి చేసిన "పిల్లన గ్రోవి" అనే సినిమా ఆగిపోవడం అప్పుడు తమ కుటుంబం ఎదురుకొన్న పరిస్థితి కోసం వివరించడం వంటివి మంచి ఎమోషనల్ గా సాగుతాయి. అలాగే రాజమౌళి ఒక సీరియల్ దర్శకుడిగా(శాంతి నివాసం) నుంచి ఇప్పుడు 'RRR' వరకు చేసిన ప్రయాణాన్ని మంచి ఎమోషన్స్ మన ఇప్పుడు వరకు చూడని వెర్షన్ రాజమౌళిని ఈ సినిమాలో చూపించించడం మంచి ఉద్వేగభరితంగా సాగుతాయి.
రాజమౌళి చిన్నతనం నుంచే ఒక స్టోరీ టెల్లర్ అని చాలా మందికి తెలియకపోవచ్చు. తన స్కూల్ ఏజ్ నుంచే రాజమౌళికి ఆ ఇంట్రెస్ట్ ఉండగా అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన విధానం ఇందులో బాగా క్యారీ చేశారు. రాజమౌళి కోసం తన అన్నయ్య ఎం ఎం కీరవాణి, తన భార్య రామా రాజమౌళి పంచుకున్న కొన్ని విషయాలు ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి.

అలాగే ప్రతి సినిమాకి రాజమౌళి పడ్డ కష్టాన్ని మనం చూడలేదు కానీ ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి ఇంత హార్డ్ వర్క్ చేస్తాడా అని చూసిన ప్రతి ఒక్కరికీ అనిపించక మానదు. ఇంకా బాహుబలి షూటింగ్ సమయంలో రాజమౌళి బడ్జెట్ మిగిల్చడం కోసం చేసిన కొన్ని పనులు గాని తన భార్య పట్ల తనకి ఎంత ప్రేమ ఉందో అని ప్రభాస్ చెప్పిన మాటలు కానీ రాజమౌళి పై ఖచ్చితంగా మరింత గౌరవాన్ని పెంపొందిస్తాయి. అలాగే ఎన్టీఆర్ కూడా చాలా ఆసక్తికర కామెంట్స్ తన డైరెక్టర్ పై చేసాడు.
ప్రతి అంశం చాలా పర్ఫెక్ట్ గా కావాలి అనుకుంటాడు, నాటు నాటు సమయంలో ఇద్దరి చేతులు, కాళ్ళు ఒకే లైన్ లో సమాంతరంగా ఉన్నాయా లేదా అని చూసేవాడు అని తెలిపాడు. ఇక రామ్ చరణ్ అయితే మగధీర సమయంలో 100 మంది ఫైట్ కి ముందు ఢంకా మోగించే సన్నివేశంలో స్వయంగా రాజమౌళి ఒక ఆర్ట్ వర్క్ ని సెట్ చెయ్యడం కానీ ఈగ సినిమాకి తన డైరెక్షన్ గాని ఇలా చాలా అంశాలతో "రాజమౌళి ది బిగినింగ్ నుంచి రాజమౌళి ది రైజ్" అంటూ చిన్నపాటి సీరియల్ దర్శకుడు నుంచి తన సినిమాకి ఆస్కార్ వరకు ఎలా ఎదిగాడు అనే ప్రయాణం బాగుటుంది. ఈ చిత్రంలో బాగుంటాయి.
కానీ గంటంపావు సేపు ప్లాన్ చేసిన ఈ డాక్యుమెంటరీ ఫుల్ ఫ్లెడ్జ్ ఎంగేజింగ్ గా ఉండదు. తన కుటుంబానికి సంబంధించి కొన్ని సీన్స్ ఇందులో అంత ఇంపాక్ట్ కలిగించవు. అలాగే దాదాపు తెలుగు ఆడియెన్స్ చూడాలి అనుకుంటే ఒరిజినల్ ఇంగ్లీష్ లోనే సబ్ టైటిల్స్ అయినా పెట్టుకొని చూడండి కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం వరస్ట్ ఎక్స్ పీరియన్స్ తెలుగు ఆడియెన్స్ కి ఇస్తుంది. అయితే ఇందులో హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కామెరాన్ ఇంకా జో రస్సో(అవెంజర్స్ సినిమాల దర్శకుడు) వంటివారు రాజమౌళి కేపబిలిటీ కోసం మాట్లాడ్డం అనేది మాత్రం ప్రతి తెలుగువాడికి భారతీయ సినిమా ఆడియెన్స్ కి మన నుంచి ఓ దర్శకుని కోసం మాట్లాడ్డం గర్వకారణంగా అనిపిస్తాయి.

టెక్నికల్ గా ఎలా ఉంది?
నెట్ ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీలు చూసేందుకు ఎప్పుడూ మంచి ఆసక్తిగానే ఉంటాయి. జెనరల్ గా తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇప్పుడు వరకు కొన్ని డాక్యుమెంటరీలు వచ్చాయి కానీ తెలుగువారి మీదే దీనిని ప్లాన్ చేసినప్పటికీ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, వంటి తెలుగు వాళ్ళతోనే తెలుగు వెర్షన్ కి కూడా డబ్బింగ్ చెప్పించాల్సింది. కానీ నెట్ ఫ్లిక్స్ ఈ స్టెప్ తీసుకోకపోవడంతో తెలుగు ఆడియన్స్ కి పెద్ద డిజప్పాయింట్మెంట్ అని చెప్పాలి.
ఇక రోహిత్ ఇచ్చిన స్కోర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. అలాగే సంయుక్త కాజా ఎడిటింగ్ ఓకే కానీ కొన్ని సీన్స్ ఫాస్ట్ పేస్డ్ గా కట్ చెయ్యాల్సింది. అలాగే నికుంజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. స్టార్ కాస్ట్ అందరినీ మంచి ఫ్రేమ్స్ లో పెట్టి చూపించాడు. అలాగే రాజమౌళి స్టైలిష్ డ్రెస్సింగ్ కానీ హాలీవుడ్ లో కొన్ని లొకేషన్స్ దగ్గర చూపించిన విధానాలు బాగున్నాయి. ఇక దర్శకులు రాఘవ్, తన్విలు రాజమౌళి విషయంలో చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగుంది. అలాగే హీరోస్ నుంచి పలు ఇంట్రెస్టింగ్ విషయాలని వారు రాబట్టారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం స్లోగా ఈ చిత్రాన్ని నడిపించారు. ఇవి మినహా వారి వర్క్ ఓకే..
ఫైనల్‌గా
ప్రస్తుతం భారతీయ సినిమా గతిని మార్చింది దర్శకుడు రాజమౌళినే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ రాజమౌళి ఒక సాధారణ సీరియల్ సహాయ దర్శకుడు స్టేజ్ నుంచి గ్లోబల్ ఫినామినా RRR లాంటి సెలబ్రేటింగ్ సినిమా చేసి ఆస్కార్ ని ఇండియాకి ఎలా తీసుకురాగలిగాడు? సినిమా పట్ల తన తాపత్రయం ఏ పాయింట్ వరకు వెళుతుంది అనే ఆసక్తికర అంశాలు ఈ డాక్యూమెంటరీలో మెప్పిస్తాయి. చాలా వరకు జెనరల్ ఆడియెన్స్ కి తెలియని కొత్త అంశాలు ఇందులో ఉన్నాయి.
ఖచ్చితంగా రాజమౌళి కోసం చూడాలి అనుకునేవారు ఈ చిత్రంతో అంత సులభంగా డిజప్పాయింట్ కారు. వీటితో తనపై ఒకింత గౌరవం కూడా పెరుగుతుంది. కానీ కొన్ని ఫ్లాస్ కూడా లేకపోలేవు. తన ఫ్యామిలీ ఎపిసోడ్స్ కొన్ని ముభావంగా కనిపిస్తాయి. కానీ తన సినిమా వరకు వచ్చే ఎపిసోడ్స్ అన్నీ చాలా బాగుంటాయి. మెయిన్ గా బాహుబలి ఎపిసోడ్ అయితే చాలా బాగుటుంది. ఒక కొత్త రాజమౌళి కోసం తెలుసుకోవాలి అనుకునేవారు తప్పకుండా నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీని ట్రై చేయవచ్చు. కాకపోతే ఇంగ్లీష్ లోనే ట్రై చేస్తే బెటర్..


Click it and Unblock the Notifications











