నవదీప్-సదా ‘మైత్రి’ మూవీ రివ్యూ...

By Bojja Kumar

నటుడిగా మంచి గుర్తింపుతో పాటు హీరో ఫేస్ కూడా ఉంది కానీ.... పాపం నవదీప్‌కు ఇప్పటి వరకు కెరీర్లో హిట్ అనేది లేకుండా పోయింది. తాజాగా మరోసారి వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 'మైత్రి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోయిన్‌గా క్రేజ్ తగ్గి పోయి సదా ఈ చిత్రంలో నాయిక. సూర్యా రాజు దర్శకత్వంలో వచ్చిన ఈచిత్ర విశేషాలేమిటో చూద్దాం...

Nadeep Mythri movie review

సంస్థ: హను సినీ క్రియేషన్స్‌
నటీనటులు: నవదీప్‌, సదా, డాక్టర్‌ బ్రహ్మానందం, ఉత్తేజ్‌, చిత్రం శీను, సుమన్‌ శెట్టి, భిక్షు, కళ్ళు చిదంబరం, సత్యం రాజేష్‌, కీర్తి, అల్లరి సుభాషిణి, జయవాణి, ఇషిక తదితరులు
నిర్మాత: రాజేష్‌కుమార్‌
సంగీతం: వికాస్
ఛాయాగ్రహణం: సెల్వ
ఎడిటింగ్: వినయ్,
కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం: సూర్యరాజు

సినీ డైరెక్టర్ కావాలని కలలు కావాలనే కుర్రాడు దీపు(నవదీప్) చిత్రం శ్రీను, ఉత్తేజ్‌లతో కలిసి తమ తమ ప్రయత్నాల్లో ఉంటారు. హను టీవీ ఓనర్ మూర్తి(బ్రహ్మానందం) వీళ్లకి ఓ చిన్న ప్రాజెక్టు చేసే అవకాశం ఇస్తాడు. ఇందు కోసం పాత బంగ్లాను అద్దెకు తీసుకుంటారు. ఆ బంగ్లా యజమాని, మోడల్ అయిన మైత్రి(సదా) యమ హాట్ అండ్ సెక్సీగా ఉండటంతో తన ప్రాజెక్టులో హీరోయిన్ గా నటించమని కోరతాడు. ఆమె కూడా అందుకు అంగీకరిస్తుంది. చిత్రీకరణ సాగుతుండగా ఆ పాత బంగ్లాలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ విశేషాలు ఏమిటో తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్ విషయంలో హీరో హీరోయిన్లు నవదీప్-సదా, ఇతర నటీనటులు ఫర్వాలేదనిపించారు. సదా తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్ కి మంచి కిక్కెక్కించింది. టెక్నికల్ అంశాల విషయంలో డైలాగులు ఫర్వాలేదు. హారర్ అండ్ సస్పెన్స్ నేపథ్యంలో సాగే ఈచిత్రంలో కెమెరామెన్ పని తీరు, బ్యాగ్రౌండ్ స్కోరు ఓకే అనేలా ఉన్నాయి. దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే బాగో లేదు. చార్మి హీరోయిన్ గా వచ్చి మంత్ర చిత్రం చూసిన ఫీల్ కలుగుతుంది కొన్ని చోట్ల. సినిమాలో రెండు పాటల చిత్రీకరణ ఫర్వాలేదు. హాట్ సీన్లు కోరుకునే వారికి ఆరారె పెదవే సాంగు నచ్చుతుంది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందనే విషయానికొస్తే....బోరింగ్ మూవీ. సస్పెన్స్, హారర్ ఆశించి వెళ్లిన వారికి కూడా నిరాశ తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X