Music School Review ఎమోషన్ బెల్ మోగని మ్యూజిక్ స్కూల్.. శ్రీయా సరన్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

Rating:
1.5/5

నటీనటులు: శ్రీయా సరన్, శర్మాన్ జోషి, ప్రకాశ్ రాజ్, సింగర్ షాన్, లీలా శాంసన్, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ తదితరులు
దర్శకత్వం, నిర్మాత, రచయిత: పాపారావు బియ్యాల
సినిమాటోగ్రఫి: కిరణ్ డియాన్స్
ఎడిటింగ్: మనన్ సాగర్
బ్యానర్స్: యామిని ఫిల్మ్స్, వెంకటేశ్వర క్రియేషన్స్, ఆదిత్య మూవీస్
రిలీజ్ డేట్: 2023-05-12

మ్యూజిక్ స్కూల్ కథ ఏమిటంటే? :గోవాకు చెందిన మేరీ డీక్రూజ్ (శ్రీయా సరన్) హైదరాబాద్‌లోని కార్పోరేట్ స్కూల్‌కు మ్యూజిక్ టీచర్‌గా వస్తుంది. మార్కులే పరమావధిగా భావించే తల్లిదండ్రులు తమ పిల్లలకు మ్యూజిక్, డ్రామా, స్పోర్ట్స్ లాంటి విషయాలకు దూరంగా పెడుతారు. స్కూల్‌లో పరిస్థితుల కారణంగా భార్య మరణించడంతో కూతురుతో కాలం గడుపుతున్న డ్రామా టీచర్ మనోజ్ (శర్మాన్ జోషి)కి మేరీ దగ్గరవుతుంది. వారిద్దరూ కలిసి ప్రైవేట్‌గా మ్యూజిక్, డ్రామా స్కూల్ పెట్టి పిల్లలచే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే నాటకాన్ని ప్రదర్శించాలని అనుకొంటారు.

Music School Review and Rating: Shriya Sarans efforts fails

మ్యూజిక్ స్కూల్ మూవీలో ట్విస్టులు:పిల్లలకు మ్యూజిక్ నేర్పించాలనే మంచి తపన ఉన్న మేరీకి స్కూల్‌లో ఎదురైన సమస్యలు ఏమిటి? ఏ కారణంగా మనోజ్‌కు మేరీ దగ్గరైంది? పిల్లలకు మ్యూజిక్, డ్రామా నేర్పించే క్రమంలో వారికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? కూతురు వల్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విక్రమ్ రెడ్డి (ప్రకాశ్ రాజ్)కి ఎదురైన క్లిష్ట పరిస్థితి ఏమిటి? పోలీస్ కమిషనర్ కూతురి వల్ల మేరీ, మనోజ్ ఎలాంటి కష్టాలను అనుభవించారు? మేరీ లవ్ బ్రేకప్ ఎందుకు జరిగింది? లవర్ అల్బర్ట్ (సింగర్ షాన్)తో మేరీ లవ్ సక్సెస్ అయిందా? మనోజ్‌కు దగ్గరైన మేరీ ఆయనను పెళ్లి చేసుకొందా? అనే ప్రశ్నలకు సమాధానమే మ్యూజిక్ స్కూల్ సినిమా కథ.

Music School Review and Rating: Shriya Sarans efforts fails

మ్యూజిక్ స్కూల్ ఎలా ఉంది?:మ్యూజిక్ స్కూల్‌ కథ విషయానికి వస్తే.. స్టోరీలో మంచి కాన్సెప్ట్ కనిపిస్తుంది. కానీ బలమైన పాయింట్ చుట్టు ఆ కథను చెప్పాలనే విషయంలో టోటల్‌గా యూనిట్ ఫెయిల్ అయింది. శ్రీయ, శర్మాన్ జోషి, సింగర్ షాన్, ప్రకాశ్ రాజ్, లీలా శాంసన్ లాంటి టాప్ ఆర్టిస్టులకు మంచి క్యారెక్టర్లు డిజైన్ చేయడంలో విఫలం కావడం వల్లే ఈ సినిమా ఫీల్ గుడ్‌గా మారలేదనే అభిప్రాయం కలుగుతుంది. కథ విషయం పక్కన పెడితే.. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోలేకపోయింది. కథలో బలం లేకపోవడం వల్ల ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మంచి సందేశాన్ని ఇవ్వాలనే దర్శకుడి విజన్ ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

Music School Review and Rating: Shriya Sarans efforts fails

శ్రీయా సరన్, ఇతరుల గురించి:నటీనటులు విషయానికి వస్తే.. శ్రీయా సరన్ ఒక్కరే మ్యూజిక్ స్కూల్ సినిమాలో ఆకర్షణీయంగా, గ్లామర్ రోల్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. శర్మాన్ జోషి క్యారెక్టర్‌కు కావాల్సిన ఎమోషన్స్ తెర మీద కనిపించలేదు. కూతురు విషయంలో విక్రమ్ రెడ్డిగా ప్రకాశ్ రాజ్ పాత్ర చుట్టూ ఉండే డ్రామా పండలేకపోవడం వల్ల ఈ సినిమాకు ఉండే పరమార్థమే మిస్ అయిందనిపిస్తుంది. శర్మాన్ జోషి, లీలా శాంసన్, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ పాత్రలు కథకు కనెక్ట్ కాలేక పూర్తిగా తేలిపోయాయి.

Music School Review and Rating: Shriya Sarans efforts fails

టెక్నికల్‌గా ఎలా ఉందంటే? :సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కిరణ్ డియాన్స్ సినిమాటోగ్రఫి బాగుంది. గోవాలోని కొన్ని సన్నివేశాలు, కొన్ని పాటలను ఫర్వాలేదనే విధంగా చిత్రీకరించారు. లైటింగ్, బ్యాక్ డ్రాప్, కలర్ కాంబినేషన్ లాంటి విషయాలు సన్నివేశాలను, సినిమాను రిచ్‌గా కనిపించేలా చేసింది. ఇక ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ చాలా దారుణంగా ఉంటుంది. పాటలు ఈ సినిమాకు పూర్తిగా మైనస్. కథలో డెప్త్ లేకపోవడం వల్ల పాటలు సింక్ కాలేకపోయాయి. అంతంతా మాత్రంగా ఉండే కథకు పాటలు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. మిగితా విభాగాల పనితీరు అంతంత మాత్రమే.

Music School Review and Rating: Shriya Sarans efforts fails

ఫైనల్‌గా మ్యూజిక్ స్కూల్‌ ఎలా ఉందంటే? :పిల్లల ప్రతిభకు మార్కులే కొలమానం కాదు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులతోపాటు మ్యూజిక్, స్పోర్ట్స్, డ్రామా లాంటి సబ్జెక్టులు కూడా ఇంపార్టెంట్ అనే సింగిల్ పాయింట్ కథ బాగా అనిపిస్తుంది. కానీ ఆ కథను చెప్పాలనుకొన్న పర్పస్‌ దారుణంగా ఉంది. సినిమా వెనుక దర్శకుడు, నిర్మాత, రచయిత పాపారావు బియ్యాల ఉద్దేశం బాగుంది. ఉద్దేశం బాగున్నంత మాత్రాన సరిపోదు కదా.. కథ, కథనాలు, పాత్రల డిజైన్ బాగుండేలా కసరత్తు జరిగి ఉంటే సినిమా డెఫినెట్‌గా తారే జమీన్ పర్ లాంటి సినిమా రేంజ్ కాకుండా అలాంటి ఫీల్ గుడ్ మూవీగా మారి ఉండేదనిపిస్తుంది. టీనేజ్ లవ్ గురించిన చర్చించిన విధానం బాగుంది. ఓవరాల్‌గా విజన్ గొప్పది.. మిషన్ ఫెయిల్యూర్‌గా మ్యూజిక్ స్కూల్ కనిపిస్తుంది. స్కూలింగ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X