Mr King Movie Review లవ్, కెరీర్ మధ్య నలిగిన మిస్టర్ కింగ్

Rating: 2/5

నటీనటులు: శరన్ కుమార్, యస్వికా నిష్కల, ఉర్వీ సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు
ఎడిటింగ్, దర్శకత్వం: శశిధర్ చావలి
నిర్మాత: బీఎన్ రావు
మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ
సినిమాటోగ్రఫి: తన్వీర్ అంజుమ్
రిలీజ్ డేట్: 24-02-2023

విలువలు, నిజాయితీ, నిస్వార్ధంతో ఉండే శివ (శరన్ కుమార్) ఎయిరోనాటికల్ ఇంజీనీరింగ్ స్టూడెంట్ మాత్రేమే కాకుండా రేడియో జాకీగా కూడా పనిచేస్తుంటాడు. ఆకాశంలో విమానం విహరించే సమయంలో వాయు ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి దానికి ఇంధనంగా మార్చే పరిశోధనను చేస్తుంటాడు. అయితే పక్కింటి సీతారామారాజు (మురళీశర్మ) కూతురు ఉమాదేవి (యస్వికా నిష్కల)తో ప్రేమలో పడుతాడు. కానీ జిత్తులమారి సీతారామారాజు తన అన్న కూతురు వెన్నెల (ఉర్వీ సింగ్)తో నిశ్చితార్థం చేయిస్తాడు.

 Mr King Movie Review and Rating: Shashidhar Chavalis Slow pace Love story

ఎయిరోనాటికల్ ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచే ప్రాజెక్టును చేపట్టిన శివకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? శివ ప్రాజెక్టు కోసం గైడ్ హుస్సేన్ (తనికెళ్ల భరణి) ఎలాంటి సహకారం అందించాడు. ఉమాదేవీ, శివ ప్రేమను సీతారామారాజు ఎందుకు అడ్డుకొన్నాడు? వెన్నెలతో నిశ్చితార్థం తర్వాత శివ జీవితంలో ఏం జరిగింది? ఎయిరో నాటికల్ ప్రాజెక్టును శివ పూర్తి చేశాడా? ఉమాదేవిని చివరకు పెళ్లి చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ కింగ్ సినిమా కథ.

చెస్ ఆట, కూతురు అంటే కొండంత ప్రేమ ఉన్న సీతారామారాజు మురళీశర్మ క్యారెక్టర్‌‌ను పరిచయం చేయడం ద్వారా ఆసక్తికరంగా కథ మొదలవుతుంది. కథలోని ఎమోషన్స్, పాత్రల మధ్య సంఘర్షణ అంతా బాగానే ఉంది. అయితే చాలా రకాల అంశాలను కథలోకి తీసుకు రావడం వల్ల కథ ఏ అంశంపై వెళ్తుందనే విషయంపై కన్‌ఫ్యూజన్ మొదలవుతుంది. హీరో ప్రేమ, రిసెర్చ్ ప్రాజెక్టు, ఫ్యామిలీ అంశాలు ఒక్కతాటి మీదకు తెచ్చి ప్రేక్షకుడికి చక్కగా చెప్పడంలో దర్శకుడు తడబాటుకు గురయ్యాడు. దాంతో కథలో కన్‌ఫ్యూజన్ పెరగడం, దానికి తోడు నిడివి కూడా పెరిగిపోయింది. దాంతో సినిమా సాగదీసినట్టు అనిపిస్తుంది.

 Mr King Movie Review and Rating: Shashidhar Chavalis Slow pace Love story

ఇక శరన్ కుమార్ విషయానికి వస్తే.. తొలి సినిమాలోనే తనకు మంచిన భారమైన పాత్రను పోషించారనే చెప్పాలి. నటనపరంగా, పాత్ర పరంగా ఎమోషన్స్ పలికించే విషయంలో ఇంకా చాలా నేర్చుకోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. డైలాగ్స్ బాగానే చెప్పాడు కానీ.. దానికి బాడీ లాంగ్వేజ్‌ సింక్ కాలేదనిపిస్తుంది. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు సినిమా భారాన్ని మోసేందుకు చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. ఇక యస్విక నిష్కల, ఉర్వీ సింగ్ గ్లామర్‌గా కనిపించడమే కాకుండా యాక్టింగ్ పరంగా మెప్పించే ప్రయత్నం చేశారు. మురళీ శర్మ, తనికెళ్ల భరణి మరోసారి భారమైన పాత్రల్లో కనిపించారు. మిగితా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

మిస్టర్ కింగ్ సినిమాలో సాంకేతిక విభాగాల పనితీరు వస్తే.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. పాటలు అంతగా మెప్పించలేకపోయాయి. తన్వీర్ అంజుమ్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. దర్శకుడే ఎడిటర్ కావడం వల్ల తాను తీసిన సన్నివేశాలపై మమకారం ఎక్కువ అవ్వడంతో వాటిపై కత్తెర వేయడానికి ఆలోచించారా అనిపిస్తుంది. కొన్ని చోట్ల దర్శకుడు శశిధర్ చావలి మంచి డైలాగ్స్ అందించారు.

 Mr King Movie Review and Rating: Shashidhar Chavalis Slow pace Love story

లవ్, కెరీర్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి ఉన్న చిత్రం మిస్టర్ కింగ్. అయితే రకరకాల విషయాలను ట్రాక్‌పైకి తీసుకు రావడంలో దర్శకుడి తడబాటు, అనుభవ రాహిత్యం కనిపిస్తుంది. కొత్తవారైనా నటీనటులు చాలా బాగా చేశారు. కథలో బలం లేకపోవడం, కథనం బలహీనంగా ఉండటం ఈ సినిమాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇంకా కథ అవసరాన్ని పరిశీలిస్తే.. సినిమా నిడివి కూడా ఎక్కువ అనిపిస్తుంది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. నిజాయితీగా కథను చెప్పేందుకు నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రయత్నించడం ఈ సినిమాకు సానుకూలతగా మారిందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X