Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
1.5/5

నటీనటులు: రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్, బండి సంజయ్ కుమార్, హర్ష చెముడు తదితరులు
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రఫి: రామ మారుతి ఎం
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
ఆర్ట్: కిరణ్ మామిడి
యాక్షన్: నటరాజ్ మదిగొండ
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
రిలీజ్ డేట్: 2025-12-13

మోగ్లీ అలియాస్ కిట్టూ అలియాస్ మురళీకృష్ణ (రోషన్ కనకాల) అనాథ. పోలీస్‌ ఆఫీసర్ కొడుకైన మోగ్లీ తనకంటూ ఎవరూ లేకపోవడంతో తన స్నేహితుడు ప్రభాస్ బంటి ( వైవా హర్ష)తో కలిసి అడవిలో పెరుగుతాడు. తండ్రి మాదిరిగానే పోలీస్ ఇన్స్‌పెక్టర్ కావాలని కలలు కనే మోగ్లీ తమ ప్రాంతంలో జరిగే షూటింగులకు జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తుంటాడు. సినిమా షూటింగ్‌లో డ్యాన్సర్‌గా వచ్చిన జాస్మిన్ అలియస్ వర్ష (సాక్షి మదోల్కర్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే జాస్మిన్‌ను సినిమా నిర్మాత, అమ్మాయిల పిచ్చి ఉండే పోలీస్ ఆఫీసర్ క్రిస్టఫర్ నోలన్ (బండి సంజయ్ కుమార్) శారీరకంగా వాడుకోవాలని ఉన్మాదంతో ఉంటారు. ఈ క్రమంలో మోగ్లీని తప్పుడు కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి హింసిస్తుంటారు.

Mowgli Movie Review and

మోగ్లీ తల్లిదండ్రులు ఎలా చనిపోయారు? మోగ్లీ పోలీస్ ఆఫీసర్ కావాలని ఎందుకు కోరుకొంటాడు? ప్రభాస్ అభిమాని బంటి, మోగ్లీ ప్రయాణం ఎలా సాగింది? సినిమా షూటింగుకు వచ్చిన జాస్మిన్‌ను ప్రేమించిన తర్వాత మోగ్లీ ఎదురైన పరిస్థితులు ఏంటి? పోలీస్ ఇన్స్‌పెక్టర్ క్రిస్టఫర్ నోలన్‌ అమ్మాయిలను ఎలా వేధించాడు? మోగ్లీని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది? నోలన్‌ను, నిర్మాత చేసే కుట్రలను ఎదురించి మోగ్లీ తన ప్రేమను సఫలం చేసుకొన్నాడా? నోలన్‌ను వ్యతిరేకించిన బంట్లీకి జరిగిన అన్యాయం ఏమిటి? నోలన్‌కు ఖర్మ ఎలా వెంటాడింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

ఫీల్ గుడ్ ప్రేమ కథ, ఎమోషన్స్‌తో కలర్ ఫోటో లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాను అందించిన సందీప్ రాజ్ నుంచి మూవీ అనగానే ఓ రకమైన అటెన్షన్ ఉంటుంది. కానీ మోగ్లీ సినిమా మాత్రం ఏ విధంగాను కనీస అంచనాలను చేరుకోలేకపోయిందనే చెప్పాలి. బలమైన కథ లేకుండా చేసిన ప్రయత్నం టోటల్‌గా నిరాశపరిచింది. పేలవమైన స్క్రీన్ ప్లే కారణంగా ప్రతీ సీన్ సహనానికి పరీక్ష పెట్టేలా చేసింది. ఫస్టాఫ్‌లో చాలా సీన్లు, కామెడీ సన్నివేశాలు నాసిరకంగా ఉండటంతో స్టోరీలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. పాత్ర డిజైన్ కూడా పొంతన లేకుండా ఉంటుంది. టార్గెట్ లేకుండా క్యారెక్టర్స్ డ్రైవ్ అవుతుంటాయి. కొన్ని పాత్రలు నీరసంగా ఉంటే.. మరికొన్ని పాత్రలు అతిగా బిహేవ్ చేస్తుంటాయి. దాంతో కథలో ఉండే బ్యాలెన్స్, పూర్తిగా పట్టు తప్పింది. సందీప్ రాజ్‌ ఈ సినిమా విషయంలో ఎలాంటి ప్రభావం చూపలేక పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి.

హీరోగా రెండో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొన్న రోషన్‌ విషయానికి వస్తే.. మొదటి సినిమాలోనే కొంత మేరకు ఓకే అనిపించాడాడు. మోగ్లీగా మాత్రం సరైన పాత్ర లభించలేదు. క్యారెక్టర్ డిజైన్ సరిగా లేకపోవడంతో అతడి పెర్ఫార్మెన్స్ సైడ్ ట్రాక్‌లోనే సాగింది. మోగ్లీగా రోషన్ సపోర్టింగ్ క్యారెక్టర్‌గానే మారింది. ఈ సినిమా వల్ల రోషన్‌కు ఏ విధంగా ప్లస్ అయ్యే ఛాన్సే కనిపించదు. మోగ్లీ పాత్రలో బలం లేకపోవడంతో సినిమా భారమంతా వైవా హర్షానే మోశాడు. వైవా హర్ష పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలెట్. అలాగే ఈ మూవీలో బలంగా కనిపించిన పాత్ర బండి సంజయ్ కుమార్ పోషించిన క్రిస్టఫర్ నోలన్ పాత్ర. మొదట్లో నోలన్ పాత్ర క్రేజీగా అనిపించినప్పటికీ.. పోను పోను శృతి మించడంతో అది కూడా ఓవరాక్షన్‌గా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ జాస్మిన్ మూగ, చెవుడు అని రోల్‌ను డిజైన్ చేయడం అర్ధం పర్థం ఉండదు. అన్ని పాత్రలు కంగాలీగానే కనిపిస్తాయి.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కథలో కొత్తదనం, నావెల్టీలో ఎక్కడా కనిపించకపోవడంతో టెక్నిషియన్స్‌ కూడా ఈ సినిమాను నిలబెట్టడానికి చాలానే శ్రమించారు. కొన్ని సీన్లలో కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. పాటలు ఈ సినిమాకు టోటల్‌గా మైనస్. రామ మారుతి సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సన్నివేశాలను బాగా చిత్రీకరించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రమాణాలకు సరిపోయేలా ఉన్నాయి. కానీ సినిమా కంటెంట్ విషయంలో పూర్తిగా జాగ్రత్త పడాల్సింది.

మోగ్లీ సినిమా విషయానికి వస్తే.. ఏ మాత్రం కొత్తదనం లేని రొటీన్, రెగ్యులర్ లవ్ అండ్ యాక్షన్ స్టోరి. అతితో సాగే పాత్రలు, పొంతనలేని కథనం. హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎలిమింట్స్‌‌ను బలవంతంగా రుద్దడం ఆర్టిషిషియల్‌గా ఉంటాయి. బలమైన కథ లేకుండా రాముడు, సీత, హనుమాన్ పాత్రలను కమర్షియల్ అంశాలకు వాడుకోవడం ఈ మద్య సినిమాల్లో ఫ్యాషన్ అయిపోయింది. సందీప్ రాజ్ చేసిన అసహజమైన కథనం, క్లైమాక్స్ ఈ సినిమాను పూర్తిగా నీరుగార్చేలా చేశాయి. కలర్ ఫోటో తీసిన దర్శకుడిగా ఆయన ఈ సినిమా ద్వారా పెద్దగా సంపాదించే క్రెడిట్ ఏమీ ఉండకపోవచ్చు. థియేట్రికల్ వాల్యూ లేని ఈ సినిమాను చూడాలనుకొంటే ఓటీటీ వరకు ఆగడం మంచిది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X