Ms Shetty Mr Polishetty first Review మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిపై చిరంజీవి సమీక్ష.. ట్విట్టర్‌లో రివ్యూ !

జాతి రత్నాలు సినిమాతో క్రేజీ హీరోగా పాపులారిటీ సాధించిన నవీన్ పొలిశెట్టి, టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం విడుదలకు సిద్దమైంది.రొమాంటిక్, కామెడీ, ఎమోషన్ కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రేక్షకులకు చేరువ అవుతున్నది. సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. ఈ సినిమాపై ఆయన సమీక్షను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చిరంజీవి ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాచూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్‌టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా చేస్తూ తీసుకున్న సరికొత్త కథాంశం. జాతి రత్నాలు మూవీకి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్‌గా ఉన్న మనందరి దేవసేన అనుష్క శెట్టి ఈ చిత్రానికి ప్రాణం పోశారు అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Ms Shetty Mr Polishetty first Review by Megastar Chiranjeevi: Here the twitter review legendery Actor

ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ కావడంతోపాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన యువ డైరెక్టర్ మహేష్ బాబును అభినందించాల్సిందే అని చిరంజీవి ప్రశంసలతో ముంచెత్తారు.

Ms Shetty Mr Polishetty first Review by Megastar Chiranjeevi: Here the twitter review legendery Actor

By The Way మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్‌లో ప్రేక్షకులందరితోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు! అని చిరంజీవి సినిమాపై తన అభిప్రాయాలతో సమీక్షను ట్విట్టర్‌లో వదిలారు.

Ms Shetty Mr Polishetty first Review by Megastar Chiranjeevi: Here the twitter review legendery Actor

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో నటించిన అనుష్క శెట్టికి, నవీన్ పొలిశెట్టికి, దర్శకుడు మహేష్ బాబుకు, నిర్మాతలకు, యూవీ క్రియేషన్ బ్యానర్, సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా, మ్యూజిక్ డైరెక్టర్ రధన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు,శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ ద్వారా విషెస్ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X