Lakshya Movie Review: గురితప్పిన లక్ష్యం.. నాగశౌర్య ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

Rating:
2.0/5

కెరీర్ ఆరంభంలో వరుస సక్సెస్‌లను అందుకొన్న యువ హీరో నాగశౌర్య ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల వచ్చిన వరుడు కావలెను మూవీ ఫీల్‌గుడ్ పేరు తెచ్చుకొన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మంచి విజయం కోసం దర్శకుడు సంతోష్ జాగర్లపూడితో కలిసి లక్ష్య మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే లక్ష్య మూవీ ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాల గురించి సమీక్షించాల్సిందే.

లక్ష్య మూవీ కథ

లక్ష్య మూవీ కథ

విలువిద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉన్న క్రీడాకారుడు పార్థు (నాగశౌర్య). తనకు మనోధైర్యంగా నిలిచిన తాత (సచిన్ ఖేడేకర్) అండతో విలువిద్యలో విశేషంగా రాణిస్తుంటారు. అయితే పార్థు ప్రతిభను చూసి ఓర్వలేక పోయిన మరో క్రీడాకారుడు రాహుల్ (శత్రు) ఓ కుట్రను పన్నుతాడు. జాతీయ స్థాయి పోటీలకు ముందు కుడిచేతి మణికట్టుకు గాయం కావడం, డ్రగ్స్ ఆరోపణలు రావడంతో పోటీల నుంచి పార్థు డిస్‌క్వాలిఫై అవుతాడు. దాంతో మద్యానికి పార్థు బానిస అవుతాడు. ప్రియురాలు రితిక (కేతిక శర్మ)కు దూరం అవుతాడు.

 లక్ష్యలో కీలక మలుపులు

లక్ష్యలో కీలక మలుపులు

విలువిద్య క్రీడాకారుడికి అత్యంత బలమైన మణికట్టుకు ఎలా గాయం అయింది? పార్థుపై డ్రగ్స్ వినియోగం ఆరోపణలు ఎలా వచ్చాయి? తన తాతను కోల్పోయిన పార్థుకు రితిక ఎలాంటి మెంటల్ సపోర్ట్ ఇచ్చింది? తన ప్రత్యర్థి రాహుల్‌ను పార్థు ఎలా ఎదురించి తన తండ్రి, తాత కలను నెరవేర్చుకొన్నాడు? తనకు దూరమైన ప్రియురాలు రితికను ఎలా దక్కించుకొన్నారు? చివరకు తన లక్ష్యాన్ని పార్థు ఎలా చేరుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే లక్ష్య మూవీ కథ.

 లక్ష్య మూవీ విశ్లేషణ

లక్ష్య మూవీ విశ్లేషణ

దర్శకుడు సంతోష్ జాగర్లమూడి ఎంచుకొన్న పాయింట్ బాగానే ఉంది. దానిని ప్రేక్షకులను మెప్పించే విధంగా, ఎమోషన్‌తో కూడిన పూర్తిస్థాయి కథగా మలచలేకపోయారు. పార్థు బాల్యానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఎమోషనల్‌గా స్టార్ట్ అయినప్పటికీ.. ఆ భావోద్వేగాన్ని కొనసాగించలేకపోవడం మైనస్‌గా మారింది. పార్థు క్యారెక్టర్‌ను బలంగా రాసుకొన్న దర్శకుడు.. మిగితా పాత్రలను మెరుగైన విధంగా మలచలేకపోయాడని చెప్పవచ్చు. కేతిక శర్మ, జగపతి బాబు క్యారెక్టర్లు తేలిపోయాయి. వెరసి అసాధారణమైన మారాల్సిన కథ సాధారణంగా మారింది. తొలిభాగం చాలా రొటీన్‌గా సాగడం, సెకండాఫ్‌లో కూడా అదే పంథాను కొనసాగించడంతో లక్ష్యం గురితప్పిందనే ఫీలింగ్ కలుగుతుంది.

 హీరో నాగశౌర్య గురించి

హీరో నాగశౌర్య గురించి

హీరో నాగశౌర్య విషయానికి వస్తే.. ఎప్పటిలానే తన వంతుగా బెస్ట్ ఇచ్చాడు. కథ, కథనాల్లో పస లేకపోవడం వల్ల సినిమాను నాగశౌర్య నిలబెట్టలేకపోయాడనేది స్పష్టంగా తెరమీద కనిపిస్తుంది. 8 ప్యాక్ బాడీతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తాడు. యాక్షన్ సీన్లలోను, ఎమోషనల్ సీన్లలోను బాగా ఫెర్ఫార్మ్ చేశాడు. మంచి సినిమాలో నటించాలనే ఆయన ప్రయత్నంలో లోపం లేదని చెప్పవచ్చు.

కేతిక శర్మ ఇతర నటీనటులు గురించి

కేతిక శర్మ ఇతర నటీనటులు గురించి

మిగితా క్యారెక్టర్లలో కేతిక శర్మను గ్లామర్‌పరంగా చూపించడంలో విఫలయ్యారు. నాగశౌర్యతో పెద్దగా కెమిస్ట్రీ వర్కువుట్ కాకపోవడం సినిమాకు మరో మైనస్ పాయింట్. జగపతి బాబు పాత్ర లేటుగా ఎంట్రీ ఇచ్చినా అప్పటికే జరుగాల్సిన డామేజ్ జరిగిపోయింది. సచిన్ ఖేడేకర్‌ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కమెడిన్ సత్య ఉన్నా ఒక్క కామెడీ సీన్ కనిపించదు. విలన్‌గా శత్రు లుక్ డిఫరెంట్‌గా ఉంది. అతడి బాడీ లాంగ్వేజ్ కూడా బాగుండటమే కాకుండా కొత్తగా కనిపించాడు. కానీ రాహుల్ పాత్రలో బలం లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోయాడు. మిగితా పాత్రలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

సాంకేతిక అంశాల గురించి

సాంకేతిక అంశాల గురించి

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. రామిరెడ్డి ఫోటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్లను బాగా డీల్ చేశాడు. ఈ సినిమాలో మ్యూజిక్ పెద్దగా స్కోప్ లేకపోయింది. బేసిక్‌గా సన్నివేశాలు పేలవంగా ఉండటం కారణంగా కాలభైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వర్కువుట్ కాలేదు. ఇతర విభాగాల పనితీరు కూడా సో సోగా ఉంది.

ఫైనల్‌గా ఎలా ఉందంటే..

ఫైనల్‌గా ఎలా ఉందంటే..

ఇప్పటి వరకు తెర మీద రాని విలువిద్య క్రీడ ముఖ్య కథాంశంగా, కొంత ఎమోషన్స్‌తో కూడిన సినిమాగా లక్ష్య రూపొందింది. కథ, కథనాలు సరిగా లేకపోవడం వల్ల సినిమా రెగ్యులర్‌గా, రొటీన్‌గా సాగుతుంది. మంచి ఎమోషన్స్, థ్రిల్లింగ్ అంశాలకు చోటు ఉన్న ఆ దిశగా ప్రయత్నం చేయలేదనే విషయం కనిపిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి సినిమా నచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ రాత ఎలా ఉంటుందో వారాంతం వరకు వేచి చూస్తే ఫలితం స్పష్టంగా తెలుస్తుంది.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
నాగశౌర్య పెర్ఫార్మెన్స్

నెగిటివ్ పాయింట్స్
కథ, కథనాలు
ఆర్టిస్టుల క్యారెక్టరైజేషన్
ఎమోషన్స్ పండకపోవడం

 లక్ష్య మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

లక్ష్య మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు


నటీనటులు: నాగశౌర్య, కేతిక శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, శత్రు, రవిప్రకాశ్, కమెడియన్ సత్య తదితరులు
రచన, మాటలు, దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి
నిర్మాతలు: నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్
సినిమాటోగ్రఫి: రామ్‌రెడ్డి
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ
మ్యూజిక్: కాలభైరవ
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2021-12-10

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X