Nagabandham Public Talk: నాగబంధం పబ్లిక్ టాక్..
Nagabandham Public Talk: 'పెదకాపు' ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన చిత్రం 'నాగబంధం'. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్, మహేశ్ మంజ్రేకర్, జగపతి బాబు, అనసూయ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీని ఎస్. సౌందర్ రాజ్ అందించగా, సంగీతాన్ని జునైద్ కుమార్,అభిలు సమకూర్చారు. ఎడిటింగ్ బాధ్యతలను ఆర్.సీ. ప్రణవ్ నిర్వహించారు.
భారీ అంచనాల మధ్య 'నాగబంధం'సినిమా విడుదలైంది. విభిన్నమైన కథాంశం, గ్రాండ్ విజువల్స్, భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ సినిమా 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా జూలై 3న గ్రాండ్‌గా విడుదల కానుండగా, విడుదలకు ఒక రోజు ముందే జూలై 2 న ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో నాగబంధం సినిమాపై పబ్లిక్ టాక్ ( Nagabandham Movie Public Talk)ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిస్తే..

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాగబంధం' సినిమాకు తొలి షోల నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. పురాణాలు, చరిత్ర, ఫాంటసీ అంశాలను కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాతో పాటు థియేటర్ల బయట కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా విజువల్స్, క్లైమాక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వీఎఫ్‌ఎక్స్, హీరో విరాట్ కర్ణ నటన సినిమాకు ప్రధాన బలాలుగా చెబుతున్నారు. సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు "ఇది కేవలం సినిమా కాదు.. థియేటర్‌లో చూడాల్సిన విజువల్ ఎక్స్‌పీరియన్స్" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
సినిమా చూసిన ఓ అభిమాని మాట్లాడుతూ.. "నాగబంధం బ్లాక్‌బస్టర్ హిట్. గతంలో జరిగిన చారిత్రక, పురాణ అంశాలను ఎంతో అద్భుతంగా తెరపై చూపించారు. ప్రతి సీన్ ఎంతో గ్రాండ్‌గా ఉంది. హీరో విరాట్ కర్ణ తొలి సినిమా 'పెదకాపు' ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఈ సినిమా మాత్రం అతని కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ప్రేక్షకుడు పెట్టిన ప్రతి రూపాయికి పూర్తి న్యాయం చేసే సినిమా ఇది" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
మరో ప్రేక్షకుడు అయితే సినిమా క్లైమాక్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ.. "హనుమాన్ సినిమా క్లైమాక్స్ ఎంత ఎమోషనల్‌గా, గ్రాండ్‌గా ఉంటుందో.. దానికంటే కూడా ఈ సినిమా క్లైమాక్స్ మరింత గూస్‌బంప్స్ తెప్పించింది. సినిమాలో శివుడి దర్శనం, అనంత పద్మనాభస్వామికి సంబంధించిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ విజువల్‌గా రిచ్‌గా కనిపించింది. ప్రతి సీన్ గూస్‌బంప్స్ ఇస్తుంది. ఇలాంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని రావాలి. 'అంజి', 'కాంతారా' వంటి సినిమాల్లోని CGI కంటే ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ మరింత మెరుగ్గా అనిపించాయి. ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ మూవీ" అంటూ ప్రశంసించాడు.
మరో అభిమాని స్పందిస్తూ.."సినిమా చివరి 25 నిమిషాలు పూర్తిగా మరో లెవల్. ఫస్ట్ హాఫ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో ఎవరూ ఊహించని ట్విస్టులు వస్తాయి. కథ చెప్పిన విధానం చాలా ఫ్రెష్‌గా ఉంది. చివరి వరకు ఆసక్తి తగ్గదు" అని చెప్పాడు. ఇంకో ప్రేక్షకుడు మాట్లాడుతూ.. "కథ చాలా బాగుంది. స్క్రీన్‌ప్లే బలంగా ఉంది. ఎక్కడా బోర్ అనిపించకుండా సినిమా ముందుకు సాగుతుంది. మేకింగ్ క్వాలిటీ చాలా హై స్టాండర్డ్‌లో ఉంది" అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
మరో అభిమాని విజువల్స్‌పై స్పందిస్తూ.. "ఇప్పుడే 'నాగబంధం' చూశాను. విజువల్స్ పరంగా ఇది నిజంగా గ్రాండ్ స్కేల్ మైథాలజికల్ అడ్వెంచర్. ఇంతటి భారీ వీఎఫ్‌ఎక్స్ ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు అభిషేక్ నామా, మొత్తం టీమ్ అభినందనీయులు. హీరో విరాట్ కర్ణ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. స్టార్ హీరో స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు" అని పేర్కొన్నాడు.
మరో ప్రేక్షకుడు హీరో నటన గురించి మాట్లాడుతూ.. "విరాట్ కర్ణ ఆద్యంతం అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో ఆయన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. దర్శకుడు అభిషేక్ నామా రూపొందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. 'నమో రే' పాట థియేటర్‌లో మరో లెవల్ ఫీల్ ఇచ్చింది. నిక్ స్టూడియోస్ నిర్మాణ విలువలు హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. నభా నటేష్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది" అని ప్రశంసించాడు.
మరో అభిమాని మాట్లాడుతూ.. జగపతిబాబు పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో ఓ పది నిమిషాలు మాత్రమే కాస్త నెమ్మదిగా అనిపించింది. ఆ తర్వాత సినిమా పూర్తిగా పుంజుకుని చివరి వరకు ఆసక్తిగా సాగింది. ఓవరాల్‌గా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్" అని చెప్పాడు. ఇంకో ప్రేక్షకుడు హీరో గురించి స్పందిస్తూ.. "విరాట్ కర్ణ నటన అద్భుతం. కొత్త హీరో అయినా చాలా అనుభవం ఉన్న నటుడిలా కనిపించాడు. సినిమాలో చాలా 'వావ్' మూమెంట్స్ ఉన్నాయి. కథ చెప్పిన విధానం కూడా పూర్తిగా కొత్తగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి ఫ్రెష్ కాన్సెప్ట్‌లను ఖచ్చితంగా ఆదరిస్తారు' అంటూ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. అయితే ఈ పాజిటివ్ మౌత్ టాక్ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు కలెక్షన్లుగా మారుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications




