twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని - సమీక్ష

    By Staff
    |

    Naani
    చిత్రం: నాని
    నటీనటులు: మహేష్‌బాబు, అమీషాపటేల్‌, రమకృష్ణ,
    అంజలాజవేరి, మాస్టర్‌ అశోక్‌, తదితరులు
    సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌
    నిర్మాత: మంజుల
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.జె.సూర్య

    హీరో పవన్‌కళ్యాణ్‌కు 'జానీ', ఏన్టీ ఆర్‌కు 'ఆంధ్రావాలా' చిత్రాల మాదిరిగా, మహేష్‌బాబు ఖాతాలో 'నాని' మరో డిజాస్టర్‌ చిత్రంగా చేరనున్నట్లుగా కన్పిస్తోంది. ఇటీవల వచ్చిన చాలా డిజాస్టరస్‌ చిత్రాల మాదిరిగానే, ఆద్యంతం బోర్‌ కొట్టించే చిత్రం ఇది. 'వాలి', 'ఖుషీ' వంటి చిత్రాలు తీసిన దర్శకుడు ఎస్‌.జె.సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయన స్క్రీన్‌ప్లే మరీ నాసిరకంగా ఉంది. ఉన్నట్టుండి ఒక వ్యక్తి పెద్దవాడైతే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో హాలీవుడ్‌లో 80వ దశకంలో 'బిగ్‌' అనే చిత్రం వచ్చింది. ఇది విజయవంతం కావడమే కాకుండా అలాంటి అనేక చిత్రాలకు అది మార్గం సుగమమం చేసింది.

    ఆ తర్వాత ఇరవై ఏళ్ళ అనంతరం ఎస్‌.జె.సూర్య 'స్ఫూర్తి' పొంది ఈ 'నాని'ని తెలుగు ప్రేక్షకులకు మీదికి వదిలాడు. మహేష్‌బాబు నటన మినహా ఈ సినిమాలో ఎక్కడా ప్రేక్షకుడు వినోదం ఫీల్‌ అయ్యే సందర్భం గానీ, ఆకట్టుకునే సన్నివేశంగానీ లేదు. 'నాని' తల్లి సెంటిమెంట్‌ బాగానే, ఇటీవల వచ్చిన సెంటిమెంట్‌ చిత్రాల మాదిరిగానే ఉంది ఇందులోనూ.

    'ఒక్కడు', 'నిజం' చిత్రాల్లో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న మహేష్‌ తనలో ఎంతో నటన దాగి ఉందని ఈ సినిమా మరోసారి రుజువుచేసింది. అంతే. అంతకుమించి ఈ సినిమా ఎందుకు ఉపయోగపడదు. ప్రేక్షకులపరంగా చూస్తే, సినిమాను చూడకపోవడం ఉత్తమం.

    ఏ. ఆర్‌.రెహమాన్‌ పాటలు బాగున్నా, అవీ సినిమా కథనంలో పెద్దగా ఆకట్టుకోవు. స్క్రీన్‌ప్లే రచయిత కమ్‌ దర్శకుడైన సూర్యే ఈ సినిమాకు విలన్‌. భారీగా ఖర్చుపెట్టి పాటలు చిత్రీకరించడం వంటి అంశాలపై దృష్టిపెట్టిన దర్శకుడు కథ, కథనాన్ని గాలికొదిలేశాడు. బహుశా రెండు హిట్లు రాగానే, చాలా మంది దర్శకులకు అలసత్వం వస్తుందనుకుంటా.

    మహేష్‌ అభిమానులకు ఇది పెద్ద దెబ్బ. సినిమా కథ పెద్దగా ఏమీలేదు.

    ఎనిమిదేళ్ళ నాని(మహేష్‌బాబు)పై ఓ సైంటిస్ట్‌ చేసిన ప్రయోగంతో పెద్దవాడవుతాడు. తల్లి కోప్పడడం వల్ల కోల్పోయిన ప్రేమను 'పద్దమనిషి'గా లవర్‌ను పొంది 'ప్రేమ'ను అనుభవిస్తాడు. సో..పగలు 'నాని'. రాత్రి 'పెద్దమనిషి'. చివరికి తల్లి గొప్ప తెలుసుకోవడం, ప్రేమ.. ఇలా సాగుతుంది..

    రెండు వారాల క్రితమే 'థర్టీన్‌ గోయింగ్‌ థర్టీ' అనే ఓ హాలీవుడ్‌ చిత్రం విడుదలైంది. అందులో ఓ పదమూడేళ్ళ యువతి సడెన్‌గా ముప్పై ఏళ్ళ యువతిగా మారి ఇలాగే తన ప్రేమను కనుక్కుంటుంది. ఆ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్‌ రేటింగ్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. కానీ, ఇక్కడ నాని ఫెయిలైన విషయం..కథనం సరిగా లేకపోవడం, దర్శకుడి చిత్తచాపల్యం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X