Mollywood Times First Review: మాలీవుడ్ టైమ్స్ మూవీ ఫస్ట్ రివ్యూ

దేశ సినీ పరిశ్రమలో మలయాళ చిత్రాల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో చిత్రం మాలీవుడ్ టైమ్స్. సినిమా బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాలో యువ హీరోలు నస్లేన్, షరాఫ్ యూ ధీన్, సంగీత్ ప్రతాప్, రోషన్ షానవాస్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ చిత్ర దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించగా, రాము సునీల్ రచనా సహకారం అందించారు. ఈ సినిమాను ఆశీక్ ఉస్మాన్ నిర్మించారు.

మాలీవుడ్ టైమ్స్ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి మ్యూజిక్: జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫి: విశ్వజిత్ ఒడుక్కాతిల్, ఎడిటింగ్: నిధిన్ రాజ్ అరోల్, అభినవ్ సుందర్ నాయక్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఆశీక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం జూన్ 5వ తేదీన దేశవ్యాప్తంగాను, ఓవర్సీస్‌లోను రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసింది? ఈ సినిమా కథ ఏమిటి? ఈ చిత్రానికి సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ ఏంటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? ఈ చిత్రంపై ఫీడ్‌బ్యాక్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

Mollywood Times Review by Censor Board

సినిమా రంగంలో రాణించాలనే తపన ఉన్న యువకుడు వినీత్ మాధవన్ (నెస్లేన్) తన ప్రయత్నాలు మొదలుపెడుతాడు. హారర్ చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకొని టాప్ డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. ఈ ప్రయాణంలో రకరకాల సమస్యలను ఎదుర్కొంటాడు. ఆ సమయంలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న మలయాళ సినిమా పరిశ్రమకు మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకోవాలని కంకణం కట్టుకొంటాడు.

వినీత్ మాధవన్ హారర్ చిత్రాల దర్శకుడిగా ఎందుకు మారాలని అనుకొన్నాడు? సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే సమయానికి మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న పరిస్థితులు ఏమిటి? సినిమా రూపొందించడానికి వినీత్ ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? తనకు ఎదురైన ఛాలెంజ్‌లను ఎలా అధిగమించాడు? కష్టాల్లో ఉన్న మలయాళ సినిమాకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడా? అనే ప్రశ్నలకు ఎమోషనల్, కామెడీ తరహా అంశాల సమాధానమే మాలీవుడ్ టైమ్స్ సినిమా కథ.

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను ఇటీవల సెన్సార్ ప్రతినిధులు, అధికారులు వీక్షించారు. ఈ సినిమాలో అభ్యంతరాలు వ్యక్తం చేసే సన్నివేశాలు, డైలాగ్స్ లేకపోవడంతో పెద్దగా చర్చలు, వివరణలు లేకుండానే క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశారు. దాంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.

మాలీవుడ్ టైమ్స్ సినిమా యూనిట్ వెళ్లడించిన ప్రకారం.. ఈ చిత్రానికి యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దాంతో ఈ చిత్రాన్ని 13 ఏళ్లు దాటిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షనలో చూడాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. 2 గంటల 32 నిమిషాల 5 సెకన్లు.. అంటే 152 నిమిషాల 5 సెకన్లుగా ఫిక్స్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ చిత్రంలో నెస్లేన్, సంగీత్ ప్రతాప్, రోషన్ లాంటి యువ హీరోల పెర్ఫార్మెన్స్ మరోసారి ఆకట్టుకొనేలా ఉంది. ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ద్వారా అందర్నీ మెప్పించేలా సినిమాను అందించిన అభినవ్ సుందర్ మరోసారి కొత్త అంశంతో ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ఆడియెన్స్ అభిరుచి తగినట్టు ఉంటే.. మరోసారి మలయాళ చిత్రం హిట్ దారి పట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, బాక్సాఫీస్ కలెక్షన్ల రిపోర్టు గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X