Mr X Movie Censor Review: మిస్టర్ ఎక్స్ మూవీ సెన్సార్ రివ్యూ

తమిళ హీరోలు ఆర్య, గౌతమ్ రామ్ ఆర్యన్ నటించిన యాక్షన్, థ్రిల్లర్ మూవీ మిస్టర్ X (Mr. X). ఈ చిత్రంలో శరత్ కుమార్, మంజు వారియర్, అనఘా, రైజా విల్సన్, అతుల్య, జయప్రకాశ్, కాళి వెంకట్ తదితరులు నటించారు. ఈ సినిమాకు మను ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వినీత్ జైన్, ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఏ వెంకటేష్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఇండియన్ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు దిబు నినన్ థామస్ మ్యూజిక్ అందించగా.. రాకేందు మౌళి వెన్నెలకంటి సాహిత్యం అందించారు. అరుళ్ విన్సెంట్ సినిమాటోగ్రఫిని, ఎడిటర్‌గా ప్రసన్న జీకే, యాక్షన్ కొరియోగ్రఫిని స్టంట్ శివ, ఆర్ట్ విభాగాన్ని ఇందులాల్ కావిద్, శేఖర్ బీ పర్యవేక్షించారు. ఈ చిత్రం ఏప్రిల్ 17వ తేదీన తమిళ, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రంపై వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? ఈ మూవీ రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Mr X Movie Censor Review

మిస్టర్ ఎక్స్ సినిమా కథ విషయానికి వస్తే.. విస్పోటనానికి సిద్దంగా ఉన్న న్యూక్లియర్ డివైస్‌ను కనిపెట్టడానికి ఇండియన్ స్పై ఏజెంట్స్ రష్యాలో ఓ ఆపరేషన్‌ ప్రారంభిస్తారు. రష్యాలో మిషన్ ఫెయిల్ కావడం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఈ క్రమంలో ఇండియన్ స్పై ఏజెంట్స్‌ను దేశద్రోహులుగా ముద్ర వేయాలని ప్లాన్ చేస్తారు. అయితే మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసిన ఆ న్యూక్లియర్ ఆయుధాన్ని విచ్చిన్నం చేశారా? ప్రపంచ యుద్దం జరగకుండా ఇండియన్ టీమ్ ఆపరేషన్ సక్సెస్ చేసిందా? అనేది ఈ సినిమా కథ.

జాతీయభావం, భారత ఆర్మీ నేపథ్యంగా అల్లుకొన్న కథతో రూపొందిన ఈ సినిమాపై సెన్సార్ అధికారులు పెద్దగా అభ్యంతరాలు చెప్పకుండా రివ్యూ ముగించారు. కాకపోతే సన్నివేశాల్లోను, డైలాగ్స్‌లోను కొన్ని మార్పులు, చేర్పులు సూచించగా.. అందుకు చిత్ర యూనిట్ సానుకూలంగా స్పందించడంతో కంటెంట్‌పై ఎలాంటి వాదనలు, విభేదాలు లేకుండా సెన్సార్ సర్టిఫికెట్‌కు క్లియరెన్స్ లభించింది.

మిస్టర్ ఎక్స్ సినిమాలో ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకపోవడంతో క్లీన్ సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూఏ (UA13+) సర్టిఫికెట్ అందించారు. దాంతో ఈ చిత్రాన్ని 13 ఏళ్లకుపైబడిన వారందరూ ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల సమక్షంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు.

యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో కథ డిమాండ్ మేరకు ఎక్కువ నిడివి లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమా కథను సాగదీత లేకుండా సూటిగా, సుత్తి లేకండా చెప్పాలనే ప్రయత్నం చేశామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీని సుమారుగా 2 గంటల 33 నిమిషాల నిడివితో అంటే.. 153 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆర్య, గౌతమ్ కార్తీక్, మంజు వారియర్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పాజిటివ్‌గా ఉంటుంది. దేశభక్తి ప్రధానం సాగే సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకోగలిగితే హిట్ అయ్యే అవకాశం ఉంది అని ఫీడ్ బ్యాక్ సెన్సార్ రిపోర్ట్ తర్వాత వెల్లడైంది. ఈ సినిమా గురించిన అప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Read more about: arya manju warrier sarath kumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X