Nagabandham First Revview: నాగబంధం మూవీ ఫస్ట్ రివ్యూ

తెలుగు సినిమా రంగంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై యువ హీరో, హీరోయిన్లు విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్షా నగార్కర్ నటించిన చిత్రం నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు, మురళీ శర్మ, రామచంద్రరాజు, అనసూయ భరద్వాజ్, శరణ్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి నిర్మాత అభిషేక్ నామా తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఈ సినిమాకు కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: సౌందర్ రాజన్ ఎస్, మ్యూజిక్: జునైద్ కుమార్, అభి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జునైద్ కుమార్, ఎడిటర్: ఆర్సీ ప్రణవ్, ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్, కొరియోగ్రఫి: బృంద, గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ, యాక్షన్ కోరియోగ్రఫి: కనల్ కన్నన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. జూలై 3వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా భారీగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC ) జారీ చేసిన సర్టిఫికెట్ ఏంటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? ఈ చిత్రం గురించి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Nagabandham Review by Censor Board

హిమాలయ పర్వతాల్లోని ప్రాచీన విష్ణు ఆలయాలు, శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం, దేశంలోని ఇతర ప్రాచీన ఆలయాలను రక్షించే నాగదేవతల నేపథ్యంగా ఈ సినిమాను గ్రాండ్‌గా, రిచ్ స్కేల్‌లో సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఇలాంటి ఆలయాలపై దుష్టశక్తుల పన్నిన కుట్రను ఓ యువకుడు ఎలా భగ్నం చేశాడు? ఇతిహాసాలు, పురాణాల్లో నాగబంధం వెనుక ఉన్న అద్వితీయమైన శక్తి ఏమిటో అనే కోణంలో ఈ సినిమాను ఓ పురాణ కథగా చెప్పే ప్రయత్నం చేశారు.

భారతీయ ప్రాచీన ఆలయాల మహత్యం, సృష్టికి అందని మిస్టరీల నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవల సెన్సార్ అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ చిత్రంలోని సన్నివేశాల కూర్పు, వాటిని తెర మీదకు తీసుకొచ్చిన తీరు వెనుక పరిశోధన అంశాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సినిమాలోని కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. చిత్ర యూనిట్ ఇచ్చిన వివరణలు, చేసిన కొన్ని సవరణలతో సంతృప్తి చెందిన సెన్సార్ అధికారులు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నాగబంధం సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ (UA16+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 16 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఈ సినిమాను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న ఈ సినిమాను తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుందని సెన్సార్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు.

నాగబంధం సినిమాకు ప్రత్యేకంగా చిత్రీకరించిన సన్నివేశాలు, వీఫెక్స్ గ్రాఫిక్స్, భారీ సంఖ్యలో నృత్యకారులతో డిజైన్ చేసిన సాంగ్స్ డిమాండ్ చేయడంతో ఈ సినిమా నిడివి భారీగా పెరిగింది. సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం ఈ చిత్రం నిడివి 3 గంటల 5 నిమిషాలు అంటే.. 185 నిమిషాల రన్ టైమ్‌గా ఫిక్స్ చేసినట్టు స్పష్టమైంది. ఇటీవల కాలంలో తెలుగులో అత్యధిక రన్ టైమ్‌తో వచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ సినిమా సెన్సార్ తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ విషయానికి వస్తే.. యువ హీరో విరాట్ కర్ణ, నభ నటేష్ పెర్ఫార్మెన్స్ అంచనాలకు మించి ఉంటాయి. గణేష్ ఆచార్య డిజైన్ చేసిన సాంగ్, ఈ సినిమాకు గ్రాఫిక్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనే టాక్ వినిపిస్తున్నది. ఈ చిత్రం ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, ఇతర విశేషాల గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X