నిరాశపర్చే నాగ

By Staff

Naga
-జలపతి
చిత్రం: నాగ
నటీనటులు: ఎన్టీఆర్‌, సదా, జెన్నిఫర్‌, రఘువరన్‌
సంగీతం: విద్యాసాగర్‌, దేవా
నిర్మాత: ఎ.ఎం.రత్నం
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సురేష్‌

ఒక హీరో అన్నింటికన్నా గొప్పవాడు అతనే ఇమేజ్‌ ముఖ్యం అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. గతంలో చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు దీనివల్లే బోల్తాపడ్డాయి. తాజాగా ఎన్టీఆర్‌ జూనియర్‌ ను కూడా అదే రీతిలో ఊహించుకుంటున్నారు. ఫలితం -నాగ. కథలో బలం లేకున్నా కేవలం ఎన్టీఆర్‌ అతి యాక్షన్‌ దృశ్యాలతో సినిమా నడుస్తుందని దర్శకుడు, కథారచయితలు భావించి ఉంటారు. ఒకే ఒక్కడు, ఇతర చిత్రాల కథలను అటు ఇటు మార్చి అతిగా రూపొందించి ఎన్టీఆర్‌ ఇమేజ్‌ తో సినిమా లాగించాలని ప్రయత్నించారు. రాజకీయం, యాక్షన్‌ దృశ్యాలతో సినిమా నడిపించాలంటే పవర్‌ ఫుల్‌ స్క్రీన్‌ ప్లే ఉండాలి.

ఒకే ఒక్కడు చిత్రం విజయం కావాడానికి శంకర్‌ దర్శకత్వపు స్టైల్‌ కన్నా, కథను నడిపించిన తీరే ప్రధానం. కానీ నిర్మాత ఎ.ఎం.రత్నం తన భారీ బడ్జెట్‌ దృశ్యాలు, ఎన్టీఆర్‌ యాక్షన్‌ తో సినిమా లాగించేయచ్చు అని భావించి ఉంటారు. అందుకే 20 ఏళ్ళ కుర్రాడితో నమ్మశక్యం కానీ పొలిటికల్‌ డైలాగ్స్‌, దృశ్యాలు, ఆస్తులను ధ్వంసం చేసే దృశ్యాలు పెట్టారు. వాటిని, వీటిని హీరో పగులగొడితేనే, సినిమా బాక్సాఫీస్‌ బద్దలవుతుందనుకునే మెంటాలిటీ ఇది. హీరో ఎన్టీఆర్‌, సంగీతమే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలు. బలహీనమైన కథను, అంతకన్నా బలహీనమైన కథను ఎన్టీఆర్‌ ఒక్కడు భారంగా నడిపించుకొని వచ్చాడు.

తమిళంలో వచ్చిన తమిళన్‌ అనే చిత్రం కథను కాస్తా మార్చి ఈ చిత్రాన్ని రూపొందించారు. నాగ(ఎన్టీఆర్‌) లా విద్యార్థి. ఆయన తండ్రి రఘువరన్‌ కోర్టులో బంట్రోతు. కొడుకును పెద్ద లాయర్‌ గా చూడాలని ఆయన కోరిక. అయితే, రాష్ట్రంలోని దుష్టరాజకీయాలు నాగపై ప్రభావం చూపుతాయి. ముఖ్యమంత్రి(నాజర్‌)ని దించాలని భావించే హోంమంత్రి(రాజన్‌) అనుచరులు గొడవ సృష్టిస్తారు. ఈ గొడవ సందర్భంగా నాగ ఇంటిలోకి వచ్చి రఘువరన్‌ ను, ఆయన కూతురును గాయపరుస్తారు. దీంతో నాగ రెచ్చిపోయి వాళ్ళను చితకబాది హోంమంత్రి దుష్టపన్నాగాన్ని బయటపెట్టి ముఖ్యమంత్రి మెప్పు పొందుతాడు. యువ రాజకీయనాయకుడిగా నాగ ఎదుగుతాడు. కానీ రాజకీయాలు నాగ జీవితాన్ని ఎలా మార్చాయన్నది మిగతా కథ.

ఎన్టీఆర్‌ తన మామూలు ధోరణిలో ఆవేశంగా నటించాడు. సీనియర్‌ నటులు రాజన్‌.పి.దేవ్‌, రఘువరన్‌ నటన గురించి చెప్పాల్సిందేమి ఉంది. సదా నిరాశపర్చింది. ఇందులో అందంగానూ కన్పించలేదు. నటన మామూలే. పాటల సుందరి జెన్నిఫర్‌ నటి కాదని ఎప్పుడో తేలిపోయింది. విద్యాసాగర్‌, దేవా కూర్చిన బాణీలే ఈ సినిమాకు ప్రాణం. ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. నిరాశపర్చే సినిమా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X