Mowgli Twitter Review: మోగ్లీ ట్విట్టర్ రివ్యూ
స్టార్ యాంకర్ సుమ, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ మూవీ మోగ్లీ. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్‌లు సంయుక్తంగా మోగ్లీ సినిమాను నిర్మించారు. బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు తదితరులు కీలకపాత్రలు పోషించారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహించగా.. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా పనిచేశారు. రామా మారుతి సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు.
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో మోగ్లీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం అదే రోజు రావడంతో మోగ్లీ ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13న విడుదల అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్లు డిసెంబర్ 12వ తేదీన పలు ప్రాంతాల్లో ప్రదర్శితమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

చాలా బాగుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త లవ్ స్టోరీ. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. హీరో రోషన్ గారు, కొత్త అమ్మాయి అలాగే బండి సరోజ్ గారు చాలా బాగా చేశారు. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. మంచి డివోషనల్ టచ్ ఉంది. తప్పకుండా యూత్, ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి సినిమా చూసి పెద్ద సక్సెస్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఎమోషనల్ ఫిల్మ్.. కాలభైరవ హైలైట్ .. ఫిల్మ్ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ అయ్యేలాగా కూర్చోబెట్టారు. సూపర్బ్ బీజీఎం. అందరికీ కూడా బిగ్ కంగ్రాట్స్. చాలామంచి సినిమా తీశారు. అందరూ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. యూత్ చాలా బాగా కనెక్ట్ అవుతారు అని హీరో శ్రీవిష్ణు.. ఈ మోగ్లీ సినిమాపై రివ్యూ ఇచ్చారు.
మోగ్లీ ఫస్టాఫ్ స్ట్రాంగ్‌గా, ఎంగేజింగ్‌గా ముగిసింది. లవ్ ట్రాక్ సూపర్ ఫీల్ గుడ్, కామెడీ ట్రాక్ ఫన్‌గా ఉంది. నోలన్ ఇంట్రోతో థియేటర్‌లో వైబ్ అయిపోయింది. హీరోని కొంచెం ఓవర్‌గా కష్టపెట్టారు. కాలభైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్లీన్‌గా ఉంది. సెకండాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్ చాలా బాగుంది. ప్రధానంగా రోషన్, హీరోయిన్ సీన్స్ సూపర్ ఉన్నాయ్ అని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ పెట్టారు.
ఫస్టాఫ్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. సినిమా చాలా బాగుంది. రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫైర్. పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. సినిమా టోటల్‌గా వర్త్. రోషన్ యాక్టింగ్ పీక్స్ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
మోగ్లీ ఫస్టాఫ్‌తో సాలీడ్ వైబ్ ఇచ్చింది. లవ్ ట్రాక్ క్యూట్‌గా, ఎంగేజింగ్‌గా ఉంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ సూపర్. సాంగ్స్ అదిరిపోయాయి, కామోడీ కూడా క్లీన్ గా వర్క్ అయ్యింది. రోషన్ పర్ఫార్మెన్స్‌ని ఫస్టాఫ్ మొత్తం అలాగే కంటిన్యూ చేశాడు. ఓవరాల్‌గా మొదటి అర్ధభాగం స్మూత్‌గా, స్వీట్‌గా ముగిసింది.
మోగ్లీ యూనిట్ మంచి ఎఫర్ట్ పెట్టింది. ప్రేమ, యాక్షన్ కలగలిపిన ఈ సినిమాలో చాలా సన్నివేశాలు బాగా కనెక్ట్ అయ్యాయి. అన్ని ప్రధాన పాత్రల నటన చాలా బాగుంది. విలన్ పాత్ర కూడా చాలా చక్కగా రాశారు. చివరిగా ఈ చిత్రం ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనుభవాన్ని అందించి, మిమ్మల్ని నేరుగా తాకుతుంది. చూడదగ్గ యాక్షన్ డ్రామా అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.
సెకండాఫ్ పూర్తయ్యింది. సూపర్ మూవీ.. క్లైమాక్స్ బాగుంది. లవ్ స్టోరీ సూపర్‌గా ఉంది. హార్ష అన్న కామెడీ టైమింగ్ అదుర్స్. బండి సరోజ్ కుమార్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని ఓ ట్విట్టర్ యూజర్ తెలిపారు.
మోగ్లీ రోలింగ్ బ్లాక్‌బస్టర్. రోషన్ పర్ఫార్మెన్స్ టాప్‌లో ఉంది. సాక్షి స్టన్నింగ్‌గా ఉంది. లవ్ ట్రాక్, సాంగ్స్ బాగున్నాయి.. సో స్వీట్. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఖచ్చితంగా మీకు షాకిస్తుంది. హర్ష కామెడీతో పర్ఫెక్ట్ కాంబో అని ఒక అభిమాని రివ్యూ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











