For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Na venta paduthunna chinnadevadamma review లవ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా.. షికారు ఫేమ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్ ఎలా

  |

  న‌టీన‌టులు: తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ, త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నారెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌ త‌దిత‌రులు
  క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాటలు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ వందెల‌
  స్క్రీన్‌ప్లే, పాట‌లు: డాక్ట‌ర్ భ‌వ్య దీప్తి రెడ్డి
  నిర్మాత‌లు: ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు
  ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: ముల్లేటి నాగేశ్వ‌రావు
  సినిమాటోగ్ర‌ఫి: పీ వంశీ ప్ర‌కాష్‌
  సంగీతం: సందీప్ కుమార్‌
  ఎడిట‌ర్‌: నంద‌మూరి హరి
  స్టంట్స్‌: రామకృష్ణ‌
  కొరియోగ్ర‌ఫి: గ‌ణేష్‌ మాస్టర్, నండిపు రమేష్
  పీఆర్వో: మధు వీ ఆర్
  రిలీజ్ డేట్: 2022-10-14

  Na venta paduthunna chinnadevadamma

  పశ్చిమ గోదావరి జిల్లాలోని రావులపాలెం ప్రెసిడెంట్ కొడుకు రాధ (తేజ్ కూర‌పాటి), జువ్వాలపాలెం ప్రెసిడెంట్ కూతురు కృష్ణ (అఖిల ఆక‌ర్ష‌ణ)కు ఎలాంటి పరిచయం ఉండదు. కానీ రెండు గ్రామాల వైరం పెట్టాలనే కుట్రతో రాధ, కృష్ణ మధ్య అఫైర్ ఉందని జోగీ బ్రదర్స్ పుకార్లు క్రియేట్ చేస్తాడు. తనతో అఫైర్ ఉందనే పుకార్ల మధ్య కృష్ణ ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఆమెను చూసి ప్రేమలో పడుతాడు. అఫైర్ పుకార్ల నేపథ్యంలో రాధతో, కృష్ణతో వారి తల్లిదండ్రులు గొడవ పడుతారు. ఇంట్లో చికాకుల నుంచి తప్పించుకోవడానికి ఒకే బస్సులో రాధ, కృష్ణ తిరుపతికి చేరుకొంటారు. తిరుపతిలో కృష్ణకు ఎదురైన భయంకరమైన సంఘటన నుంచి రాధా కాపాడటంతో వారిద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది.

  తిరుపతికి చేరిన రాధ, కృష్ణకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తిరుపతిలో కాలేజ్ చైర్మన్‌ అరుణ్ గోఖలే (తనికెళ్ల భరణి)ని ఎందుకు కలిశారు? తిరుపతిలో రాధ, కృష్ణ ఒకే రూమ్‌‌లో ఉండగా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంటి నుంచి పారిపోయిన రాధ, కృష్ణ హత్యకు గురైనట్టు వచ్చిన వార్తకు వారి తల్లిదండ్రుల రియాక్ట్ అయ్యారు. రాధ, కృష్ణ నిజంగా హత్యకు గురయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా సినిమా కథ.

  Na venta paduthunna chinnadevadamma

  హుషారు, షికారు, రౌడీ బాయ్స్ లాంటి చిత్రాల్లో తనదైన శైలిలో ఆకట్టుకొన్న తేజ్ కూర‌పాటి తాజా చిత్రం నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా చిత్రంలో పూర్తిస్థాయి హీరో పాత్రలో కనిపించాడు. తన నటనతో సినిమాను ఫన్‌గా, ఎమోషనల్‌గా మార్చడంలో తన ప్రతిభను చాటుకొన్నారు. కీలక సన్నివేశాల్లో పరిణతితో కూడిన యాక్టింగ్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తో తన పాత్రలో ఒదిగిపోయాడు. కృష్ణ పాత్రలో అఖిల ఆకర్షణ కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. తేజ్, అఖిల మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. మిగితా పాత్రల విషయానికి వస్తే. అరుణ్ గోఖలే పాత్రలో నటించిన తనికెళ్ల భరణి పాత్ర సర్‌ప్రైజ్ ఎలిమెంట్. రాధ తల్లి తండ్రులుగా డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్, కృష్ణ తల్లితండ్రులుగా బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, మాధవి ప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేశారు. జోగి బ్రదర్స్, జీవా తమ పాత్రలకు న్యాయం చేశారు.

  గ్రామీణ నేపథ్యంతో లవ్, ఎమోషన్స్ స్కోప్ ఉన్న పాయింట్ ఎంచుకోవడమే కాకుండా దర్శకుడు వెంకట్ వందెల , యూత్‌ఫుల్‌ ఎంటర్‌‌టైన్‌మెంట్‌‌గా మలిచే ప్రయత్నం అభినందనీయం. కొత్త, పాత నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకొన్నారు. కథ, కథనాలపై మరికొంత కసరత్తు చేసి ఉంటే మంచి ప్రేమకథా చిత్రం అయి ఉండేది. సినిమాటోగ్రాఫర్ వంశీ ప్రకాశ్‌ అందించిన కెమెరా వర్క్ బాగుంది. సందీప్ మ్యూజిక్ సన్నివేశాలను మరింత బలంగా మార్చింది. నందమూరి హరి ఎడిటింగ్, గణేష్ మాస్టర్, సందేపు రమేష్ కొరియోగ్రఫి బాగుంది. రాజ‌ధాని ఆర్ట్ మూవీస్, జీవీఆర్ ఫిల్మ్ మేక‌ర్స్‌పై ముల్లేటి నాగేశ్వ‌రావు, ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు నిర్మించిన నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా మూవీలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను రిచ్‌గా మలచడానికి చేసిన ప్రయత్నం సినిమాపై వారికి ఉన్న అభిరుచి తెలియజేసింది. రూరల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందే ప్రేమ కథలను ఇష్టపడేవారికి నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా మూవీ తప్పకుండా నచ్చుతుంది.

  English summary
  Na venta paduthunna chinnadevadamma movie released in Theatres on 14th October. Here is the Telugu filmibeat exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X