For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోసగాళ్లు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  రేటింగ్: 2.5/5
  నటీనటులు, సాంకేతి నిపుణులు
  విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు
  దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్
  కథ, నిర్మాత: విష్ణు మంచు
  సంగీతం: సామ్ సి ఎస్
  సినిమాటోగ్రఫి: షెల్డన్ చావ్
  బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్
  రిలీజ్: 2021-03-19

  మోసగాళ్లు కథ..

  మోసగాళ్లు కథ..

  అక్కా తమ్ముళైన అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) హైదరాబాద్‌లోని కాల్ సెంటర్‌లో పనిచేస్తుంటారు. ఆర్థిక సమస్యలతో అసంతృప్తిగా జీవితం సాగిస్తున్న వారిద్దరూ ఏదో విధంగా భారీగా డబ్బు సంపాదించి కష్టాలకు దూరంగా ఉండాలని కోరుకొంటారు. ఈ క్రమంలో ఐటీ ఇండస్ట్రీలో ఉండే లోపాలను ఆసరాగా చేసుకొని తమ బాస్ సందీప్ రెడ్డి (నవదీప్)తో కలిసి అమెరికాలో భారీ కుట్రకు తెర తీస్తారు.

  మోసగాళ్లు సినిమాలో ట్విస్టులు

  మోసగాళ్లు సినిమాలో ట్విస్టులు

  అర్జున్, అనుకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వారి కుటుంబం దుర్భరమైన జీవితాన్ని గడిపాల్సిన అవసరం ఏమి వచ్చింది. సందీప్ రెడ్డితో కలిసి చేసిన 300 మిలియన్ డాలర్ల కుంభకోణం అమెరికాలో ఎలాంటి సంచలనానికి దారి తీసింది. ఆ తర్వాత వారికి అమెరికా దర్యాప్తు సంస్థల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. హైదరాబాద్ ఏసీపీ అజిత్ కుమార్ భాటియా (సునీల్ శెట్టి) దర్యాప్తు ఎలా కొనసాగింది? అను, అర్జున్, సందీప్‌‌ ఈ కేసు నుంచి తప్పించుకొన్నారా? ఈ కేసు చివరకు ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే మోసగాళ్లు సినిమా కథ.

  కథ, కథనాలు ఎలా ఉన్నాయంటే

  కథ, కథనాలు ఎలా ఉన్నాయంటే

  మోసగాళ్లు చిత్రం వాస్తవ సంఘటనల నేపథ్యంగా సైబర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌‌తో తెరకెక్కిందనే విషయం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. అలాగే ఇంగ్లీష్‌ భాషలో తెరకెక్కిందనే విషయం మరింత క్యూరియాసిటీని పెంపొందించింది. అయితే మోసగాళ్లు కథ, కథనాలు విషయంలో అనేక లోపాలు కనిపించాయి. హాలీవుడ్ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ కంటే ఎక్కువగా మైనస్ అంశాలే ఎక్కువగా ఉండటం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.

  నటీనటులు పెర్ఫార్మెన్స్ ఎలా అంటే

  నటీనటులు పెర్ఫార్మెన్స్ ఎలా అంటే

  అక్కా, తమ్ముళ్లుగా విష్ణు మంచు, కాజల్ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. తమ ఫెర్ఫార్మెన్స్‌తో కొన్ని సన్నివేశాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ కథ, స్క్రీన్ ప్లేలో పస లేకపోవడం వల్ల వారి శ్రమ వృధా అయింది. నవదీప్ గెటప్, పాత్ర తీరుతెన్నులు కొత్తగా ఉంటాయి. టాలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించేంత పాత్ర సునీల్ శెట్టికి లభించలేదనే చెప్పాలి. క్లైమాక్స్‌లో సునీల్ శెట్టి, మంచు విష్ణు మధ్య యాక్షన్ సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. నవీన్ చంద్ర, వైవా హర్ష పాత్రలు ఒకే అనిపిస్తాయి.

  సాంకేతిక అంశాల గురించి

  సాంకేతిక అంశాల గురించి

  మోసగాళ్లు సినిమాను మంచి సైబర్ క్రైమ్ డ్రామా, థ్రిల్లర్‌గా మలచడంలో దర్శకుడు జెఫ్రీ గీ చిన్ పూర్తిగా విఫలమయ్యారు. కనీసం తెలుగు సినిమా ప్రమాణాలకు తగినట్టుగా కూడా సినిమాను తెరకెక్కించలేకపోయాడు. కథ నడిచే తీరు చాలా గందరగోళంగా, లాజిక్స్ లేకుండానే సాగుతుంది. మంచి పాయింట్‌ను గొప్ప సినిమాగా మార్చే అవకాశాన్ని ఈ సినిమా టీమ్ మిస్ అయింది. సామ్ సి ఎస్ మ్యూజిక్ బాగుంది. షెల్డన్ చావ్ సినిమాటోగ్రఫి ఫర్వాలేదనిపిస్తుంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  హాలీవుడ్ రేంజ్ స్థాయి అనే ప్రమోషన్ కార్యక్రమాలతో కొనసాగడంతో భారీ అంచనాలతో వచ్చిన ప్రేక్షకులకు నిరాశ పంచిన చిత్రంగా మోసగాళ్లు మిగిలింది. సాంకేతికపరంగా కూడా ఆకట్టుకోలేకపోయింది. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే డెఫినెట్‌గా మంచి సినిమాగా మిగిలే అవకాశం ఉండేది. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. బీ,సీ సెంటర్లలోని ప్రేక్షకులకు సినిమా చేరినట్లయితే మంచి విజయాన్ని అందుకొనే అవకాశాలు లేకపోలేవు.

  English summary
  As per Wikipedia, Mosagallu movie is based on a true series of incidents that shook the Indian IT Industry and conned a whopping $380 million (2,800 Crores). Kajal as Anu, Vishnu as Arjun in lead roles. Navdeep and Naveen Chandra are in supporting roles. Produced by Vishnu Mancu, Directoed by Jeffrey Gee Chin.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X