Naa Saami Ranga Review నా సామిరంగ అనేలా ఉందా? నాగార్జున హిట్టు కొట్టాడా? మూవీ సమీక్ష

Rating:
3.0/5

నటీనటులు: నాగార్జున అక్కినేని, అషికా రంగనాథ్, అల్లరి నరేష్, మిర్నా మీనన్, రాజ్ తరుణ్, రుక్సర్ థిల్లాన్, రవి వర్మ, నాజర్, రావు రమేష్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ బిన్ని
మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
కథ: అభిలాష్ ఎన్ చంద్రన్
రీమేక్: పొరింజు మారియం జోస్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సినిమాటోగ్రఫి: దాశరథి శివేంద్ర
ఎడిటింగ్: చోటా కే నాయుడు
మ్యూజిక్: ఎంఎం కీరవాణి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, అన్నపూర్ణ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2024-01-14

Naa Saami Ranga Telugu Movie Review and Rating: Nagarjuna Akkinenis mass Entertainer

అంబాజీ పేటకు చెందిన కిష్టయ్య (నాగార్జున అక్కినేని)కి అంజి (అల్లరి నరేష్) అంటే పంచ ప్రాణాలు. అలాగే గ్రామ పెద్ద పెద్దయ్య (నాజర్) మాట జావదాటడు. వడ్డీ వ్యాపారం చేస్తూ పీడించుకు తినే (రావు రమేష్) కూతురు వరాలు అలియాస్ వరలక్ష్మీ (అషికా రంగనాథ్)ను కిష్టయ్య చిన్నతనం నుంచి ప్రేమిస్తుంటాడు. కానీ కిష్టయ్య ప్రేమను వరాలు దూరంగా పెడుతుంది. ఇదిలా ఉండగా, పెద్దయ్య కొడుకుల (భరత్ రెడ్డి, షబ్బీర్) కు కిష్టయ్య అంటే కోపం, జెలసీ. ఈ క్రమంలో రెండు గ్రామాల మధ్య సంక్రాంతి పండుగ వివాదంగా మారుతుంది.

అంజి అంటే కిష్టయ్యకు ఎందుకంత ఇష్టం? పెద్దయ మాటను కిష్టయ్య ఎందుకు జవదాటడు. మనసులో ప్రేమ ఉన్నా కిష్ట ప్రేమను ఎందుకు అంగీకరించదు? సంక్రాంతి పండుగ ప్రభల ఊరేగింపు వ్యవహారం కిష్టయ్యకు, పెద్దయ్య కొడుకులకు ఎలాంటి చిచ్చు పెట్టింది? పెద్దల కొడుకులతో ఉన్న వైరం కిష్టయ్యకు ఎలాంటి వేదనను మిగిల్చింది? గ్రామాల మధ్య గొడవను కిష్టయ్య ఎలా తీర్చాడు? చివరకు కిష్టయ్య ప్రేమను వరాలు అంగీకరించిందా? అనే ప్రశ్నకు సమాధానమే నా సామిరంగ సినిమా కథ.

Naa Saami Ranga Telugu Movie Review and Rating: Nagarjuna Akkinenis mass Entertainer

Recommended Video

Naa Saami Ranga Review..Nagarjuna Allari Naresh హిట్టు కొట్టినట్టే | FilmiBeat Telugu

పశ్చిమ గోదావరి జిల్లాలో 1963 బ్యాక్ డ్రాప్‌తో కిష్టయ్య, అంజి బాల్యం ఎమోషనల్ పాయింట్‌తో మొదలవుతుంది. ఇక భాస్కర్ (రాజ్ తరుణ్) ప్రేమ కథతో చిన్న క్లాన్ ప్లిక్ట్ సినిమాను రన్ చేస్తూ ముందుకెళ్తుంది. వరాలు, కిష్టయ్య లవ్ ట్రాక్ సినిమాకు కొంత గ్లామర్ తెచ్చిపెట్టడం లాంటి విషయాలు పక్కగా కమర్షియల్ ఎలిమెంట్స్‌గా కనిపిస్తాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో వరాలుకు సంబంధించి ఎమోషనల్ పాయింట్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను నడిపిన విధానం సినిమాకు హైలెట్‌గా అనిపిస్తుంది. ఓ పవర్ ఫుల్ పాయింట్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ కలుగ జేయడంలో దర్శకుడు విజయ్ బిన్ని సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

ఇక సెకండాఫ్‌లో పండుగ వివాదం హై నోట్‌గా అనిపించినప్పటికీ.. రొటీన్, రెగ్యులర్ సీన్లు, స్క్రీన్ ప్లే కొంత అసహనానికి గురిచేస్తాయి. కానీ వరాలు, అంజికి సంబంధించిన ఎమోషనల్ సీన్లు కథకు కనెక్ట్ అయ్యేలా చేయడంతో ఆ ఫీలింగ్ చెక్ పెట్టారనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అంజి క్యారెక్టర్ చుట్టు తిరిగిన సన్నివేశాలు భావోద్వేగంగా సాగడం సినిమాకు ఓ ప్లస్ పాయింట్. అయితే క్లైమాక్స్ టచ్ మాత్రం ఎలాంటి కొత్తదనం లేకుండా రెగ్యులర్ ప్యాటర్న్‌తో ముగించడం కొత్తదనం కోరుకొనే వారికి నిరాశ కలుగుతుంది. ఓవరాల్‌గా సంక్రాంతి పండగ ఆడియెన్స్ కోసం రెడీ చేసిన ప్రాపర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు.

Naa Saami Ranga Telugu Movie Review and Rating: Nagarjuna Akkinenis mass Entertainer

నటీనటులు విషయానికి వస్తే.. నాగార్జున ఎప్పటిలానే సంక్రాంతి పండుగ హీరోగా తన స్టైయిల్, ఎమోషన్స్‌తో ఆకట్టుకొన్నాడు. మాస్ ఆడియెన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఏం డెలివరీ చేస్తే సంతృప్తి అలాంటి ప్యాకేజ్‌తో నాగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాలో అషికా రంగనాథ్ అందంతోపాటు పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే, తండ్రి, ప్రియుడి ప్రేమకు మధ్య ఊగిసలాటకు గురైన అమ్మాయి పాత్రను కన్విన్సింగ్‌గా చేసి చూపించింది. అంజిగా అల్లరి నరేష్ మరోసారి యాక్టింగ్‌తో ఇరుగదీశారు. రాజ్ తరుణ్ పాత్ర ఇంపార్ట్‌టెంట్ అనిపిస్తుంది కానీ ఆయనకు ఫెర్ఫార్మెన్స్ స్కోప్ లభించలేదు. నాజర్, రావు రమేష్ ఎప్పటిలానే తమ పని కానిచ్చేశారు. మిర్నా, రుక్సర్, దాసు క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ తమ మార్కు చూపించారు.

టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. కీరవాణి అందించిన పాటల్లో ఎత్తుకుపోతానే పాట సినిమాలో హైలెట్‌గా ఉంటుంది. సంక్రాంతి బ్యాక్ డ్రాప్‌తో సాగే పాట కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. శివేంద్ర సినిమాటోగ్రఫి బాగుంది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ క్రిస్పిగా ఉంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కొంత ల్యాగ్ అనిపిస్తాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ ప్రమాణాలకు అనుగుణంగా శ్రీనివాస చిట్టూరి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫ్రెండ్ షిప్, లవ్, గ్రామ రాజకీయాలు, యాక్షన్ అంశాలు కలగలిపిన ప్రాపర్ సంక్రాంతి సినిమా నా సామిరంగ. ఎలాంటి కొత్తదనం లేకపోయినా.. తెలుగు ఆడియెన్స్ కావాల్సిన మసాల, కమర్షియల్ అంశాలతో ఆకట్టుకొనే ప్రయత్నం సఫలమైందనే చెప్పాలి. నాగార్జున, అల్లరి నరేష్ మధ్య బాండింగ్, అషికా గ్లామర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా అనిపిస్తాయి, బీ,సీ సెంటర్ల ఆడియెన్స్, ప్యామిలీకి నచ్చే అంశాలు ఉన్నాయి. రెండున్నర గంటలపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగే సినిమా ఇది. ఎక్కువగా ఆశించకుండా, అంచనాలు లేకుండా వెళ్తే పండుగ సినిమాలా ఉంటుంది. నా సామిరంగ అనేలా ఈ సినిమా ఉందా అనేది బాక్సాఫీస్ వద్ద కొద్ది రోజుల్లో తేలుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X