twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Marakkar Movie Review మలయాళ ‘సైరా’ ఎలా ఉందటే.. అదరగొట్టిన మోహన్‌లాల్ తనయుడు

    |

    Rating:
    2.5/5
    Star Cast: మోహన్‌లాల్, అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, కీర్తి సురేష్, కల్యాణి ప్రియదర్శన్
    Director: ప్రియదర్శన్

    దక్షిణాది సూపర్ స్టార్ మోహన్‌లాల్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ చిత్రం మరక్కార్ (మలయాళంలో మరక్కార్: అరబిక్ కడలందం). మోహన్‌లాల్ కెరీర్‌లోనే ఇప్పటి వరకు తెరకెక్కని భారీ బడ్జెట్ చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే జాతీయ అవార్డుల్లో సత్తా చాటడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. లాక్‌డౌన్ కారణంగా ఏడాదిపాటు విడుదలకు నోచుకోకుండా వాయిదా పడింది. అయితే వ్యాపారం పేరుతో భారత్‌లో పోర్చుగీస్‌ దేశం వారు చేస్తున్న అరాచకాలను ఎదురించిన యోధుడి కథను మరక్కార్‌ సినిమాగా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించిందంటే..

    మరక్కార్ కథ

    మరక్కార్ కథ

    కోజికోడ్ సామ్రాజ్యానికి నౌకాదళ కమాండర్‌గా పనిచేసే కుంజలి మరాక్కర్ (మోహన్‌లాల్, యువ కుంజలిగా మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్) పోర్చుగీస్ సేనలు ధీటుగా ఎదురిస్తుంటాడు. యుక్త వయసులో ఆయేషా (కల్యాణి ప్రియదర్శన్)తో పెళ్లి తర్వాత తన కళ్ల ముందే పోర్చుగీస్ సేనలు తల్లి ఖదీజుమ్మ (సుహాసిని) చంపడం చూస్తాడు. పోర్చు గీసు సేనలను అంతమొందించేందుకు పూనుకొంటాడు. చివరకు తన సోదరుడిని భార్య సుబైదా (మంజు వారియర్) కుట్రతో పోర్చుగీస్ సేనలకు దొరికిపోతాడు.

    మరక్కార్ చిత్రంలో ట్విస్టులు

    మరక్కార్ చిత్రంలో ట్విస్టులు

    కుంజాలికి ఆనందన్ (అర్జున్ సజ్జా) ఉన్న సంబంధమేమిటి? ఆనందన్‌ను ఏ పరిస్థితుల్లో కుంజాలి చంపాడు? ఆనందన్‌ను చంపిన కారణంగా తన జీవితాన్ని ఎందుకు పణంగా పెట్టాడు? ఈ కథలో చండ్రోత్ ఫణిక్కర్ (సునీల్ శెట్టి) పాత్ర ఏమిటి? కుంజాలి స్నేహితుడు (ప్రభు) పాత్ర ఏమిటి? పోర్చుగీస్‌ సేనలను ఎదురించడానికి సాముద్రిక రాజుతో కుంజాలి ఏ పరిస్థితుల్లో చేతులు కలిపాడు. కుంజాలిని చంపడానికి సుబైదా ఎందుకు కుట్రపన్నింది? పోర్చుగీస్ సేనల క్షమాబిక్షను అంగీకరించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మరక్కార్ సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    పోర్చుగీస్ సేనలను ఎదురించే యువ కుంజాలి (ప్రణవ్ మోహన్‌లాల్) చిన్న ప్రేమకథతో ఎమోషనల్‌గా కథ సాగుతుంది. కుంజాలితో పెళ్లి తర్వాత పోర్చుగీస్ సేనలు జరిపిన దాడిలో ఆయేషా ఆకస్మిక మరణించడం, ఆ తర్వాత తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడం లాంటి అంశాలు సినిమా కథను మరింత భావోద్వేగంగా మారుతుంది. అయితే కథలో కీలక మలుపు లేకపోవడం, ఎలివేషన్, బిల్డప్ సన్నివేశాలు కనిపించకపోవడం వల్ల సినిమా ఫ్లాట్‌గా సాగుతుంది. ఎలాంటి ట్విస్టులు, హై నోట్ సీన్లు లేకుండా తొలి భాగంగా ముగియడం వల్ల ఆర్డినరీ సినిమాగా అనిపిస్తుం

     సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో


    సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా కథను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి. అర్జున్ సజ్జా పాత్ర ఎలివేట్ కావడంతో యాక్షన్ పార్ట్ ఆసక్తిని రేపుతుంది. ఇక ఓ కారణంగా ఆనందన్ (అర్జున్ సజ్జా)ను చంపడంతో కథ మలుపు తిరుగుతుంది. క్లైమాక్స్‌లో కుంజాలి కోటపై పోర్చుగీస్ సేనలు దాడి ఎపిసోడ్స్‌ సినిమాకు హైలెట్‌గా మారుతాయి. పోర్చుగీస్ సేనలకు కుంజాలి దొరికిన తర్వాత మరక్కార్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లినట్టు కినిపస్తుంది.

    మోహన్‌లాల్, ప్రణవ్ మోహన్‌లాల్

    మోహన్‌లాల్, ప్రణవ్ మోహన్‌లాల్


    నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. యువ కుంజాలిగా మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. యువ కుంజాలిగా ప్రణవ్ అదరగొట్టాడు. ప్రణవ్‌ పాత్రను మరికొంత సేపు పెంచి ఉంటే బాగుండనే ఫీలింగ్ కలుగుతుంది. కుంజాలిగా మోహన్ లాల్, ఆనందన్‌గా అర్జున్ సర్జా హై ఓల్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. సునీల్ శెట్టి పాత్ర పెద్దగా ఆకట్టుకొన్నట్టు కనిపించదు. ఇక కుంజాలి తల్లిగా సుహసిని, కుంజాలి ప్రేయసిగా కల్యాణి ప్రియదర్శన్ చిన్న పాత్రలు అయినా గుర్తుండి పోతాయి. మంజు వారియర్ ఓ కీలకపాత్రలో కనిపించి మెప్పించారు. మిగితా పాత్రల్లో నటించిన వారి పాత్రల మేరకు ఫర్వాలేదనిపించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు


    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. తిరు తెరకెక్కించిన యాక్షన్ సీన్లు, సముద్రంలో చిత్రకీరించిన ఫైట్స్ అబ్బురపరిచేలా ఉంటాయి. మరక్కార్‌ చిత్రానికి సినిమాటోగ్రఫి, మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. రీరికార్డింగ్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఇక ఈ సినిమాకు ఆర్ట్ విభాగం పనితీరు మరో ఆకర్షణ. పాత్రల కోసం డిజైన్ చేసిన క్యాస్టూమ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్. సాంకేతిక అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా మరక్కార్ అని చెప్పవచ్చు.

     ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    అద్బుతమైన కథ, కథనం, భావోద్వేగమైన పాత్రల కలయికతో రూపొందిన చిత్ర మరక్కార్. అయితే ఎమోషనల్ కథ తెర మీద కనిపించకపోవడం, మోహన్ లాల్ మినహా మిగితా పాత్రలు బలంగా లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని, సరికొత్త అనుభూతిని పంచలేకపోయాయని చెప్పవచ్చు. ఓవరాల్‌గా తెలుగు చిరంజీవి నటించిన సైరా సినిమా మాదిరిగా ఉంటుందని చెప్పవచ్చు. మోహన్ లాల్ నటన, సాంకేతిక అంశాలు, ప్రోడక్షన్ వ్యాల్యూస్ కోసం ఈ మలయాళ 'సైరా'ను చూడవచ్చు.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు


    నటీనటులు: మోహన్‌లాల్, అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, కీర్తి సురేష్, కల్యాణి ప్రియదర్శన్, సుహాసిని, ప్రణవ్ మోహన్‌లాల్, తదితరులు
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రియదర్శన్
    నిర్మాత: అంటోని పెరుంబవూర్
    సినిమాటోగ్రఫి: తిరు
    మ్యూజిక్: రాహుల్ రాజ్, అంకిత్ సురీ, రోని రాఫెల్
    ఎడిటింగ్: ఎంఎస్ అయ్యప్పన్ నాయర్
    బ్యానర్: ఆశీర్వద్ సినిమాస్, కాన్ఫిడెంట్ గ్రూప్
    డిస్ట్రిబ్యూషన్: మ్యాక్స్ మూవీస్, వీ క్రియేషన్స్, ఫార్స్ ఫిల్మ్స్
    రిలీజ్ డేట్: 2021-12-03

    English summary
    Mohanlal's Marakkar Movie Review and Rating: Pranav Mohanlal's mesmerize performance
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X