My Baby DNA Movie Review: మై బేబీ DNA మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: ఆథర్వ, నిమిషా సజయన్, చేతన్, బాలాజీ శక్తివేల్, రమేష్ తిలక్, మహ్మద్ జీషన్ అయ్యుబ్, రిత్విక, బోస్ వెంకట్ తదితరులు
కథ, దర్శకత్వం: నెల్సన్ వెంకటేశన్
నిర్మాత: సురేష్ కొండేటి
సహ నిర్మాత: సాయి చరణ్ తేజ పుల్లా
సినిమాటోగ్రఫి: పార్తీపన్
ఎడిటింగ్: వీజే సాబు జోసెఫ్
మ్యూజిక్: జిబ్రాన్ వాయిబోదా (బీజీఎం)
బ్యానర్: సురేష్ కొండేటి ఫిలింస్, ఒలంపియా మూవీస్
లవ్ బ్రేకప్‌తో తప్పతాగి పిచ్చోడిగా తిరిగే ఆనంద్ (ఆథర్వ)కు చిన్నతనం నుంచే మానసిక వైకల్యంతో బాధపడే దివ్య (నిమిషా సజయన్)కు పెళ్లి జరుగుతుంది. కొడుకు పెళ్లి జరిగిందని ఆనంద్ తండ్రి, కూతురు వివాహం ఎలాంటి సమస్యల లేకుండా జరిగిపోయిందని దివ్య తల్లిదండ్రులు సంతోషపడుతారు. ఇక వారి సంసారం సవ్యంగా సాగి గవర్నమెంట్ హాస్పిటల్‌లో దివ్య ఓ పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే తనకు తెచ్చి ఇచ్చిన బిడ్డ మరొకరి బిడ్డ.. తనకు ఇచ్చిన నేను కన్న బిడ్డ కాదు అంటూ గొడవ పెడుతుంది. అయితే ప్రసవం తర్వాత ఇలాంటి మానసిక సమస్యలు రావడం సహజం. ఇప్పటికే దివ్యకు అలాంటి వ్యాధితో బాధపడుతున్నందున్న ఈ విషయం గురించి పట్టించుకోవద్దని హాస్పిటల్ వర్గాలు తేల్చేస్తారు. కానీ తనకు ఇచ్చిన బిడ్డ తాను కన్న కొడుకు కాదని పిచ్చిగా అరుస్తుంది.
దివ్య బిడ్డను హాస్పిటల్ వర్గాలు తారుమారు చేశారా? లేక మానసిక రుగ్మతతో దివ్య అలాంటి ఆరోపణలు చేసిందా? నిజంగా బిడ్డను తారుమారు చేస్తే ఎవరు ఆ పనికి పాల్పడ్డారు? బిడ్డల మార్పిడి చేసేది నిజమైతే.. దివ్య బిడ్డనే ఎందుకు మార్చారు? తమ బిడ్డ కాదని భార్య చెప్పిన తర్వాత ఆనంద్ పరిస్థితి ఏమిటి? డీఎన్ఏ పరీక్షల్లో ఏం తేలింది? ఆనంద్ పోలీస్ కంప్లైంట్‌కు అధికారులు ఎలా స్పందించారు? చివరకు ఆనంద్ బిడ్డను ఎవరు తీసుకెళ్లారనే విషయం తెలిసిందా? అనే ప్రశ్నలకు సమాధానమే మై బేబీ DNA సినిమా కథ.

తమిళంలో ఘన విజయం సాధించిన DNA సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి మై బేబీ DNA పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ఎంచుకొన్న పాయింట్ సూపర్ అని చెప్పవచ్చు. ఇక ఆ స్టోరి పాయింట్‌ను చెప్పడానికి చేసిన రీసెర్చ్.. తాను చేసిన పరిశోధనను తెర మీద సన్నివేశాలుగా మలిచిన తీరు అద్బుతంగా ఉంటుంది. అనుక్షణం ఎంగేజింగ్‌గా, గ్రిప్పింగ్‌గా కథ అనేక మలుపు తిరుగుతూ ఆద్యంతం ప్రేక్షకుడి టాలెంట్‌కు పరీక్ష పెట్టేలా కథను దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ నడిపించాడు. సినిమాలో ఒక్క సన్నివేశం ఇది వేస్ట్ అని చెప్పడానికి వీలు లేకుండా సినిమాను సూపర్బ్‌గా రూపొందించారు.
నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా కథలో ఆనంద్‌గా అథర్వ, దివ్యగా నిమిషా, కానిస్టేబుల్‌గా బాలాజీ శక్తివేల్ నటన హైలెట్‌గా చెప్పుకోవాలి. బ్రేకప్ అయిన ప్రేమికుడిగా, బిడ్డను కోల్పోయిన తల్లి పడే ఆవేదనకు న్యాయం చేయాలనే భర్తగా, తన కన్నబిడ్డను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే తండ్రిగా అథర్వ ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నటనే కాకుండా యాక్షన్ సీన్లలో కూడా బాగా నటించాడు. మానసిక సమస్యతో బాధపడే యువతిగా, పుట్టిన కొడుకు దక్కని తల్లిగా అద్బుతంగా నటించింది. ఇక అథర్వకు తోడుగా కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన బాలాజీ శక్తివేల్ ఫీల్‌గుడ్ ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను కొత్త జోన్‌లోకి తీసుకెళ్లాడు. మహ్మద్ జీషన్ అయ్యుబ్ పాత్ర నిడివి తక్కువే అయినా.. గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు.
ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించిన జీబ్రాన్‌కు ఫుల్ మార్కులు వేయాల్సిందే. ముఖ్యంగా సెకండాఫ్ ఎమోషనల్ సీన్లలో, యాక్షన్ సన్నివేశాల్లో.. క్లైమాక్స్‌లో టెంపుల్ ఎపిసోడ్‌లో మ్యూజిక్‌తో అరిపించేశాడు. ఇక సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ కూడా తామే తక్కువ కాదనే విధంగా సినిమాను పరుగులు పెట్టించారు. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ హై క్లాస్‌లో ఉన్నాయి. అలాగే పాత్రలకు నటీనటుల ఎంపిక చాలా బాగుంది. ఈ సినిమా కమర్షియల్‌గా ఆలోచించి.. ఇంకా క్రౌడ్ పుల్లింగ్ స్టార్స్‌ను తీసుకొంటే.. ఇంకా బెటర్ రిజల్డ్ వచ్చే అవకాశం ఉండేది అనిపించింది. స్క్రీన్ మీద నుంచి తల తిప్పకుండా.. చూసేలా ఈ సినిమా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా చూశాను. మీకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. థియేటర్లలో ఈ సినిమా చూడండి. మంచి అనుభూతి కలుగుతుంది.


Click it and Unblock the Notifications











