నచ్చిందిలే...( రివ్యూ)


నటీనటులు:తనీష్,మాధవి లత,కాశి విశ్వనాధ్,
రక్ష,నరసింహ,నవీన్,కామేష్ తదితరులు
స్క్రీన్ ప్లే:సత్యానంద్
సంగీతం:శేఖర్ చంద్ర
కెమెరా:సుధాకర్ రెడ్డి
ఎడిటింగ్:మార్తాండ్ కె. వెంకటేష్
యాక్షన్:కనల్ కన్నన్
ఆర్ట్:నారాయణ రెడ్డి
నిర్మాత:రామోజిరావు
రచన దర్శకత్వం:రవిబాబు
రిలీజ్ డేట్:డిసెంబర్ 19,2008
చిరకాల విరామం అనంతరం యువ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవిస్ రూపొందించిన యూత్ బేసెడ్ లవ్ ఫిల్మ్ నచ్చావులే. కుర్రాళ్ళ ఆశలు,అమ్మాయిల ఆలోచనలు,తల్లితండ్రుల భాద్యతలు,ప్రేమలు కలబోసి వండిన ఈ చిత్రం ఫన్ తో నడుస్తూ..ఓ ఫీల్ గుడ్ స్టోరీగా నచ్చేస్తుంది. అలాగే అంతా కొత్తవాళ్ళతో మంచి నటన రప్పించుకున్న రవిబాబు సైతం ఈ చిత్రం విజయంతో ఏ జెనర్ సినిమానైనా చేయగలడనిపించటంతో నిలబడి పోయినట్లే.
ఇక ఈ సినిమా లవ కుమార్(తనీష్)వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది. అప్పుడే ఇంటర్ పూర్తి చేసిన అతని జీవితాశయం చాలా మంది గర్ల్ ప్రెండ్స్ ని సంపాదించాలని. అయితే చిన్నప్పటి నుండీ అదే పనిమీదున్న అతనికి అది అనుకున్నంత ఈజీ కాదని ఓ సుముహ్తాన్న ఓ మామిడి చెట్టుక్రింద జ్ఞానోదయం అవుతుంది. దాంతో ఒక అమ్మాయి మీదే పూర్తి కాన్సర్టేట్ చేస్తే మేలనే నిర్ణయానికొస్తాడు. అప్పుడు ఎంటరవుతుంది అను(మాధవి లత). కాఫీ షాపులో పనిచేసుకుంటూ చదువుకునే ఆమె పరిచయం అవుతుంది. ఓ అనుకోని సందర్భంలో ఆమె తండ్రిని రక్షించటంతో అతన్ని ఏక్సెప్ట్ చేస్తుంది. మాటలు కలిపిన లవకుమార్ ఆమెను గర్ల్ ప్రెండ్ గా నటించమని కోరుతాడు.కొన్ని కండీషన్స్ తో ఆమె ఒప్పుకుంటుంది. అయితే ఆమె వైపునుండి ప్రేమకి దారితీస్తుంది. అయితే లవకుమార్ ఆలోచనలు వేరే అమ్మాయిలపై ఉంటాయి. ఈలోగా లవ్ కుమార్ తల్లి అనారోగ్యంతో మరణిస్తుంది. అప్పుడు అతని జీవితం టర్న్ అవుతుంది. ఆ స్ధితిలో అనూ,లవ కుమార్ ఎలా తిరిగి కలిసారనేది మిగతా కథ.
గంతంలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఉషాకిరణ్ మళ్ళీ దారిలోకొచ్చింది. క్లీన్ సినిమాతో ఓ చక్కటి ప్రేమ కథను తీసి అందరిచేతా నచ్చిందిలే అనిపించుకనే ప్రయత్నం చేసారు. అయితే క్లైమాక్స్ కొద్దిగా సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. దాన్ని ట్రిమ్ చేస్తారనుకుంటా. ఇక డైలాగులు చాలా బాగా పేలాయి. ఇక మొదటి నుంచి కొడుకుపై పెద్ద ఇంట్రస్ట్ చూపని తండ్రి పాత్ర తన భార్య చనిపోయేసరికి మారటం బాగా పండింది. అలాగే హీరోయిన్ తండ్రి పాత్ర కూడా బాగా మలిచాడు. కథ,కథనాలు కూడా (క్లైమాక్స్ మినహాయిస్తే) బాగున్నాయి.అతి చిన్న బడ్జెట్ లో మంచి క్వాలిటీతో ఇలాంటి సినిమా రూపొందించటం రవిబాబుకే సాధ్యమనిపిస్తుంది.పాటల్లో పావు తక్కువ తొమ్మిది అనే పాట హంట్ చేస్తుంది. సుధాకర్ రెడ్డి కెమెరా వర్క్ చక్కగా నీటుగా ఉంది. ఇక మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు.
సందేశాలు చెప్పటానికి ఎక్కువ ప్లేసున్న సబ్జెక్టు అయినా అటువైపుకి పోక విజువల్ గానే సోషల్ మెసేజ్ ఇస్తూ సాగిన ఈ సినిమా బాగుందనిపిస్తుంది. ఎలానో ఉషాకిరణ్ వారు తమ ఈ టీవి,ఈనాడు ద్వారా పబ్లిసిటీ బాగానే చేస్తారు కాబట్టి బాగానే నిలబడే అవకాశం ఉంది.ట్రెండ్ సెట్టర్ కాకపోయినా ట్రెండ్ లో కలిసిపోతూ..ఆకర్షిస్తుంది. టిక్కెట్ డబ్బుకి న్యాయం చేస్తుంది.


Click it and Unblock the Notifications











