Music Shop Murthy Review: మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా రివ్యూ

Rating: 2.75/5

నటీనటులు: అజయ్ ఘోష్, చాందినీ చౌదరీ, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు
దర్శకుడు: శివ పాలడుగు
నిర్మాతలు: హర్ష గారపాటి, రంగారావు గారపాటి
మ్యూజిక్: పవన్
సినిమాటోగ్రఫి: శ్రీనివాస్ బెజుగం
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
రిలీజ్ డేట్: 2024-06-14

బతుకు తెరువు కోసం మ్యూజిక్ షాపును నిర్వహించే మూర్తి (అజయ్ ఘోష్) జీవితంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఆ వ్యాపారాన్ని వదులుకోడు. ఇక భార్య జయ (ఆమని) పిండివంటలు చేసి కూతుళ్లను చదివిస్తుంది. లాభసాటిగా లేని మ్యూజిక్ షాపును అమ్మేసి మొబైల్ షాపును పెట్టాలని జయ అనుకొంటుంది. అయితే ఆర్తికంగా గిట్టుబాటు లేని మ్యూజిక్ షాపును మూసేసి మూర్తి డిజే నేర్చుకోవాలని అనుకొంటాడు. ఇక అమెరికాలో ఉన్నత చదువు చదువుకొని వచ్చిన అంచనా (చాందిని చౌదరీ) డీజేగా రాణించాలని అనుకొంటుంది. కానీ తండ్రి (భానుచందర్)కు తన కూతురు డీజే కావడం ఇష్టం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అంజనాను మూర్తి కలిసి డీజే కోర్సును నేర్చుకోవాలనుకొంటాడు.

Music Shop Murthy Movie Review in Telugu  Ajay Ghosh heart melting performance

అయితే డీజే కోర్సును మూర్తి ఎందుకు నేర్చుకోవాలనుకొంటాడు? మొబైల్ షాపు పెట్టాలనే కోరిక జయ కోరిక తీరిందా? డీజే కావాలనుకొన్న అంజనా ప్రయత్నం ఫలించిందా? డీజే అంటే ఇష్టం లేని తండ్రి ఆలోచనను అంజనా మార్చిందా? డీజే అవ్వాలన్న మూర్తి కోరికను ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అభ్యంతరం చెప్పారు. అంజన, మూర్తి రిలేషన్స్‌పై ఎవరికి? ఎందుకు అనుమానాలు వచ్చాయి? డీజే నేర్చుకోవాలనుకొన్న మూర్తికి ఎదురైన కష్టాలు ఏమిటి? ఇంతకు మ్యూజిక్ షాప్ మూర్తి డీజే మూర్తిగా మారాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కథ.

మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా పూర్తిగా ఫీల్ గుడ్ అంశాలతో సాగే మూవీ. కమర్షియల్ హంగులకు పోకుండా, ఆడియెన్స్‌ను ఎమోషన్స్ గురి చేసే సీన్లను రాసుకొన్న విషయంలో దర్శకుడు శివ పాలడుగు తన టాలెంట్‌ను చూపించుకొన్నాడు. మనసులో ఏదైనా సాధించాలనే బలమైన కోరిక ఉంటే.. వయసుతో సంబంధం లేదనే స్పూర్తిదాయకమైన పాయింట్‌తో కథను నడిపించిన విధానం బాగుంది. ఫ్యామిలీ, ఎమోషన్స్, మానవ సంబంధాలను చక్కగా చెప్పిన తీరు బాగుంది. హంగులు, ఆర్బాటాలు లేకున్నా రెండున్నర గంటలు ప్రేక్షకుడిని మెప్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

Music Shop Murthy Movie Review in Telugu  Ajay Ghosh heart melting performance

అజయ్ ఘోష్ తెలుగుదనం ఉట్టిపడే పాత్రలను గతంలో చేశారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే సత్తా ఉన్న నటుడైన ఆయనకు సినిమా భారాన్ని మొత్తం మోసే వచ్చిన అవకాశాన్ని అద్బుతంగా వినియోగించుకొన్నాడు. పాత్రలో ఒదిగిపోవడంతోపాటు ఈ ఏజ్‌లో కూడా స్టెప్పులేస్తూ ప్రేక్షకులకు హుషారెత్తించారు. అంజనాగా చాందినీ చౌదరీ మరోసారి తన ప్రతిభను నిరూపించుకొనే పాత్రలో నటించి మెప్పించింది. అజయ్ ఘోష్‌తో పోటీ పడి ఫెర్ఫార్మ్ చేశారు. జయగా ఆమని, ఇతర పాత్రల్లో భానుచందర్, దయానంద్ రెడ్డి తమ పాత్రలకు సంపూర్ణంగా న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కంటెంట్‌ను పూర్తిగా ఎలివేట్ అయ్యే విధంగా ప్రతీ విభాగం చేసిన పనితీరు బాగుంది. ముఖ్యంగా బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్, సన్నివేశాలను పేర్చిన తీరు.. స్టోరిని ఫీల్ గుడ్ ఫ్లోలో నడిపించిన తీరు బాగుంది. శ్రీనివాస్ బెజగం, పవన్ మ్యూజిక్, హర్ష, రంగారావు గారపాటి అనుసరించిన నిర్మాణ విలువలు చూస్తే.. సినిమాపై వారికి ఉన్న అభిరుచి, తపన కనిపిస్తుంది.

Music Shop Murthy Movie Review in Telugu  Ajay Ghosh heart melting performance

హ్యుమన్ ఎమోషన్స్, ఫీల్ గుడ్ కంటెంట్‌తో కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా రూపొందిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. అజయ్ ఘోష్, చాందినీ చౌదరీ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పాజిటివ్ అంశం. ఈ వారం ఫ్యామిలీతో కలిసి చూడదగిన చిత్రం. మ్యూజిక్ షాప్ మూర్తి వన్ టైమ్ వాచ్ మూవీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X