twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nachindi Girl Friendu Review ఆకట్టుకొనే సస్పెన్స్ థ్రిల్లర్.. స్టాక్ మార్కెట్ స్కామ్‌ నేపథ్యంగా...!

    |

    Rating: 2.5/5

    నటీనటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, సీనియర్ హీరో సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు
    నిర్మాత : అట్లూరి నారాయణ రావు
    దర్శకత్వం : గురు పవన్
    సినిమాటోగ్రఫి : సిద్దం మనోహార్
    మ్యూజిక్: గిఫ్టన్,
    ఎడిటర్: ఉడగండ్ల సాగర్
    ఆర్ట్: దొలూరి నారాయణ
    పీఆర్వో: జియస్ కె మీడియా
    రిలీజ్ డేట్: 2022-11-11

    బీకాం చదివిన రాజారాం (ఉదయ్ శంకర్) స్టాక్ మార్కెట్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ అనలిస్ట్ సంధ్య అలియాస్ శాండీ (జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్)‌ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. శాండీ ప్రేమను గెలుచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. కానీ శాండీని కలిసిన ప్రతీ ఒక్కరు అనుమానాస్పద రీతిలో మరణిస్తుంటారు. ఈ క్రమంలో రాజారాం లవ్ ప్రపోజల్‌ను శాండీ తిరస్కరిస్తుంది.

    శాండీని కలిసిన ప్రతీ వ్యక్తి ఎందుకు హత్యకు గురవుతుంటారు? శాండీకి పరిచయమైన వారిని ఎవరు హత్య చేశారు? శాండీ లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేయడంతో రాజారాం ఏం చేశాడు? రాజారాం ప్రేమలో చెర్రీ చెంగల్రావు (మధునందన్) పాత్ర ఏమిటి? ఈ కథలో కృష్ణ పాండే (శ్రీకాంత్ అయ్యంగార్), పేటీఎం ప్రసాద్ (పృథ్వీరాజ్), ముఖేష్ గౌరవ్ (సుమన్), విక్రమ్ రాయ్ పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే నచ్చిందే గర్ల్‌ఫ్రెండూ సినిమా కథ.

    ఒక రోజులో వైజాగ్ నుంచి భీమిలి సాగే రోడ్ జర్నీ పాయింట్‌ను దర్శకుడు గురుపవన్ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. లవ్ ట్రాక్‌కు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను జోడించి కథను ఆకట్టుకొనేలా నడిపించాడు. కాకపోతే.. ఫస్టాఫ్‌లో కథ కొంత రొటీన్, రెగ్యులర్‌గా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌కు వస్తే కథలో వేగంగా మలుపులు చోటుచేసుకొంటాయి. యాక్షన్ సీన్లు, రొమాన్స్ అంశాలను చక్కగా దర్శకుడు డీల్ చేశారు. చివరిగా స్టాక్ మార్కెట్ నేపథ్యంలో సాగే 20 నిమిషాలు ఎపిసోడ్ ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది.

    ఆటగదరా శివ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఉదయ్ శంకర్ లవ్, యాక్షన్, సస్సెన్స్, థ్రిల్లర్, కామెడీ, ఎమోషనల్ అంశాలతో కూడిన మూవీ భారాన్ని ఒంటిచేత్తో మోశాడు. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్‌తో కలిసి రొమాంటిక్ సీన్లలో అలరించాడు. ఫైట్స్, డ్యాన్సులు కూడా బాగా చేశాడు. డైలాగ్ డెలీవరీ, బాడీ లాంగ్వేజ్‌ను కొంత మెరుగు పరుచుకోవాల్సి ఉందనిపిస్తుంది.

    Nachindi Girl Friendu Review and Rating: Feel Good Suspense Thriller

    ఇక హీరోయిన్ జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే.. శాండీ పాత్రలో గ్లామర్ పరంగాను, యాక్టింగ్ పరంగాను ఆకట్టుకొన్నది. సినిమా భారాన్ని ఉదయ్ శంకర్‌తో పంచుకొన్నది. హీరోయిన్ చుట్టూ కథ, కథనాలు ఉండే పాత్రను మెప్పించింది. సినీ పరిశ్రమకు కొత్త అయినప్పటికీ.. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు పాత్రలో ఒదిగిపోయి ప్రతిభను చాటుకొన్నది. శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, సుమన్, భార్గవి తదితరులు తమ పాత్రలకు పరిధి మేరకు న్యాయం చేశారు.

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సిద్దం మనోహార్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ అయింది. వైజాగ్ అందాలను అద్భుతంగా కెమెరాలో బంధించాడు. టాప్ యాంగిల్, యాక్షన్ సీన్లను పర్ఫెక్ట్‌గా చిత్రీకరించాడు. సస్సెన్స్ థ్రిల్లర్ కావాల్సిన బీజీఎంను అందించడంలో గిఫ్టన్ సక్సెస్ అయ్యాడు. రొమాంటిక్‌గా సాగే పాటలు బాగున్నాయి. ఉడగండ్ల సాగర్ ఎడిటింగ్, దొలూరి నారాయణ ఆర్ట్ సినిమాకు పర్‌ఫెక్షన్ తెచ్చిపెట్టాయి. శ్రీరామ్ బ్యానర్‌పై అట్లూరి నారాయణ రావు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నటీనటులు ఎంపిక సినిమాపై బ్యానర్‌కు ఉండే అభిరుచి తెలియజేసింది. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి నచ్చింది గర్ల్‌ఫ్రెండూ నచ్చుతుంది.

    English summary
    Nachindi Girl Friendu. This movie is set to release on November 11th. Uday Shankar, Jennifer Emmanuel in lead roles. Here is the telugu filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X