Month Of Madhu Review ఆకట్టుకొన్న నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, శ్రేయా.. మంత్ ఆఫ్ మధు మూవీ రివ్యూ!

Rating:
1.5/5

నటీనటులు: నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, శ్రేయా నవిలే, వైవా హర్ష,రాజా చెంబోలు, రాజా రవీంద్ర, మంజుల ఘట్టమనేని, జ్ఞానేశ్వరి కండ్రేగుల, రుచిత సాదినేని, కంచరపాలెం కిషోర్ తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి
నిర్మాతలు: సుమంత్ దమ, యశ్వంత్ ములుకుట్ల, రఘు వర్మ వేమూరి
మ్యూజిక్: అచు రాజరమణి
సినిమాటోగ్రఫి: రాజీవ్ ధారవత్
ఎడిటింగ్: రవికాంత్ పెరెపు
రిలీజ్ డేట్: 2023-10-06

మధుసూదన్ (నవీన్ చంద్ర), లేఖ (కలర్స్ స్వాతి) ఇద్దరు గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకొంటారు. అయితే అతిగా, మొండిగా వ్యవహరించే మధు పైత్యాన్ని లేఖ భరిస్తుంది. కానీ ఓ దశలో వారిద్దరి విడిపోవాలని నిర్ణయించుకొని విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తారు. ఇదిలా ఉండగా, అమెరికాలో స్థిరపడిన అమ్మాయి మధుమతి (శ్రేయా నవిలే) తన తల్లి (మంజుల ఘట్టమనేని), కుటుంబంతో కలిసి ఓ పెళ్లి కోసం వైజాగ్‌కు వస్తుంది. అయితే తనకు తానుగా ఎలాంటి ఫిల్టర్లు లేకుండా బతకాలనే తీరు వల్ల మధు, ఆమె తల్లికి విబేధాలు తలెత్తుతాయి.

Month Of Madhu Movie Review and Rating: Colours Swati, Naveen Chandras Boring family, love drama

ఇష్టంగా ప్రేమించుకొని తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకొన్న లేఖ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి? మధుసూధన్ ఎందుకు మొండిగా ఉంటాడు? విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన మధు, లేఖ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకొన్నాయి? విడాకుల కోసం ప్రయత్నిస్తూనే మధు మరో యువతి (జ్ఞానేశ్వరి కండ్రేగుల)కు ఎలా దగ్గరవ్వాలని అనుకొన్నారు? అలాగే తన ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగి పెళ్లి ప్రపోజల్‌కు లేఖ ఎలా స్పందించింది? చివరకు లేఖ, మధుమతి జీవితాలకు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే మంత్ ఆఫ్ మధు సినిమా కథ.

మధుసూదన్, లేఖ లవ్ అండ్ లైఫ్ ట్రావెల్ ఓ ట్రాక్‌లో, మధుమతి లైఫ్‌లో జరిగే సంఘటనలతో మరో ట్రాక్ రన్ అవుతుంది. అయితే ఫ్రంట్ బ్యాక్ స్క్రీన్ ప్లేతో మొదట ఆసక్తిగా అనిపించినా.. మధ్యలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. రెండు ట్రాక్‌ల్లోను క్యారెక్టర్లు చాలా బలంగా ఉంటాయి. కానీ కథ నడిచే తీరులో ఆసక్తి కనిపించదు. చాలా పేలవంగా, సాగ దీసి.. సాగ దీసి సహనానికి పరీక్ష పెట్టేలా కథ సాగుతుంది. దాంతో సినిమా నడిచే తీరు నిస్సత్తుగా మారుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వైవా హర్ష ఉండే సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గాను, ఫన్‌గా ఉండటంతో కొంత ఉపశమనం లభిస్తుంది.

దర్శకుడు శ్రీకాంత్ రాసుకొన్న స్టోరి పాయింట్ వైజ్‌గా చూస్తే బాగుంటుంది. కానీ కథను విస్తరించి ఇంట్రెస్టింగ్‌గా చెప్పలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. శ్రీకాంత్ రాసుకొన్న క్యారెక్టర్లు, వాటిని డిజైన్ చేసిన విధానం బాగుండటమే కాకుండా వాటిలో డెప్త్ ఆకట్టుకొంటుంది. నవీన్ చంద్ర క్యారెక్టర్ గానీ, శ్రేయా క్యారెక్టర్లలో ఫిలాసఫీ బాగుంటుంది. కానీ ఓవరాల్‌ కథగా మెప్పించలేకపోయాడనిపిస్తుంది. అక్కడక్కడ శ్రీకాంత్ తీసిన సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా అనిపిస్తాయి.

Month Of Madhu Movie Review and Rating

మధుసూదన్‌గా నవీన్ చంద్ర ఫెర్ఫార్మెన్స్ బాగుంది. తాగుబోతు క్యారెక్టర్‌లో భగ్న ప్రేమికుడిగా తనదైన స్టైల్‌తో మెప్పించాడు. మధుమతిగా శ్రేయ నటనకు కొత్త వారైనా తన పాత్రకు వందకు వందశాతం న్యాయం చేసింది. అయితే తన క్యారెక్టర్‌కు పూర్తి స్థాయిలో జస్టిఫికేషన్, డెస్టినీ లేకపోవడం వల్ల ఏదో అసంతృప్తిగా అనిపిస్తుంది. లేఖగా కలర్స్ స్వాతి తన పాత్ర పరిధి మేరకు పూర్తి న్యాయం చేసింది. జ్ఞానేశ్వరి కండ్రేగుల గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నారు. ఈ సినిమాకు వైవా హర్ష క్యారెక్టర్ ప్లస్ పాయింట్. తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ టైమింగ్‌తో ఫన్ జనరేట్ చేసిన విధానం బాగుంది. మిగితా పాత్రల్లో నటించిన వారు ఒకే అనిపించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్, కెమెరా వర్క్ చాలా బాగుంది. అచు రాజరమణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రాజీవ్ ధారవత్ సినిమాటోగ్రఫి ఆకట్టుకొనేలా ఉంది. వైజాగ్ పరిసర ప్రాంతాలను అద్బుతంగా కెమెరాల బంధించారు. ఎడిటింగ్ విషయానికి వస్తే.. కత్తెరకు పెట్టిన పదును సరిపోలేదు. సినిమాగా కాకుండా వెబ్ సీరీస్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే.. క్లాసికల్ లవ్ స్టోరి అయి ఉండేదనిపిస్తుంది.

Colours Swati Naveen Chandra Month Of Madhu Movie

మంత్ ఆఫ్ మధు సినిమా విషయానికి వస్తే.. నేటితరం నాగరిక పోకడలు, ఫ్యామిలీ వ్యాల్యూస్, మానవ సంబంధాలతో సాగే సినిమా. అయితే పాత్రల పరంగా ఓకే కానీ.. ఓవరాల్‌గా కథ చెప్పడంలో దర్శకుడి తడబాటు కనిపిస్తుంది. ఈ సినిమాకు లెంగ్త్ మైనస్. ఈ మూవీని సినిమాగా కాకుండా వెబ్ సిరీస్‌గా తీసి ఉంటే క్లాసిక్ అయి ఉండేదనిపిస్తుంది. మేకింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్లస్ పాయింట్. నిదానంగా సాగే ప్రేమకథలను, ఎమోషన్స్‌తో కూడిన స్టోరీలను ఇష్టపడే వారికి మంత్ ఆఫ్ మధు నచ్చవచ్చేమో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X