Mukhya Gamanika Review అల్లు అర్జున్ కజిన్ టాలీవుడ్ ఎంట్రీ.. ముఖ్య గమనిక సినిమా సమీక్ష
నటీనటులు: వీరన్ ముత్తంశెట్టి, లావణ్య సాహుకార, ఆర్యన్ ఇప్పిలి, చిత్రం బాషా తదితరులు
దర్శకత్వం: వేణు మురళీధర్
నిర్మాతలు: రాజశేఖర్, సాయి కృష్ణ
మ్యూజిక్: కిరణ్ వెన్న
సినిమాటోగ్రాఫర్: వేణు మురళీధర్
ఎడిటర్: శివ శ్రావణి
రిలీజ్ డేట్: 2024-02-24
అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కుమారుడు వీరన్ (వీరన్ ముత్తంశెట్టి). తండ్రి మరణం తర్వాత సదాశివపేట పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరుతాడు. డ్యూటీలో చేరిన వెంటనే ఆర్జే పురుషోత్తం మిస్సింగ్ కేసు దర్యాప్తు చేయాల్సి వస్తుంది. పురుషోత్తం మిస్సింగ్ కేసు విషయంలో భార్య అపూర్వను విచారించగా తన జీవితంలోకి వచ్చిన ఇషాన్ గురించి, ఆయన మరణం గురించి చెప్పబ్దె దర్యాప్తు ఆసక్తికరంగా మారుతుంది.
వీరన్ తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో మరణించాడు? వీరన్ తండ్రి మరణానికి కారణం ఏమిటి? పురుషోత్తం కనిపించకుండా పోవడం వెనుక కారణం ఎవరు? పురుషోత్తం భార్య అపూర్వ జీవితంలోకి వచ్చిన ఇషాన్ ఎవరు? ఇషాన్ మరణం వెనుక సీక్రెట్ ఏంటి? అనుమానాస్పద మరణాలు, అదృశ్యాలకు కారణం ఏమిటని దర్యాప్తులో తేలింది అనేది ముఖ్య గమనిక సినిమా కథ.

సినిమాటోగ్రాఫర్‌గా మారిన దర్శకుడు వేణు మురళీధర్ రాసుకొన్న కథ బాగుంది. కథలో ట్విస్టులు, వాటిని డీల్ చేసిన విధానం ప్రేక్షకుడిని మెప్పించేలా ఉంది. కానీ బరువైన పాత్రలకు ఊరు పేరు తెలియని నటులను తీసుకోవడంతో అవి తేలిపోయాయి. అంతా కొత్తవారే కావడంతో ఆ పాత్రల్లో ఉండే ఎమోషన్స్‌ను పూర్తిస్థాయిలో పండించలేకపోయారు. మూవీలోని పాత్రలకు కొంచెం ప్రేక్షకులు గుర్తుపట్టే నటులు ఉంటే.. స్టోరీ కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ కజిన్ వీరన్ ముత్తంశెట్టి యాక్టింగ్‌కు కొత్తవాడైనప్పటికీ.. తనవంతుగా మెప్పించే ప్రయత్నం చేశాడు. అలాగే పురుషోత్తం, ఇషాన్, అపూర్వగా లావణ్య తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. విలన్‌గా చిత్రం బాషా కూడా తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు ఒకే అనిపించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కిరణ్ వెన్న మ్యూజిక్ బాగుంది. కొన్ని సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. దర్శకుడిగానే కాకుండా సినిమాటోగ్రాఫర్‌గా వేణు మురళీధర్ ఫుల్ మార్కులు కొట్టేశారు. ఎడిటర్, ఇతర విభాగాలు ఫర్వాలేదనిపించాయి. రాజశేఖర్, సాయికృష్ణ అనుసరించిన నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కొత్తవారితో ప్రయోగం చేయకుండా కొంచెం పేరు ఉన్న నటులతో సినిమా తీసి ఉంటే.. బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదనిపించింది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











