యావరేజ్‌ మృగరాజు

By Staff

Mruga raju
చిత్రం: మృగరాజు
నటీనటులు: చిరంజీవి, సిమ్రాన్‌, సంఘవి,
నాగేంద్రబాబు, ప్రకాష్‌ రాజ్‌
సంగీతం: మణిశర్మ
నిర్మాత: దేవీవరప్రసాద్‌
దర్శకత్వం: గుణశేఖర్‌

ఏడాది తర్వాత వచ్చిన ఈ భారీ చిత్రం అందర్నీ నిరాశపర్చింది. హాలీవుడ్‌ చిత్రం ది గోస్ట్‌ ఇన్‌ ది డార్క్‌ నెస్‌ చిత్రం ఆధారంగా రూపొందించనప్పటికీ కథనంలో ఎక్కడా పట్టు లేకపోవడంతో బోర్‌ ఫీలవ్వడం మినహా క్లాప్స్‌ కొట్టే సీన్‌ లేదు. దక్షిణాఫ్రికా అడవుల్లో సింహంతో చిరు చేసే ఫైట్స్‌, గ్రాఫిక్స్‌ చూసి తరించాలనుకునే చిరంజీవి వీరాభిమానులకు తప్ప ఎవరికీ నచ్చిన చిత్రం ఇది. సినిమా విడుదలకు ముందు జరిగిన ఆర్భాటం, ప్రచారం చూసి వచ్చిన వాళ్ళు నిరాశపడక తప్పదు. ఇంగ్లీస్‌ చిత్రం కథకు తెలుగు మసాలా జోడించి తీసిన ఈ మృగరాజు బిలో యావరేజ్‌ చిత్రం.

దట్టమైన అడవుల్లో ఓ రైలు బ్రడ్జి నిర్మాణం చేస్తున్న వారిపై ఓ సింహం దాడి చేస్తుంటుంది. అక్కడ పనిచేస్తున్న సైట్‌ ఇంజనీర్‌ ను కూడా ఈ సింహం చంపడంతో మరో సైట్‌ ఇంజనీర్‌ సిమ్రాన్‌ వస్తుంది. వీరికి సాయం చేసేందుకు రాజు(చిరంజీవి) వస్తాడు. గిరిజనుడైన చిరంజీవి మంచి వేటగాడు. జంగిల్‌ గైడ్‌ కూడా. వీరిద్దరిని చంపేందుకు ఓ అటవీశాఖాధికారి ప్రయత్నిస్తాడు. అప్పుడు చిరంజీవి, సిమ్రాన్‌ ఇద్దరూ భార్యభర్తలు అని తెలుస్తుంది. దీనికో చిన్న ప్లాష్‌ బ్యాక్‌. సిమ్రాన్‌ తండ్రిని కాదని చిరంజీవిని పెళ్ళి చేసుకుంటుంది. కానీ ఆమె తండ్రి సృష్టించిన కలతల వల్ల వీరిద్దరూ డైవర్స్‌ తీసుకుంటారు. ప్లాష్‌ బ్యాక్‌ పూర్తికాగానే మరో సింహం ఉందని తెలుస్తుంది. ఈ సింహన్ని మృగరాజు ఎలా చంపుతాడు, సిమ్రాన్‌ ను, తన కూతురును ఎలా రక్షిస్తాడు అనేది క్లైమాక్స్‌.

ఇలాంటి చిత్రాన్ని చిరంజీవి ఎలా అంగీకరించాడు అర్థం కాదు. స్క్రీన్‌ ప్లే దారుణంగా ఉంది. ఇక డైరక్షన్‌ గురించి చెప్పడం వేస్ట్‌. బహుశా గుణశేఖర్‌ కట్‌...యాక్షన్‌..స్టార్ట్‌..అని మాత్రమే చెప్పాడేమో! చిరంజీవితో పాటు పెద్ద నటీనటులందరి నటన యావరేజ్‌. ఎవరు గొప్పగా చేసింది లేదు. ఛాయ్‌ పాట స్క్రీన్‌ మీద చూడగలిగే రీతిలో ఉన్న మిగతా పాటలేవీ శ్రావ్యంగా లేవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X