Mufasa: The Lion King Review: ముఫాసా: ది లయన్ కింగ్ రివ్యూ అండ్ రేటింగ్.. మహేశ్ బాబు మ్యాజిక్ అలా!
నటీనటులు (డబ్బింగ్): మహేశ్ బాబు, బ్రహ్మనందం, ఆలీ, ఆర్‌సీఎం రాజు తదితరులు
దర్శకత్వం: బ్యారీ జెన్‌కిన్స్
స్క్రీన్ ప్లే: జెఫ్ నాథాన్సన్
నిర్మాత: అడెలే రొమాన్స్కీ
సినిమాటోగ్రఫి: జేమ్స్ లెక్ట్సన్
మ్యూజిక్: డావే మెట్జజెర్
ఎడిటింగ్: జోయ్ మెక్ మిలాన్
బ్యానర్: వాల్ట్ డిస్నీ పిక్చర్స్
రిలీజ్: 2024-12-20
అడవికి రారాజు సింబా కుమారుడు సింబా కుమారుడైన యువరాజు ముఫాసా కొన్ని పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులకు దూరమవుతాడు. అనాథగా మారిన ముఫాసాను టాకా అలియాస్ స్కార్, అతడి తల్లి ఇషే చేరదీస్తే.. తండ్రి ఒబాసీ వ్యతిరేకిస్తాడు. ముఫాసాను ఆదరించి తన సొంత సోదరుడిగా టాకా ప్రేమను కురిపిస్తాడు. టాకా, ముఫాసా మధ్య స్నేహం బలంగా మారుతుంది. అయితే ఒబాసి సామ్రాజ్యంపై శత్రు సేనలు (తెల్ల సింహాలు) దాడి చేస్తారు. ఆ దాడిని తప్పించుకోవడానికి పారిపోవాలని టాకా, ముఫాసాకు ఒబాసి సలహా ఇస్తాడు.
సింబాకు ముఫాసా ఎలా దూరమయ్యాడు? రాజ్యాధికారం చేపట్టాల్సిన ముఫాసా అనాథగా ఎలా మారాడు? అనాథగా మారిన ముఫాసాకు ఎదురైన సమస్యలు, అవమానాలు ఎలాంటివి? టాకాతో కలిసి ముఫాసా ఎలాంటి జీవితాన్ని ఆస్వాదించాడు? ఒబాసి రాజ్యంపై దండెత్తిన శత్రువుల బారి నుంచి ముఫాసా, టాకా ఎలా తప్పించుకొన్నారు? బలమైన శత్రువులను ఎదురించి టాకాను ముఫాసా ఎలా కాపాడాడు? శత్రువులతో ముఫాసా ఎలాంటి పోరాటం చేశాడు? శత్రు సైన్యానికి వ్యవిరేకంగా ఇతర జంతువులను ఎలా ఏకం చేశాడు? చివరకు తన కుటుంబాన్ని ముఫాసా చేరుకొన్నాడా? సింబా రాజ్యాధికార పగ్గాలను ముఫాసా చేజిక్కించుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానామే ముఫాసా ది లయన్ కింగ్ సినిమా కథ.

సినిమా చరిత్రలో అత్యంత పాపులారిటీ ఉన్న లయన్ కింగ్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ముఫాసా కోసం దర్శకుడు బ్యారీ జెన్‌కిన్స్ అనుసరించిన కథ నేపథ్యం విషయానికి వస్తే.. ఎమోషన్స్‌తో సాగేలా ప్లాన్ చేసుకోవడం ఈ మూవీకి బ్యూటీగా మారింది. రఫికి, కియారా, టిమోన్ తదితర క్యారెక్టర్లతో కథను చెప్పిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇక తెలుగు వెర్షన్ కోసం మహేష్ బాబు, బ్రహ్మనందం, ఆలీ, ఆర్‌సీఎం రాజుతో చెప్పిన తెలుగు డైలాగులు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. సెకండాఫ్‌లో ముఫాసా తన శత్రువులను ఎదురించి టాకాను కాపాడుకొన్న తీరు సినిమాకు హైలెట్‌గా మారాయి. ఫస్టాఫ్‌లో చాలా స్లోగా సాగడం, అసలు కథలోకి వెళ్లకుండా క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొన్న సమయం సినిమాను సాగదీసినట్టు అనిపిస్తుంది.
ఇక తెలుగు వారి హృదయాలకు లయన్ కింగ్ సినిమా ఎంతో చేరువైన చిత్రం. అలాంటి చిత్రానికి మహేశ్ బాబును కనెక్ట్ చేయడంతో సగం సక్సెస్‌ను సాధించారని చెప్పవచ్చు. ఇక మహేశ్ బాబు చెప్పిన డైలాగ్స్ సినిమాకు వేరే లెవెల్. ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో సూపర్ స్టార్ చెప్పిన మాటలు మూవీకి బలంగా మారాయి. బ్రహ్మనందం, ఆలీ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు హాస్యాన్ని పండించాయి. ఆర్సీఎం రాజుతోపాటు ఇతర నటీనటులు చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాను తెలుగు వారు ఓన్ చేసుకొనేలా చేసిందని చెప్పవచ్చు.

ముఫాసా ది లయన్ కింగ్ సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు అదనపు ఆకర్షణ. జేమ్స్ లెక్ట్సన్ సినిమాను రిచ్‌గా మార్చింది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. డావే మెట్జజెర్ మ్యూజిక్ బాగుంది. తెలుగులోకి పాటల అనువాదం చెత్తగా ఉంది. కొన్ని చోట్ల సంభాషణ విషయంలో అనువాదంపై మరికొంత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేదనపిస్తుంది. తెలుగు నేటివిటీకి దగ్గరగా డైలాగ్స్ ఉంటే మరింత కనెక్ట్ అయ్యేదనిపిస్తుంది. జోయ్ మెక్ మిలాన్ ఎడిటింగ్ బాగుంది. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
అడవికి రారాజు సింబా కుమారుడైన ముఫాసా అతి సాధారణ వ్యక్తిగా, అనాథగా మారి.. తన వారసత్వాన్ని, రాజాసాన్ని ఎలా నిలబెట్టుకొన్నాడనేది ముఫాసా ది లయన్ కింగ్ సినిమా కథ. ముఫాసా ది రైజ్‌గా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే.. మహేష్ బాబు ఈ సినిమా స్టార్ వాల్యూ తీసుకొచ్చారు. రెండున్నర గంటలపాటు ఫ్యామిలీ, పిల్లలు ఎంజాయ్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి. థియేట్రికల్ వాల్యూ ఉన్న సినిమా ఇది. ఈ వారాంతంలో థియేటర్‌లో కొత్త అనుభూతిని పొందడానికి అవకాశం ఉన్న సినిమా. ముఫాసా మిమ్మల్ని నిరాశపరచడు.


Click it and Unblock the Notifications











