Nadaaniyan Movie Review: నాదానియా మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. జాన్వీ కపూర్ సిస్టర్ మూవీ ఎలా ఉందంటే?
నటీనటులు: ఇబ్రహీం అలీ ఖాన్, కుషీ కపూర్, మహిమా చౌదరీ, సునీల్ శెట్టి, దియా మిర్జా, జుగల్ హన్స్‌రాజ్, అర్చనా పూరన్ సింగ్, మీజాన్ జాఫ్రీ, రియా సేన్, ఓరీ, అలియా ఖురేషి తదితరులు
దర్శకత్వం: శౌనా గౌతమ్
స్క్రీన్ ప్లే: ఇషితా మోయిత్రా
కథ: రివా రజ్దాన్ కపూర్
నిర్మాతలు: కరణ్ జోహర్, అపూర్వ మెహతా, సొమెన్ మిశ్రా
సినిమాటోగ్రఫి: అనుజ్ సమ్‌తానీ
ఎడిటింగ్: వైష్ణవీ భాతే, సిద్దార్థ్ సేథ్
మ్యూజిక్: సచిన్, జిగర్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: తుషార్ లాల్
బ్యానర్: ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్
ఓటీటీ రిలీజ్: నెట్ ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-03-07
బిజినెస్ మ్యాగ్నెట్ రజత్ జైసింగ్ (సునీల్ శెట్టి), నీలూ జైసింగ్ (మహిమ చౌదరీ) కూతురు పియా జైసింగ్ (కుషీ కపూర్) ఢిల్లీలోని ఫాల్కన్ హైస్కూల్‌లో స్టూడెంట్. తల్లిదండ్రుల మధ్య వైవాహిక సంబంధమైన విభేదాల కారణంగా పియా బాధపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో అర్జున్ మెహతా (ఇబ్రహీం అలీ ఖాన్)ను తన ఫేక్ బాయ్‌ఫ్రెండ్‌గా ఉంటే.. 25 వేల రూపాయలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొంటుంది.

అయితే ఫేక్ బాయ్‌ఫ్రెండ్ కారణంగా పియాకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఏర్పడింది? పియా తల్లిదండ్రులు విడాకులు తీసుకొన్నారా? చివరకు ఫేక్ బాయ్ ఫ్రెండ్ అర్జున్‌ను పియా వదిలించుకొన్నాదా? వారి బంధం ఎంత వరకు వెళ్లిందనే ప్రశ్నలకు సమాధానమే నాదానియా సినిమా కథ.
దర్శకుడు శౌనా గౌతమ్ రాసుకొన్న కథ హై క్లాస్ సోసైటిని టార్గెట్‌గా చేసుకొని రాసిన కథ. మాస్ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలు కూడా తక్కువగానే కనిపిస్తాయి. ఏకంగా మల్టీ ప్లెక్స్ ఆడియెన్స్‌కు నచ్చే విధంగా రాసుకొన్న రొమాంటిక్ కామెడీలో కొత్తగా ఎలాంటి అంశాలు కనిపించవు. సినిమా కథ అంతా ఊహించినట్టే ఉంటుంది. ముందు వచ్చే సన్నివేశాలను సులభంగా ఊహించవచ్చు. అలాగే క్లైమాక్స్ కూడా ఏం జరుగుతుందనే విషయంలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ ట్విస్ట్‌లు లేకుండానే సాగిపోతుంది. అయితే కొన్ని ఫీల్ గుడ్ అంశాలను జొప్పించడంలో తన ప్రతిభను చాటుకొన్నాడు.

ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. అయితే కీలక సన్నివేశాల్లో అతడి బాడీ లాంగ్వేజ్, హావభావాలు అంతంత మాత్రమే. కానీ డెబ్యూ హీరోగా మాత్రం పాస్ మార్కులు సంపాదించుకొన్నాడు. నటనపరంగా ఇంకా చాలా మెరుగు పడాల్సిన అవసరం ఉంది. ఇక కుషీ కపూర్ విషయానికి వస్తే.. నటనపరంగా పర్వాలేదనిపించింది. కానీ లుక్, మేకోవర్ పరంగా ఆమె స్క్రీన్ ప్రజెన్స్ యావరేజ్‌గా ఉంది. పాటల్లో డ్యాన్స్ తో ఆకట్టుకొన్నది. కొన్ని సీన్లలో డైలాగ్ డెలివరీ బాగుంది.
ఇక ఈ చిత్రంలో కుషీ కపూర్ తల్లిదండ్రులుగా గతంలో హీరో హీరోయిన్లుగా నటించిన సునీల్ శెట్టి, మహిమ చౌదరీలు కనిపించారు. అలాగే ఇబ్రహీం ఆలీ ఖాన్ తల్లిదండ్రులుగా జుగల్ హన్స్ రాజ్, దియా మిర్జా నటించారు. వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. సునీల్ శెట్టి, మహిమ కథలో ఎమోషన్స్ పండించే పాత్రల్లో కనిపించారు. ర్యాపర్ ఓరి, మిజాన్ జాఫ్రీ, రియా సేన్ అతిథి పాత్రల్లో మెరిసారు.

నాదానియా చిత్రంలో మ్యూజిక్ ప్రధానంగా కీలక పాత్రను పోషించింది. పాటలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉన్నాయి. అలాగే రొమాంటిక్, లవ్ సీన్లలో బీజీఎం బాగుంది. అలాగే సినిమాటోగ్రఫి బాగుంది. అనుజ్ సమ్‌తానీ చిత్రీకరించిన సన్నివేశాలు చాలా రిచ్‌గా ఉన్నాయి. కరణ్ జోహర్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ ధర్మ ప్రొడక్షన్ స్థాయిలో ఉన్నాయి. అయితే కథను గాలికి వదిలేసి ప్రొడక్షన్ పరంగా హై క్వాలిటీ ఉందనిపిస్తుంది.
తల్లిదండ్రుల దాంపత్యపరమైన విభేదాలు, వారి కూతురు లవ్ స్టోరీ ప్రధాన అంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇబ్రహీం అలీ ఖాన్‌ను హీరోగా ప్రొజెక్ట్ చేసేందుకు అతడి క్యారెక్టర్ స్పెషల్ డిజైన్ చేశారు. ఇన్నోసెంట్ స్టూడెంట్, లవర్‌గా ఇబ్రహీంను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కనిపించింది. అయితే బాలీవుడ్‌లో బిగ్ స్టార్స్ పిల్లల ఎంట్రీతో వచ్చే సినిమాను థియేటర్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అయితే ఈ సినిమా యావరేజ్ సినిమాగానే అనిపిస్తుంది. రొమాంటిక్ లవ్ స్టోరీలు సినిమాలను ఇష్టపడే వారికి నాదానియా సినిమా నచ్చే అవకాశం ఉంది. నెట్ ఫ్లిక్స్‌లో ఉంది కాబట్టి తీరిక చేసుకొని ఒకే స్ట్రెచ్‌లో చూసే ప్రయత్నం చేయండి.


Click it and Unblock the Notifications