My Name is Shruthi Review ట్విస్టులతో సాగే మర్డర్ మిస్టరీ.. మై నేమ్ ఈజ్ శృతి రివ్యూ

Rating: 2.75/5

నటీనటులు: హన్సిక మోత్వాని, ఆడుక్కాలమ్ నరేన్, రాజా రవీంద్ర, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, తదితరులు
నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్
దర్శకత్వం: శ్రీ‌నివాస్ ఓంకార్
సినిమాటోగ్రాఫర్: కిశోర్ బోయిడ‌పు
సంగీతం: మార్క్ కె రాబిన్‌
ఎడిటర్: చోటా కే ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: జి సుబ్బారావు
పోస్ట‌ర్ డిజైనింగ్‌: విక్ర‌మ్ విజ‌న్స్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్: అమృత బొమ్మి
కాస్ట్యూమ్ ఛీఫ్: స‌ర్వేశ్వ‌ర‌రావు
కో ప్రొడ్యూస‌ర్: ప‌వ‌న్‌కుమార్ బండి
రిలీజ్ డేట్: 2023-11-17

శృతి (హన్సిక మోత్వానీ) యాడ్ ఫిల్మ్ మేకర్. చరణ్‌ (సాయి తేజ)తో ప్రేమలో పడుతుంది. అయితే తనను మోసం చేసి తన స్నేహితురాలితో ప్రియుడు డేటింగ్ చేస్తున్నాడనే విషయం తెలుసుకొంటుంది. ఆ క్రమంలో ప్రియుడితో గొడవ పడుతుంది. ఆ తర్వాత తన ఫ్లాట్‌లో అను (పూజా రాంచంద్రన్) అనే యువతి శవం లభిస్తుంది. దాంతో శృతిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ క్రమంలో శృతిని ఎమ్మెల్యే గురుమూర్తి (అడుక్కాలమ్ నరేన్) మనుషులు చంపడానికి ప్రయత్నిస్తుంటారు.

My Name is Shruthi Movie Review and Rating: Hansika motwani steal the show

ప్రియుడు చరణ్‌తో గొడవ పడి అతడిని శృతి ఎందుకు ఎటాక్ చేస్తుంది? పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత శృతికి ఎదురైన సమస్యలు ఏమిటి? పోలీస్ అధికారి రంజిత్ (మురళీ శర్మ) ఈ కేసును ఎలా విచారించాడు? శృతి నుంచి రంజిత్ ఎలాంటి సమాచారం రాబట్టాడు? పోలీసులకు శృతి చెప్పిన విషయాలు ఎంత వరకు వాస్తవం? గురుమూర్తికి స్క్రిన్ స్పెషలిస్టు, బ్యూటిషియన్ కిరణ్మయి (ప్రేమ)కు ఉన్న సంబంధం ఏమిటి? మర్డర్ మిస్టరీలో తన బావ బాబీ (ప్రవీణ్)ని ఎందుకు అనుమానించింది? అనే ప్రశ్నలకు సమాధానమే మై నేమ్ ఈజ్ శృతి సినిమా కథ.

విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత భార్యకు స్క్రిన్ సమస్య రావడంతో కిరణ్మయి ఎంట్రీతో స్క్రిన్ గ్రాఫ్టింగ్ అనే ఓ కాస్మోటిక్ ఇండస్ట్రీ కుంభ కోణం కథ అనే లీడ్ ఇచ్చి కథలోకి తీసుకెళ్తాడు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. ఇక ఫస్టాఫ్‌లో ట్విస్టులు వదులుకొంటూ కథను ముందుకు తీసుకెళ్లిన తీరు కొంత నిదానంగా సాగడంతో మూవీ స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఓ మర్డర్ ట్విస్ట్ ఇచ్చి సినిమాపై ఆసక్తిని రేపడంలో దర్శకుడు సఫలమయ్యారు.

My Name is Shruthi Movie Review and Rating: Hansika motwani steal the show

ఇక సెకండాఫ్‌పై పెట్టుకొన్న అంచనాలకు తగినట్టుగానే కథను దర్శకుడు పరుగులు పెట్టించారు. దర్శకుడి స్క్రీన్ ప్లేకు తగినట్టుగా హన్సిక ఫెర్ఫార్మెన్స్ జత కావడంతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఫస్టాఫ్‌లో వదలిన ట్విస్టులను జాగ్రత్తగా క్లోజ్ చేసుకొంటూ వెళ్లడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులను డీల్ చేసిన తీరు అతడు రాసుకొన్న స్క్రీన్ ప్లే పాజిటివ్‌గా మారింది. క్లైమాక్స్‌లో మంచి ట్విస్ట్‌తో డీల్ చేసిన విధానం బాగుంది.

నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు హన్సిక మోత్వాని బలంగా నిలిచింది. సినిమా భారాన్నంతా తన భుజాలపై మోసింది. గ్లామర్, ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్లలో హన్సిక నటన బాగుంది. యాక్షన్ సీన్లలో కూడా ఆకట్టుకొన్నది. ఇక ఈ మూవీలో ఆడుక్కాలమ్ నరేన్, మురళీ శర్మ పాత్రలు ఇంటెన్స్‌గా సాగాయి. ప్రేమ గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. పూజా రామచంద్రన్ విలన్ రోల్‌లో కొత్తగా కనిపించడమే కాకుండా తన పాత్ర పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేసింది. ఈ సినిమాలో చాలా రకాల పాత్రల్లో ఉన్నాయి. వాటిలో నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

My Name is Shruthi Movie Review and Rating: Hansika motwani steal the show

టెక్నికల్ విషయాలకు వస్తే..
మార్క్ కే రాబిన్ అందించిన మ్యూజిక్ బాగుంది. చాలా సన్నివేశాలను మ్యూజిక్ ఎలివేట్ చేసింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా టిపికల్‌గా ఉంటుంది. సీన్లను ఎడిట్ చేసి సినిమాను పరుగులు పెట్టించేలా చోటా కే ప్రసాద్ తన అనుభవాన్ని తెరపైన చూపించారు. సినిమాటోగ్రఫి బాగుంది. మిగితా విభాగాలు ఫర్వాలేదనిపించాయి. ముఖ్యంగా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నిర్మాత బురుగు రమ్య ప్రభాకర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్వాలిటీ కోసం రాజీ పడకుండా మూవీని అందించారు.

మై నేమ్ ఈజ్ శృతి సినిమా ట్విస్టులతో కూడిన స్క్రీన్ ప్లేతో సాగే మర్డర్ మిస్టరీ. ఈ సినిమా స్క్రిన్ గ్రాఫ్టింగ్ అనే పాయింట్ కొత్తగా ఉంది. మెడికల్ మాఫియాలోని కుంభకోణాలను తెర మీద చెప్పే చిత్రంగా రూపొందింది. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక విలువలు బాగున్నాయి. మర్డర్ మిస్టరీలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. హన్సిక ఫ్యాన్స్‌కు ఆమె నిరాశపరచదు. ఇది పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. వన్ టైమ్ వాచ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X