twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భక్తిరస ప్రేమకథ

    By Staff
    |

    Murari
    చిత్రం: మురారి
    నటీనటులు: మహేష్‌ బాబు, సోనాలి బింద్రే, సత్యనారాయణ, గొల్లపూడి, లక్ష్మి..
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: ఎన్‌.రామలింగేశ్వరరావు
    కథ, స్క్రీన్‌ ప్లే, ఎడిటింగ్‌, దర్శకత్వం: కృష్ణవంశీ

    మూడ్స్‌ ను బట్టి సినిమా తీస్తానని చెప్పుకునే కృష్ణవంశీ లేటేస్ట్‌ మూడ్‌ ప్రేమ. అందుకే ఈ సారి ప్రయోగాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి అందమైన ప్రేమకథ తీశాడు. కోస్తాంధ్రా నేపథ్యంలో తీసిన మురారి రిచ్‌ నెస్‌ ఉన్న ప్రేమకథ చిత్రం. ప్రేమకు దైవానికి ముడిపెట్టి తీసిన మురారిలో ఆకట్టుకునేది స్క్రీన్‌ ప్లే, మహేష్‌ నటన. మహేష్‌, సోనాలిల ప్రేమాట, చిలిపి తగాదాలు రోమాన్స్‌ పాతలో కొత్త. లవర్‌ బోయ్‌ గా ఈ సినిమాలో మహేష్‌ నటన బావుంది. మహేష్‌ లోని ఈజ్‌ నెస్సే సినిమా ఆసాంతం చూసేలా చేస్తుంది.

    19వ శతాబ్దంలో ఏదో ఒక సంవత్సరంలో ఒక తాగుబోతు సంస్థానాధీశుడు అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. అప్పు తీర్చేందుకు దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తాడు. దాంతో దేవత ఆగ్రహాం చెంది అతన్ని చంపేస్తుంది. ఆ వంశాన్ని మొత్తం శపిస్తుంది. ప్రతి 48 ఏళ్ళకోసారి వాళ్ళ వంశంలో ఒకర్ని దేవత బలితీసుకొంటుంది. ప్రస్తుత కాలంలో ఎవరు చనిపోతారోనని ఆ ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటారు. చనిపోయిన తాత రూపంలో పుట్టిన మురారి(మహేష్‌ బాబు) అంటే అందరికీ ప్రేమ, గౌరవం. ముఖ్యంగా మురారి బామ్మ శబరి తన భర్తే మళ్ళీ మురారి రూపంలో పుట్టాడని భావిస్తుంది.

    ఈ మురారి తన చిన్ననాటి మరదలు వసుంధరను పెద్దయ్యాక చూడగానే ఇష్టపడుతాడు. ఇక అప్పట్నుంచీ ఆమెను ఆటపట్టస్తూ, పాటలు పాడుతూ కాలం గడుపుతుంటాడు. వసుంధర కూడా మురారిని ప్రేమిస్తుంది. ఇద్దరి తల్లితండ్రులు వీరి ప్రేమను అంగీకరిస్తారు. కానీ మురారి బామ్మ శబరి ఒప్పుకోదు. దాంతో తమని ఇంటికి పిలిచి అవమానించారని భావించిన వసుంధర అన్న వేరే అతనికి(బుల్లిబాబు)ఇచ్చి పెళ్ళి చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ సారి దేవత బలిగొనేది మురారేనని, అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకోలేదని శబరి నిజం చెపుతుంది. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరూ తనను ఏమీ చేయలేరని, వసుంధరను పెళ్ళిచేసుకుంటానని మురారి బయలుదేరుతాడు. వసుంధరను తీసుకువస్తుండగా బుల్లిబాబు పొడిచేస్తాడు. శబరి పూజలు చేసి, తను గోదావరిలో మునిగి మురారిని బతికిస్తుంది.

    కథనం బావున్నా చిత్రం నిడివి(లెంగ్త్‌) తగ్గిస్తే పట్టు ఉండేది. స్క్రీన్‌ ప్లే రైటర్‌ గా కృష్ణవంశీ సక్సెస్‌ అయ్యాడు. మహేష్‌, సోనాలిబెంద్రె ల ప్రేమ సన్నివేశాలు అన్ని పాతవే ఐనా ఫ్రెష్‌ నెష్‌ ఉంది. పెళ్ళి వంటి హిట్‌ చిత్రాలు అందించిన ప్రముఖ నిర్మాత ఎన్‌.రామలింగేశ్వరావు ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు పెట్టారు. గ్రాఫిక్స్‌ తో పాటు ధనవంతుల రైతు కుటుంబం ఇంటి కోసం వేసిన సెట్స్‌, నిమ్మకాయలతో దీపాలు చేయడం వంటివి వాటికోసం భారీగా ఖర్చు చేశారు. ఈ చిత్ర కళాదర్శకుడు శ్రీనివాస రాజు ప్రతిభ మాత్రం ఎక్సెలెంట్‌. మూడు పాటలు బావున్నాయి. మణిశర్మ రీరికార్డింగ్‌ బావుంది. కథ కన్నా కథనం బాగున్న చిత్రాల కోవలో ఈ సినిమాను కూడా చేర్చొచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X