twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మిస్టర్ మన్మథ’ రివ్యూ...

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    వినాయకుడు' సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన కృష్ణుడు, సోనియా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సాయికిరణ్ అడవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మిస్టర్ మన్మథ' చిత్రం విడుదలైంది. సత్యం బెల్లంకొండ దర్శకత్వం వహించిన ఈచిత్రం విశేషాలేమిటో చూద్దాం.

    మిస్టర్ మన్మధ చిత్రాన్ని కమర్షియల్ అంశాలతో కూడిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందించారు. సినిమాకు కృష్ణుడు-సోనియా పెర్ఫార్మెన్సే మెయిన్ అట్రాక్షన్. నవదీత్ చారి మ్యూజిక్, ఆరిఫ్ లలానీ కెమెరా వర్క్, సత్యం బెల్లంకొండ ఇంట్రెస్టింగ్ నేరేషన్, బాషా శ్రీ డైలాగ్స్, రామచందర్ సింగ్ ఆర్ట్ ఈ చిత్రానికి ఉన్న ఇతర ప్లస్ పాయింట్స్.

    ఈ మధ్య తెలుగులో పలు యూత్ ఫుల్ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనిదే ఈ మిస్టర్ మన్మధ. కానీ ఈ చిత్రాన్ని ఇతర సినిమాలకు భిన్నంగా తెరకెక్కించారు. సినిమా మూడు జంటల చుట్టూ తిరుగుతుంది. ఇంటర్నెట్ ప్రేమాయణం కూడా జోప్పించారు. ఈతరం యువతీయువకుల ఆలోచనలను ప్రతిభింబించేలా ఈ సినిమా ఉంటుంది.

    హీరో తనకు గర్ల్ ఫ్రెండ్ తెలుగు కల్చర్ పట్ల ప్రేమ, అభిమానం కలిగి ఉండాలని కోరుకుంటాడు. తనకు కాబోయే డారికి సిక్స్ ప్యాక్ లేక పోయినా మంచి సాలరీ, కారు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ధనవంతుడై ఉండాలని కోరుకుంటుంది. ఇలాంటి మనస్తత్వం గల ఇద్దరు వ్యక్తులు తమకు తగిన వారిని ఎలా దక్కించుకున్నారు అనేదాన్ని ఎంటర్ టైన్మెంట్ జోడించి చెప్పారు.

    ‘మిస్టర్ మన్మథ’ రివ్యూ...

    సత్యం బెల్లంకొండ దర్శకత్వం తో పాటు స్ర్కీన్ ప్లే బాధ్యతలు కూడా చేపట్టారు. సబ్జెక్ట్ సింపుల్‌గా, ఓల్డ్ గా ఉంది. అయితే కథను నడిపించిన తీరు, నేరేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

    ‘మిస్టర్ మన్మథ’ రివ్యూ...

    కృష్ణుడు తన పాత్రకు తగిన విధంగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కామెడీ తో పాటు రొమాంటిక్, సెంటిమెంటల్ సీన్లను బాగా పండించారు.

    ‘మిస్టర్ మన్మథ’ రివ్యూ...

    సోనియా దీప్తికి బాగా సూటయ్యే పాత్ర చేసింది. డైలాగ్ డెలివరీ, స్ట్రైట్ ఫార్వడ్ నేచర్ తో ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది.

    ‘మిస్టర్ మన్మథ’ రివ్యూ...

    దీపిక దాస్ పాత్ర నిడివి తక్కువే అయినా... ఉన్నంతలో బాగా నటించింది.

    ‘మిస్టర్ మన్మథ’ రివ్యూ...

    అమిత్, రాజశ్రీధర్, కొండ వలస, కాదంబరి కిరణ్, విజయ్, అల్లరి సుభాషిణి తమ తమ పాత్రల మేరకు రాణించారు.

    ‘మిస్టర్ మన్మథ’ రివ్యూ...

    టెక్నికల్ అంశాల విషయంలో నవనీత్ చారి మ్యూజిక్ మెయిన్ హైలెట్. ట్రెండీగా, మెలోడిగా బాగా కంపోజ్ చేసారు. బ్యాగ్రౌండ్ స్కోరు కూడా బాగుంది.

    ‘మిస్టర్ మన్మథ’ రివ్యూ...

    ఆరిఫ్ లలానీ సినిమాటోగ్రఫీ సెకండ్ హైలెట్. సాంగ్ సీక్వెన్స్ లో పిక్చరైజేషన్ బాగుంది.

    ‘మిస్టర్ మన్మథ’ రివ్యూ...

    బాషా శ్రీ ట్రెండీ లిరిక్స్ ఫన్నీ డైలాగ్స్, రామచందర్ సింగ్ ఆర్ట్ డైరెక్షన్ సినిమాకు బాగా ప్లస్సయ్యాయి. నాగిరెడ్డి ఎడిటింగ్ ఫర్వాలేదు.

    ‘మిస్టర్ మన్మథ’ రివ్యూ...

    ఓవరాల్‌గా.... వినాయకుడు లాంటి కృష్ణుడు, సోనియా నటించిన సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

    ‘మిస్టర్ మన్మథ’ రివ్యూ...

    సంస్థ: హరిత ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నటీనటులు: కృష్ణుడు, సోనియా, కొండవలస, శివన్నారాయణ, అల్లరి సుభాషిణి, మెల్కొటే, వేణు, జీవా, అమిత్‌, దీపికాదాస్‌, రాజా శ్రీధర్‌, నండూరి రాము తదితరులు కెమెరా: ఆరిఫ్ లలానీ, సంగీతం: నవనీత్ చారి, కథ: బెల్లంకొండ సత్యం, ఎస్.ఎ.కె.భాషాశ్రీ, ఎడిటింగ్: నాగిరెడ్డి, మాటలు-పాటలు: బాషా శ్రీ, కళ: రామ్ చందర్ సింగ్, సహ నిర్మాతలు: బాలాజీ శ్రీను, కొర్రపాటి వెంకటరమణ, నిర్మాతలు: మల్లెల సీతారామరాజు, గుండ్లకుంట శ్రీరాములు కథనం, దర్శకత్వం: సత్యం బెల్లంకొండ.

    English summary
    Telugu actor Krishnudu and actress Sonia Deepti hogged the limelight with director Sai Kiran Adivi movie Vinayakudu. Their on-screen chemistry was one of the main highlight and impressed the film goers. Taking a cue from director Satyam Bellamkonda has roped this successful combo for his latest directorial venture Mr Manmadha, which has an interesting subject with a hilarious comedy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X