Mr Bachchan X Review: మిస్టర్ బచ్చన్ ట్విట్టర్ రివ్యూ.. రవితేజకు హిట్టా? ఫట్టా?
మాస్ మహారాజ్ రవితేజ, సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. హిందీలో ఘన విజయం సాధించిన రైడ్ సినిమా ఆధారంగా రీమేక్ చేసిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
ఆగస్టు 15వ తేదీ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఈ సినిమాపై నెటిజన్ల అభిప్రాయం ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

మిస్టర్ బచ్చన్ సినిమా చూశాను అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు. హరీష్ శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏం మూవీ తీశావు.. అంటూ కామెంట్ చేశఆరు. ఎందుకు ఇలా ల్యాగ్ సీన్లు పెట్టావు అంటూ దారుణంగా కామెంట్ చేశాడు.
మిస్టర్ బచ్చన్ చూసిన ఓ ప్రేక్షకుడు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అన్నా.. అసలు నీవు తీసింది రీమేకేనా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మిస్టర్ బచ్చన్ సినిమా చూడలేకపోతున్నాను. ఆపేయండ్రిరా ఈ మూవీ. ఈ మధ్యకాలంలో ఇంత రోత సినిమా చూస్తాను అనుకోలేదు. హరీష్ శంకర్ టోటల్ పూర్తిగా డిజాపాయింట్ చేశాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా రవితేజ క్యారెక్టర్ బాగుంది. స్క్రీన్ ప్రజెన్స్‌తో బాగా వర్కువుట్ అయింది. హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే ప్రెజెన్స్, సత్య కామెడీ సినిమాను ముందుకు నడిపించింది. ఓవరాల్‌గా ఓ సారి చూడొచ్చు అంటూ కామెంట్ చేశారు.
మిస్టర్ బచ్చన్ సినిమా చూశాను. సిద్దూ జొన్నలగడ్డ మాస్ ఎంట్రీ అదిరిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మిస్టర్ బచ్చన్ ఫస్టాఫ్ వినోదాత్మకంగా బాగుంది. హరీష్ శంకర్ డైరెక్టర్ చాలా బాగుంది. రవితేజ యాక్టింగ్ బాగుంది. యంగ్ లుక్‌తో అదరగొట్టాడు. భాగ్యశ్రీ భోర్సే తన అందంతో అమేజింగ్‌గా బాగుంది. సెకండాఫ్ బాగుంటుందని భావిస్తున్నాను అని నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications











