Nadaaniyan Twitter Review: నాదానియా సినిమా ట్విట్టర్ రివ్యూ
బాలీవుడ్‌లో స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం ఆలీ ఖాన్ హీరోగా పరిచయం అవుతూ రూపొందించిన చిత్రం నాదానియా. లెజెండరీ హీరోయిన్ శ్రీదేవీ కూతురు కుషీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మహిమా చౌదరీ, సునీల్ శెట్టి, దియా మిర్జా, జుగల్ హన్స్ రాజ్, అర్చనా పూరన్ సింగ్ తదితరులు నటించారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ రూపొందించిన ఈ చిత్రానికి శౌనా గౌతమ్ దర్శకత్వం వహించారు. పాపులర్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో మార్చి 7వ తేదీన రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు ఫీడ్ బ్యాక్, రివ్యూ వివరాల్లోకి వెళితే..
నాదానియా సినిమా గురించి ఓ నెటిజన్ కామెంట్స్ చేస్తూ.. 2000 సంవత్సరంలో కోయి మిల్ గయా, కుచ్ కుచ్ హోతా హై, కభీ కుషీ కభీ ఘమ్, కల్ హోనా హో, దోస్తానా, అయిషా, జబ్ బీ మెట్ లాంటి మంచి సినిమాలు చూశాం. కానీ సినిమా పేరుతో నాదానియా లాంటి చెత్త సినిమాను చూస్తానని అనుకోలేదు. ఈ సినిమాను చెత్త బుట్టలో వేసిన తప్పేమీ కాదు. పాపం ఇబ్రహీం..ఇంత చెత్త సినిమాతో ఎంట్రీ ఇచ్చాడేంటి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

నాదినియా సినిమాను ఇప్పుడే చూశాను. సినిమా హాళ్లలో మనం ఫస్ట్ వరుస సీట్లను ఎలా ఇష్టపడమో.. అలాగుంది ఈ సినిమా. నాదినియా సినిమాను చూడకుంటే చాలా సురక్షితం. మీ టైమ్, మెంటల్ ఆఫర్ట్ కూడా సేవ్ అవుతుంది అంటూ ఓ నెటిజన్ ఘాటైన పోస్టు పెట్టాడు.
ఇబ్రహీం, కుషీ కపూర్ నటించిన ఈ రొమాంటిక్, కామెడీ సినిమా మీ హృదయాలను గెలుచుకొనేలా ఉంటుంది. కొత్తగా, ఫన్నీగా లవ్ స్టోరీ. ఈ సినిమా మిమ్మల్ని అనుక్షణం హ్యాపీగా ఉంచుతుంది. లైఫ్‌లో ఏదైనా మిస్ చేసుకోవచ్చేమో కానీ.. ఇలాంటి సినిమాను మిస్ చేసుకోవద్దు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
తొలి చిత్రం ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న వారిని సినిమాలను ఓటీటీలకు పరిమితం చేయడం ఎందుకో అర్ధం కాలేదు. డబ్బు, పవర్, థియేటర్లలో రిలీజ్ చేయడానికి అవకాశం ఉన్న సంస్థ ఈ సినిమాను ఓటీటీలో ఎందుకు రిలీజ్ చేయాలని అనుకొందో తెలియడం లేదు. ఎందుకంటే నాదినియా కంటే ఎంతో బెటర్ వెబ్ సిరీస్‌లు, ఇతర యాక్టర్లు నటించిన సినిమాలు ఓటీటీలో ఇది వరకే ఉన్నాయి. సరేలే నాదినియా సినిమాపై ఓ లుక్ వేయండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
నాదానియా సినిమాను భరించడం కష్టం. ఏ హీరోకు కూడా జరుగనట్టుగా ఇబ్రహీం అలీకాన్ ఎంట్రీ చాలా చెత్తగా జరిగింది. ఇబ్రహీంకు యాక్టింగ్ శూన్యం. పేలవంగా డైలాగ్ డెలివరీ. అసలు స్క్రీన్ ప్రజెన్స్ లేదు. సినిమా కథ డల్‌గా ుంది. కథ బలహీనంగా.. సినిమా తెరకెక్కించిన విధానం దారుణంగా ఉంది. దయచేసి ఈ సినిమాను చూడొద్దు అని నెటిజన్ కామెంట్ చేశాడు.
నాదానియా సినిమా చూడటానికి చాలా కష్టపడ్డాను. కుషీ కపూర్ యాక్టింగ్ బాగా లేదు. రిచ్ కిడ్స్ సినిమాను చూస్తే.. స్కూల్‌లో రొమాన్స్, కామెడీగా ఉంది. కరణ్ జోహర్ ఇక సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవాలి. కుచ్ కుచ్ హోతా హై రోజులు ఇక రావేమో అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
నాదానియా మూవీ ఆరంభంలో చెత్తగా అనిపించినా.. ఆ తర్వాత నేను సినిమాను ఎంజాయ్ చేశాను. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇబ్రహీం అలీ ఖాన్ బాగానే నటించాను. కానీ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే కుషీ కపూర్ కూడా నటనపరంగా ఇంకా కష్టపడాలి. కథ పర్వాలేదనిపిస్తుంది. ఈ రొమాంటిక్ సినిమా యావరేజ్‌గా ఉంది. నా రేటింగ్ 2.5/5 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











