For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మౌనమే ఇష్టం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating: 2.5/5

  ఏ సినిమా పరిశ్రమలోనైనా ప్రేమ కథా చిత్రాలే ఎవర్‌గ్రీన్. సాధారణంగా లవ్, రొమాంటిక్ అంశాలతో తెరకెక్కే సినిమాలకు సెపరేటుగా సీజన్లు, టార్గెట్ ఆడియెన్స్ ఉండరు. అలాంటి సరికొత్త ప్రేమ కథతో వచ్చిన చిత్రం మౌనమే ఇష్టం. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ దర్శకుడిగా మారడంతో ప్రేక్షకులకు, సినీ వర్గాలకు ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడిగా అశోక్‌కు, హీరోగా రామ్ కార్తీక్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.

  మౌనమే ఇష్టం స్టోరి

  వరుణ్ (రామ్ కార్తీక్) యాడ్ ఫిలిం మేకర్. కుటుంబంలో చోటుచేసుకొన్న ఈ సంఘటన కారణంగా చిన్నతనంలో తల్లిని కోల్పోతాడు. తండ్రి మద్యానికి బానిస అవుతాడు. తాత (నాజర్) పెంపకంలోనే పెరగడంతో అతడంటే చెప్పలేనంత ప్రేమ ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఆధునిక భావాలతోపాటు సమాజంపై భాధ్యత ఉన్న యువతి మాయ (పార్వతి అరుణ్) ప్రముఖ కంపెనీలో ఉద్యోగి. మాయ సేవ గుణాన్ని చూసిన వరుణ్ ఆమె ఆకర్షణలో పడిపోతాడు. మాయపై పెరిగిన ఆకర్షణ ప్రేమగా మారుతుంది. కానీ ఆమెకు లవ్ ప్రపోజ్ చేయడానికి ఓ సమస్య ఏర్పడుతుంది. దాంతో ఓ దశలో ఒకరికొకరు దూరమవుతారు.

  మౌనమే ఇష్టం ట్విస్టులు

  వరుణ్, మాయ ఒకరికొకరు ఎందుకు లవ్‌ను ప్రపోజ్ చేసుకోలేకపోయారు? చివరకు వారిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? వరుణ్ కుటుంబంలో ఏర్పడిన విషాదం ఏమిటి? మాయ తన తల్లిని ఎందుకు ద్వేషిస్తుంది? జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న సమయంలో తాత (నాజర్) మరణంతో వరుణ్‌కు ఎదురైన పరిస్థితుల నుంచి అతడు ఎలా గట్టెక్కాడు. గాఢంగా ప్రేమించుకునే ఇద్దరు ప్రేమికులు ప్రపోజ్ చేసుకునే క్రమంలో వారు విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే వారి పరిస్థితి ఏమిటనే కథకు పరిష్కారమే మౌనమే ఇష్టం.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ప్రేమ వలయంలో చిక్కుకున్న వరుణ్ తన కథ చెప్పడంతో మౌనమే ఇష్టం మొదలవుతుంది. మాయ (పార్వతి అరుణ్) స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు, ఆమెను చూసి ప్రేమలో పడటం అనే అంశాలు తొలుత ఆసక్తికరంగా ఉంటాయి. ఆ తర్వాత కథలో బలమైన సన్నివేశాలు, ఫీల్ గుడ్ అంశాలేవీ లేకుండా చాలా నిస్పారంగా కథ సాగుతుంటుంది. కథ గుట్టు విప్పడానికి నానా తంటాలు పడటం, ఆ తర్వాత చిన్న క్లాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఇంటర్వెల్ వేయడం జరుగుతుంది. తొలిభాగంలో తాత, మనవడి మధ్య సన్నివేశాలు, తండ్రి, కొడుకుల మధ్య భావోద్వేగమైన అంశాలు కొంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కథనంలో వేగం మందగించడంతో వాటి ప్రభావం ప్రేక్షకుడి నుంచి దూరమవుతుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌లో డైలామా సరైన దిశగా ఎస్టాబ్లిష్ కాకపోవడం కొంత అసంతృప్తిగా ఉంటుంది. ఇలాంటి ప్రతికూలతల మధ్య సాంకేతిక అంశాల పనితీరు అంటే సినిమాటోగ్రఫి, ఇతర అంశాలు సినిమాకు పాజిటివ్‌గా మారాయి.

  సెకండాఫ్ అనాలిసిస్

  ఇక రెండో భాగంలోనైనా సమస్యను బయటకు చెప్పి కథను వేగంగా ముగిస్తాడా అని ఆశించిన ప్రేక్షకులకు మరోసారి నిరాశే ఎదురవుతుంది. ఇక రెండో భాగంలో కూడా టెక్నికల్ వ్యాల్యూసే సినిమాను నిలబెట్టాయి. కథ అక్కడక్కడే తిరుగుతూ తప్పిపోయిన తల్లి కోసం వెతికే పిల్లాడి పరిస్థితిని తలపిస్తుంది. కథను చివరి రీల్ వరకు సాగదీయడం సినిమాకు ప్రతికూలంగా మారింది. కథకు అదే బలమని భావిస్తే.. బలమైన సన్నివేశాలను రాసుకోవాల్సి ఉండేదనిపిస్తుంది. పేలవమైన కథనం కారణంగా ఓ ఫీల్‌గుడ్ కథ మరుగునపడిందనే భావన కలుగుతుంది.

  దర్శకుడిగా అశోక్ ప్రతిభ

  దర్శకుడిగా అశోక్ కొంత మేరకు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే డెఫినెట్‌గా మరో ఆనంద్ లాంటి చిత్రమయ్యేది. దర్శకుడిగా ప్రతీ సీన్‌ను ఓ పెయింటింగ్‌గా తెరకెక్కించారు. వాటిలో అందులో జీవం లోపించిందని చెప్పాలి. ఇద్దరు ప్రేమికుల కథను లాగి... సాగదీసి చెప్పడం కంటే క్రిస్పీగా మూడు ముక్కల్లో చెప్పి ఉంటే మరింత బాగుండేది. కీలకమైన అంశాలను చివరి అర్ధగంటలో చెప్పిన తీరు బాగుంది. కానీ అప్పటికే ప్రేక్షకుడు సహనం కోల్పోయిన పరిస్థితి. సాంకేతిక అంశాలను సమకూర్చుకొన్న తీరు చాలా చక్కగా ఉంది.

  హీరో, హీరోయిన్ల పెర్ఫార్మెన్స్

  రామ్ కార్తీక్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేకూర్చాడు. బాడీ లాంగ్వేజ్‌ను కొంత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ పార్వతి అరుణ్. తన పాత్రను సమర్ధవంతంగా పోషించి రోల్ పరంగా ఉన్న కొన్ని లోపాలను కనిపించకుండా చేశారనే చెప్పాలి. మంచి ఈజ్‌తో కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించింది. చివర్లో తల్లి, కూతుళ్ల మధ్య, వదినతో జరిగే సీన్లలో పార్వతి నటన ఆకట్టుకునేలా ఉంది.

  మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో నాజర్, సూర్య బాగున్నాయి. తాతగా నాజర్ సినిమాకు ఎమోషనల్ అంశాలను జోడించారు. వరుణ్‌కు తండ్రిగా సూర్య పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయింది. మిగితా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయింది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మౌనమే ఇష్టంగా సినిమాకు ప్రధాన బలం ప్రొడక్షన్ వ్యాల్యూస్. సినిమాటోగ్రఫి, ఇతర సాంకేతిక అంశాలు సినిమాను హరివిల్లుగా మార్చాయి. రంగు, రంగుల సన్నివేశాలు. ప్రతీ సీన్‌లో నటీనటులకు ఒక కొత్తరకం క్యాస్టూమ్‌పై పెట్టిన శ్రద్ధ.. కథపై కూడా పెట్టలేదనిపిస్తుంది. మొత్తానికి సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ఆ రిచ్‌‌నెస్‌లో ఫీల్ గుడ్ ఎలిమింట్స్ ఎక్కడా కనిపించదు. అందమైన లోకేషన్లతోపాటు సన్నివేశాలు కూడా ఉంటే ఫీల్‌గుడ్ సినిమాగా మారేది. కథ, కథనాలపై కసర్తత్తు చేస్తే దర్శకుడు అశోక్ సుదీర్ఘమైన కల కచ్చితంగా నెరవేరేది.

  ఫైనల్‌గా

  ప్రేక్షకులకు కిక్కించే విధంగా రొమాన్స్, ఎమోషనల్, కొత్తదనంతో కూడిన సీన్లు, వేగంతో కూడిన కథనం ప్రేమకథలో ఉండాలి. కానీ మౌనమే ఇష్టంగా చిత్రంలో ఇవేమీ కనిపించవు. ఆర్ట్ ఫిలింకు ఎక్కువ, కమర్షియల్ ఫిలింస్ తక్కువగా కనిపిస్తుంది. ప్రేమకు ప్రపోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనే పాయింట్ చెప్పడానికి రెండు గంటలకుపైగా కథను చాలా నింపాదిగా ప్రేక్షకుడికి చెప్పడం భరించలేనిది. కాకపోతే అందమైన లొకేషన్లు, రంగులతో అద్భుతంగా తీర్చి దిద్దిన ఫ్రేములు ఉపశమనంగా మారాయని చెప్పవచ్చు. క్లాస్ ఆడియెన్స్‌కు నచ్చే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఆదరిస్తే కమర్షియల్‌గా సక్సెస్ లభించడానికి ఆస్కారం ఉంది.

  పాజిటివ్ పాయింట్స్

  సినిమాటోగ్రఫి
  డీఐ, కలర్ ప్యాటర్స్, క్యాస్ట్యూమ్స్
  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  నెగిటివ్ పాయింట్స్
  బలహీనమైన కథ
  పేలవమైన కథనం
  స్లో నేరేషన్ (విపరీతమైన సాగదీత)
  ఎడిటింగ్

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్, రీతూ వర్మ, నాజర్, సూర్య తదితరులు
  నిర్మాత: ఆశ అశోక్‌
  స్కీన్ ప్లే, ద‌ర్శ‌కత్వం: అశోక్ కోరాల‌త్‌.
  క‌థ: సురేష్ గ‌డిప‌ర్తి
  ఎడిట‌ర్: మార్తాండ్ కే వెంక‌టేష్‌
  కెమెరా: జె.డి.రామ్ తుల‌సి
  సంగీతం: వివేక్ మ‌హాదేవ
  ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: రాజీవ్ నాయ‌ర్‌
  బ్యానర్: ఏకే మూవీస్
  రిలీజ్ డేట్: 2019-03-15

  English summary
  Art director Ashok Kumar Koralatha has turned director with Mouname Ishtam movie. Ram Karthik and Parvathi Arun in the leads. Story: Suresh Gadiparthi, Music: Vivek Madhav, Camera: JD Rama Tulasi, Producer: Asha Ashok, Screenplay, Direction: Ashok Kumar Koralatha. This movie released on March 15th.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more