Alone Review: ఒక్క పాత్రతో సినిమా.. మోహన్ లాల్ 'ఎలోన్' ప్రయోగం వర్కౌట్ అయిందా?
రేటింగ్: 2/5
టైటిల్: ఎలోన్
నటీనటులు: మోహన్ లాల్
సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, ప్రమోద్ కె. పిళ్లై
సంగీతం: 4మ్యూజిక్స్
నిర్మాత: అంటోనీ పెరంబూర్
కథ, దర్శకత్వం: షాజీ కైలాస్
థియేటర్ విడుదల తేది: జనవరి 26, 2023
ఓటీటీ విడుదల తేది: మార్చి 3, 2023
ఓటీటీ వేదిక: డిస్నీప్లస్ హాట్‌స్టార్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటుడిగా విభిన్న ప్రయోగాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే అందులో హిట్స్, ఫ్లాప్స్ అంటూ తేడా లేకుండా వరుస సినిమాలతో అలరిస్తుంటారు. దృశ్యం 2 వంటి థ్రిల్లర్ తో హిట్ కొట్టిన ఆయన గతేడాది 12th Man సినిమాతో పర్వాలేదనిపించుకున్నారు. తర్వాత ఆరట్టు, బ్రో డాడీ, మాన్‌స్టర్ వంటి చిత్రాలు చేశారు.
ఇక ఈ ఏడాది ఎలోన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. షాజీ కైలాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 26న మలయాళ వెర్షన్ లో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు తాజాగా తెలుగు, తమిళం, హిందీలో అనువదించి ఓటీటీలోకి తీసుకొచ్చారు. మార్చి 3 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఎలోన్ ఉందో రివ్యూలో చూద్దాం!

కథ
కరోనా సమయంలో లాక్ డౌన్ విధిస్తారు. అప్పుడు కాళీదాసు (మోహన్ లాల్) కోయంబత్తూర్ నుంచి కొచ్చికి షిఫ్ట్ అవుతాడు. ఒక కమ్యునిటీ అపార్టుమెంట్ లో ఫ్లాట్ తీసుకుని దిగుతాడు. ఆ ఫ్లాట్ కు వెళ్లినప్పటి నుంచి కాళీదాసుకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఒక తల్లీకూతుళ్ల గొంతులు రెగ్యూలర్ గా వినిపిస్తుంటాయి.
తర్వాత వాళ్లిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు క్లోజ్ చేశారన్న విషయం తెలుసుకున్న కాళీ దాసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. అసలు ఆ తల్లీకూతుళ్లు ఎవరు? వారిది హత్యా? ఆత్మహత్యా? వాళ్ల ఆత్మల గొంతు కాళీదాసుకే ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు కాళీదాసు ఎవరు? అతను చివరికీ ఏం చేశాడు? అనేదే ఎలోన్ సినిమా.

విశ్లేషణ
మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ సినిమా ఎలోన్ మొత్తం లాక్ డౌన్ నేపథ్యంలో జరుగుతుంది. కరోనా సమయంలో లాక్ డౌన్, మాస్క్, శానిటైజర్ వాడకం, డిస్టన్స్ మెయింటేన్ చేయడం వంటి సీన్లతో ప్రారంభం అవుతుంది. సినిమాలో కేవలం కాళీదాసు అనే ఒక్క పాత్ర మాత్రమే కనిపిస్తుంది. మిగతా పాత్రలు కేవలం వాళ్ల ఫోన్ కాల్స్ లలో గొంతులు మాత్రమే వినిపిస్తాయి.
వాళ్ల ద్వారా లాక్ డౌన్ లో కాళీదాసు చేశాడనేదే సినిమా కథ. అయితే ఇది ముందుగా ఒక హారర్ సినిమా అని అనిపిస్తుంది. సన్నివేశాలు, సంఘటనలు అలానే ఉంటాయి. రాను రాను ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీగా మారుతున్నట్లు అనిపించి చివిరికీ వచ్చేసరికి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా ముగుస్తుంది.

క్లైమాక్స్ ట్విస్ట్ అలా..
డైరెక్టర్ షాజీ కైలాస్, హీరో మోహన్ లాల్ ఇద్దరు చేసిన ఒక్క పాత్ర ప్రయోగం సినిమా ఎలోన్ ను ఒక్క జానర్ మూవీలా కాకుండా రెండు, మూడు జానర్ లకు షిఫ్ట్ అవుతున్నట్లుగా చూపించారు. అది మెచ్చుకునే విషయమే కానీ, దానికి తగినట్లుగా ఎంగేజింగ్ సీన్లు, స్క్రిప్ట్ వర్క్ ఉంటే బాగుండేది. కానీ ఎలోన్ మాత్రం ఏమాత్రం ఎంగేజింగ్ చేయకుండా ఫుల్ బోర్ కొట్టిస్తుంది.
ఇక ప్రతిసారి మోహన్ లాల్ నే చూడటం కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. రంగురంగుల టీ షర్ట్స్, షర్ట్స్ లో మోహన్ లాల్ ను చూపించారు. ఆయనతో మంచి భారీ డైలాగ్ లు కూడా చెప్పించారు. కానీ ఆ సమయంలోని సన్నివేశాలకు అంత డెప్త్ డైలాగ్ లు సూట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

బెటర్ గా కెమెరా వర్క్..
సినిమా మొదటి నుంచి ఎండ్ వరకు పెద్దగా ఆసక్తి ఏముంది. ఒక రొటీన్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. అయితే కెమెరా పనితనం మాత్రం బాగుంది. డిఫరెంట్ యాంగిల్స్ లో ఫ్రేమ్స్ చూపించడం కాస్తా బెటర్ గా అనిపించింది. ఇక మ్యూజిక్ సోసోగా ఓకే అనొచ్చు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నప్పటికీ ఇలాంటి తరహా సినిమాలు ఈ మధ్య చాలానే వస్తున్నాయి.
కాబట్టి అవి చూసిన వాళ్లకు క్లైమాక్స్ ట్విస్ట్ పెద్దగా కిక్క్ ఇవ్వదు. ముందుగానే ఊహించే అవకాశం కూడా ఉంది. ఒక పాయింట్ లో ట్విస్ట్ సర్ ప్రైజింగ్ గా ఉన్నప్పటికీ రెండు గంటల బోర్ తర్వాత అది కూడా ఉపయోగం లేకుండా పోయినట్లు అనిపిస్తుంది. ఒక ఫోన్ కాల్ లో తేల్చాల్సిన విషయాన్ని సాగదీసి రెండు గంటలు చేశారనిపించింది.

మోహన్ లాల్ నటన..
సినిమాలో కేవలం మోహన్ లాల్ ఒక్కిరిదే సింగిల్ క్యారెక్టర్. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ తరచూ ఆయనే కనిపిస్తే బోర్ కొడుతుంది. మిగతా నటీనటులు ఎవరు కనిపించరు. వాళ్ల గొంతులు మాత్రమే వినిపిస్తాయి. వాళ్లతో మోహన్ లాల్ చేసే కన్వర్జేషన్, ఉపయోగించుకునే తీరు పర్వాలేదు.

చివరిగా చెప్పాలంటే..
డిఫరెంట్ కథలు, కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది మలయాళం సినీ ఇండస్ట్రీ. అయితే అలాంటి పరిశ్రమ నుంచి ఇలాంటి చిత్రాన్ని ఊహించలేం. మోహన్ లాల్ ఒక్కరే తెరపై కనిపించేలా.. కేవలం ఒకే ఒక్క పాత్రతో సినిమా చేయాలన్న ఆలోచన బాగుంది కానీ ఎంగేజింగ్ నేరేషన్, ట్విస్ట్ లతో తెరకెక్కిస్తే ఈ సినిమాకు కూడా చప్పట్లు పడేవి. ఇదివరకు మాన్‌స్టర్ సినిమాతో మోహన్ లాల్ చేతులు కాల్చుకున్నారని టాక్ రాగా.. ఎలోన్ సినిమాతో కాళ్లు కూడా కాల్చుకున్నారనే డౌట్ రాక మానదు.


Click it and Unblock the Notifications











