Mrithyunjay First Review: మృత్యంజయ్ మూవీ ఫస్ట్ రివ్యూ

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు, బ్యూటీఫుల్ హీరోయిన్ రెబ్బా మోనికా జాన్ జంటగా నటించిన చిత్రం మృత్యంజయ్. చైల్డ్ సెంటిమెంట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిచారు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో బేబి ఉల్హా, సుదర్శన్, రచ్చ రవి, అయ్పప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నందగోపాల్, మిర్చి మాధవి తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్: కాలభైరవ, సినిమాటోగ్రఫి: విద్యాసాగర్ చింతా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: మనీష్ దత్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా మార్చి 6వ తేదీన గ్రాండ్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. ఈ సినిమా గురించి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు ఇచ్చిన సర్టిఫికెట్ ఏమిటి? వారు ఈ సినిమాపై వెల్లడించిన అభిప్రాయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

Mrithyunjay Review By Censor Board

విక్రాంత్ అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో తన కూతురు అనాథగా మారుతుంది. ఆ చిన్నారి మౌనం వెనుక భావోద్వైగమైన కారణాలు ఉంటాయి. అయితే తన స్నేహితుడి మరణం వెనుక కారణాలను అన్వేషించడానికి క్రైమ్ బ్యూరోలో ఉద్యోగం కోసం జయ్ (శ్రీవిష్ణు) ట్రై చేస్తే అధికారులు రిజెక్ట్ చేస్తారు. అయితే తన స్నేహితుడి మర్డర్ మిస్టరీని జయ్ ఎలా సాల్వ్ చేశాడు. ఈ ప్రాసెస్‌లో రకరకాల గెటప్స్ ఎందుకు వేశాడనేది ఈ సినిమా కథ.

శ్రీ విష్ణు కెరీర్‌లో డిఫరెంట్‌గా తెరకెక్కిన మూవీని సెన్సార్ అధికారులు వీక్షించి కొన్ని సలహాలు, సూచనలు అందించారు. వాటిని చిత్ర యూనిట్ స్వీకరించి స్వల్ప మార్పులు చేసి తిరిగి సబ్మిట్ చేశారు. ఈ సినిమా అవుట్‌పుట్‌పై సెన్సార్ పూర్తిగా సంతృప్తి చెందారు. చైల్డ్ సెంటిమెంట్, కథలో ట్విస్టు సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశముంది. యాక్షన్‌తోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే కథను డైరెక్టర్ బాగా డీల్ చేశాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.

మృత్యంజయ్ సినిమా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీకి యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఆ సర్టిఫికెట్ ప్రకారం 16 ఏళ్లకుపైబడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న ఆడియెన్స్ తమ తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ నిబంధనలు వెల్లడించారు.

ఈ చిత్రాన్ని కథను, సన్నివేశాలను సాగదీయకుండా దర్శకుడు, చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకొన్నారనే విషయం ఈ సినిమా నిడివితో స్పష్టమైంది. ఈ సినిమా నిడివి సుమారుగా 2 గంటల 2 నిమిషాలు. అంటే సుమారుగా 122 నిమిషాల రన్‌టైమ్‌ను ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఇంతకుముందే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్‌ను ముందుకు జరిపారు. ఇక ఈ సినిమా గురించిన ఎక్స్‌క్జూజివ్ వార్తల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X